బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన శ్రీ @bhadoriabjp గారికి, సహ ఇన్ఛార్జిగా నియమితులైన శ్రీమతి @VanathiBJP గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అనుభవం, సమర్థవంతమైన మార్గనిర్దేశకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమై, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
రూ.8,000 కోట్ల భారీ పెట్టుబడితో మచిలీపట్నంలో 'గోవా షిప్‌యార్డ్' నౌకా నిర్మాణ, మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర NDA కూటమి ప్రభుత్వం ఆమోదం తెలప��ం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి మరో కీలక ముందడుగు. బందరు పోర్టుతో అనుసంధానంగా రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టుతో, రహదారి మరియు రైల్వే రవాణా పరంగా ప్రధాన కేంద్రంగా ఉన్న 'విజయవాడ నగరం' మరియు రాజధాని అమరావతి ప్రాంతానికి పారిశ్రామిక, వాణిజ్య, లాజిస్టిక్స్ మరియు ఉపాధి రంగాల్లో ఎంతో మేలు చేకూరనుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దార్శనిక నాయకత్వంలో రూపుదిద్దుకున్న భారత్ - న్యూజిలాండ్ FTA ఒప్పందం అక్టోబర్ 20, 2026 నుండి అమల్లోకి రానుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనమైన ఈ ఒప్పందంతో భారత వస్తువులకు ఎలాంటి సుంకాలు లేకుండా 100% ఉచిత మార్కెట్ ప్రవేశం, 15 ఏళ్లలో $20 బిలియన్ల పెట్టుబడులు మరియు 2030 నాటికి $5 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యం సాకారమవుతాయి. అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలతో గ్లోబల్ స్థాయిలో మన దేశ ఆర్థిక ప్రయోజనాలను నిలబెడుతున్న ప్రధాని @narendramodi గారి నాయకత్వం ఎంతో అభినందనీయం
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవ��్థల్లో ఒకటిగా ముందుకు సాగుతోంది. ప్రపంచంలో వ్యాపారం చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన దేశాల్లో వరుసగా నాలుగో ఏడాది గ్లోబల్ టాప్-3లో మన దేశం కొనసాగడం, 73% వ్యాపార సంస్థలు భారత్‌లోని వ్యాపార వాతావరణం పట్ల మొగ్గు చూపడం మనకెంతో గర్వకారణం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దృఢ సంకల్పం, పారదర్శక పాలన, విజయవంతమైన సంస్కరణలతో ప్రపంచం భారత్‌పై మరింత విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు NDA కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలోని 123 మున్సిపాలిటీల్లో రూ. 11,360 కోట్లకు పైగా అంచనా వ్యయంతో సమగ్ర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాణ్యమైన రహదారులు, పార్కులు, డివైడర్లు, LED వీధి దీపాలు మరియు సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థలను నిర్మాణం జరుగుతుంది. ప్రజలకు ఆధునిక వసతులు కల్పిస్తూ, మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేత్రుత్వంలోని కేంద్ర NDA కూటమి ప్రభుత్వం అందిస్తున్న అపారమైన సహకారానికి కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) కింద పెరిగిన నిధుల కేటాయింపులే సజీవ సాక్ష్యం. 2024-25లో రూ.14,109 కోట్లు, 2025-26లో రూ.15,126 కోట్లు కేటాయించగా, 2026-27లో ఏకంగా రూ.25,304 కోట్లకు పెంచడం జరిగింది. గత రెండేళ్లలో దాదాపు 79% పెరుగుదల రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని శ���రీ @narendramodi గారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం.
2015లో జరిగిన పారిస్ COP21 సదస్సులో 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను గడువుకు ముందే సాధించిన ఏకైక G20 దేశంగా భారత్ నిలవడం గర్వకారణం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సమర్థ నాయకత్వం, పట్టుదల, దృఢ నిబద్ధతకు ఇది నిదర్శనం. ఉద్గారాల తీవ్రతను తగ్గించడంతో పాట��� పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్‌ను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ఆయన నాయకత్వానిదే.
దేశవ్యాప్తంగా 51,000 మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన 'రోజ్‌గార్ మేళా' వేదికగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రసంగం అత్యంత స్ఫూర్తిదాయకం.
'' తల్లిదండ్ర��లు, కుటుంబ సభ్యుల కృషి ఫలితంగానే యువత ఈ విజయాన్ని సాధించారని గుర్తుచేస్తూ.. 2047 నాటికి 'వికసిత్ భారత్' నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వ సేవలో చేరే ప్రతీ ఒక్కరూ దేశాభివృద్ధే ధ్యేయంగా, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నేడు భారతీయ యువత ప్రతిభ, నైపుణ్యాలపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరిగిందని ప్రధాని మన యువశక్తిని కొనియాడారు"
ప్రజా���ోగ్యమే లక్ష్యంగా 'సుజనా ఫౌండేషన్' ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులో భాగంగా ఈరోజు కొత్తపేట, KBN కళాశాల ఆవరణలో నిర్వహించిన శిబిరానికి విశేష స్��ందన లభించింది. 95 మందికి పైగా లబ్ధిదారులకు జనరల్ ఫిజీషియన్, దంత, కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్, ECG, 2D ECHO, X-RAY, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేయటం జరిగింది. ఈ సేవల్లో భాగస్వాములైన వాసన్ ఐ కేర్, హెల్ప్ హాస్పిటల్స్, ప్రభుత్వ దంత వైద్య నిపుణులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ABVP అభ్యర్థి శ్రీ @YashDabas_ గారికి హృదయపూర్వక అభినందనలు. విద్యార్థుల సంక్షేమంతో పాటు జాతీయవాదం, క్రమశిక్షణను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతలో దేశభక్తి, నాయకత్వ పటిమను పెంపొందించడంలో @ABVPVoice ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్���ోంది.