స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొ���ి ముఖ్యమంత్రి 'ఆంధ్ర కేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ తుపాకులకు గుండె ఎదురొడ్డి నిలిచిన ఆయన సాహసం, తరతరాల తెలుగు జాతికి ��్ఫూర్తిదాయకం
సృష్టిలో అత్యంత పవిత్రమైన పదం 'అమ్మ'. నిరంతరం నిస్వార్థమైన ప్రేమను పంచుతూ, మన ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే ప్రతి ఒక్క తల్లికి నా హృదయపూర్వక ప్రణామాలు. మన జీవితాల్లో అమ్మ చూపిన మార్గం, నేర్పిన విలువలే మన విజయాలకు మూలస్తం��ాలు. ఒక కుటుంబానికి వెలుగునిస్తూ, సమాజ నిర్మాణంలో నిశ్శబ్దంగా కీలక పాత్ర పోషిస్తున్న తల్లులందరికీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
ఈ మాతృ దినోత్సవం సందర్భంగా లోకంలోని ప్రతీ ఒక్క తల్లికి నా హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!
Heartiest congratulations to Thiru Vijay Garu on taking the oath of office as the Chief Minister of Tamil Nadu.
I am confident that under your visionary leadership, the state will embark on a new era of growth, development, and prosperity. Wishing you a highly successful and impactful tenure in the service of the people.
@TVKVijayHQ
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి సమర్థవంతమైన సారథ్యంలో భారత్ ఆర్థిక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ దేశాలన్నీ వివిధ సంక్షోభాలతో తిరోగమనంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ, మన దేశం ఏడాదిలోనే రూ.81.56 లక్షల కోట్ల రికార్డు స్థాయి ఎగుమతులను సాధించడం విశేషం. గౌరవ ప్రధానమంత్రి గారి 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' సంకల్పంతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ @SuvenduWB గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక సామాన్య క��న్సిలర్ స్థాయి నుండి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మీ రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారికి, ప్రజల కోసం అంకితభావంతో శ్రమించే వారికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సముచిత గౌరవాన్ని కల్పిస్తుందనడానికి మీ ఎదుగుదలే నిదర్శనం. మీ పాలనలో పశ్చిమ బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న తిరుగులేని అభిమానాన్ని చాటిచెప్పాయి. సంక్షేమ��, అభివృద్ధిని సమతూకం చేస్తూ సాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టం కట్టారు అనడానికి ఇవే నిదర్శనం. ప్రధాని శ్రీ @narendramodi గారితోనే దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడవసారి సాధించిన ఈ అద్భుత విజయం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మరియు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న ���స్సాం అభివృద్ధి పట్ల ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనం. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi , కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారికి మరియు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం. దశాబ్దాల చీకటి పాలన నుండి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వెలుగుల వైపు నడిపిస్తారని బెంగాల్ ప్రజలు నమ్మి ఇచ్చిన తీర్పు ఇది. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి, కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారికి, పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షులు శ్రీ @SamikBJP మరియు శ్రీ @SuvenduWB గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
My heartiest congratulations to Thiru Vijay Garu on his historic success in the Tamil Nadu Assembly Elections. Emerging as the largest party with TVK in the very first attempt is a remarkable feat and marks the beginning of a promising new chapter in Tamil politics. I sincerely wish that under your dedicated leadership, the hopes and aspirations of the people of Tamil Nadu are fully realized. Best wishes for a successful tenure ahead.
@TVKVijayHQ
గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ @CPR_VP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిరాడంబరతకు, క్రమశిక్షణకు నిలువుటద్దంలా నిలిచే మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
విశాఖపట్నం వేదికగా 1000 మెగావాట్ల భారీ సామర్థ్యంతో, రూ.1.35 లక్షల కోట్ల అపార పెట్టుబడితో నిర్మితమవుతున్న గూగుల్ డేటా సెంటర్ కు నేడు శంకుస్థాపన జరగనుండటం రాష్ట్ర ప్రగతిలో ఒక చారిత్రాత్మక ఘట్టం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంప��ర్ణ సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ నేడు గ్లోబల్ AI & డేటా సెంటర్ల హబ్‌గా అవతరిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారడమే కాకుండా, మన యువతకు వేలాదిగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
భారతీయ గణిత మేధస్సును ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టిన అపర మేధావి, శ్రీనివాస రామానుజన్ గారి పుణ్యతిథి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. కేవలం 32 ఏళ్ల ప్రాయంలోనే గణిత శాస్త్రంలో ఆయన అందించిన అద్భుత ఆవిష్కరణలు నేటికీ ప్రపంచవ్యాప్తంగ��� పరిశోధకులకు దిక్సూచిగా నిలుస్తున్నాయి. భారతీయ విద్యార్థి లోకానికి ఆయనొక నిత్య స్ఫూర్తిప్రదాత.
మహాత్మా గాంధీ గారు కలలు గన్న 'గ్రామ స్వరాజ్యం' దిశగా అడుగులు వేస్తూ.. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు లభించిన రాజ్యాంగ బద్ధత మరియు స్వయం ప్రతిపత్తిని మరింత సుస్థిర పరుస్తున్నారు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు. అధికార వికేంద్రీకరణే ధ్యేయంగా, గ్రామాల్లో స్వపరిపాలనను సాకారం చేస్తూ, పంచాయతీలకు డిజిటల్ శక్తిని మరియు నేరుగా నిధుల బదిలీ ద్వారా ఆర్థిక పరిపుష్టిని అ���దిస్తూ గ్రామాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. 'గ్రామ స్వరాజ్య' సాధనలో పాలుపంచుకుంటున్న ప్రతీ ఒక్కరికీ 'జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ' శుభాకాంక్షలు.
'అభయ హస్తం' పథకం ద్వారా 22 లక్షల మంది డ్వాక్రా మహిళలు దాదాపు 12 ఏళ్ల పాటు పైసా పైసా కూడబెట్టుకున్నటువంటి రూ.2,194 కోట్ల నిధులను, చట్టాన్ని సవరించి మరీ ఇతర అవసరాలకు మళ్లించి మహిళా లోకాన్ని దారుణంగా వంచించింది గత వైస్సార్సీపీ ప్రభుత్వం. అయితే డ్వాక్రా మహిళల కష్టాలను గుర్తించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఆ నిధులను తిరిగి చెల్లించేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమం మరియు సాధికారత పట్ల మన ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు తెరదించుతూ, పూర్తి స్థాయి ఎత్తు 45.72 మీటర్ల నిర్మాణానికి కేంద్ర జల���క్తి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి, కేంద్ర జలశక్తి శాఖకు నా ధన్యవాదాలు. 194.60 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు పూర్తికాబోతుండటం రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనం.
కాంగ్రెస్ నైజం ఎప్పటికీ మారదు. పార్లమెంటు బయట మహిళా బిల్లుకు మద్దతు అంటూనే, లోపల బిల్లును అడ్డుకుని మహిళల హక్కులను కాలరాశారు. కాంగ్రెస్ చేసిన ఈ అన్యాయాన్ని దేశ మహిళలు ఎన్నటికీ క్షమించరు.
#AntiWomenAlliance#MahilavirodhiCongress
K. Annamalai isn’t just a leader; he’s a catalyst for a corruption-free Tamil Nadu. His commitment to merit and transparency is exactly what our state needs to thrive. The era of honest governance begins now! 🦁
#NDAWinning2026
The digital transformation of Bihar is here! 💻
With a focus on tech infrastructure and new innovation centers in Patna, @samrat4bjp is empowering the youth to lead the IT revolution. Future-ready and tech-driven!
#SankalponKaSamrat
నీతి ఆయోగ్ ప్రారంభించిన 'దివ్య భారత్' ఆవిష్కరణలో మన ఆంధ్రప్రదేశ్ రమణీయ పర్యాటక వైభవం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం గర్వకారణం.
సుందర విశాఖ తీరాలు, సువిశాల నీలి సముద్రపు తీర ప్రాంత అందాలు, అరకు లోయలు, అమరావతి, బొర్రా మరియు ఉండవల్లి గుహల అద్భుతాల నుండి తిరుమల, లేపాక్షి వంటి ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వం వరకు మన రాష్ట్రం భారతదేశ ఆత్మను ఆవిష్కరించే ఒక అపురూప ప్రతిబింబం. మన కళలు, వారసత్వం, రుచులు మరియు సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ప్రయత్నం అభినందనీయం.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన అరుదైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారు పోషించిన పాత్ర చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏