ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా.. ఓల్డ్ మల్కాజిగిరి లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి మీన ఉపేందర్ రెడ్డి గారు, నాయకులు శ్రీ మురళి యాదవ్ గారు, శ్రీ వీకే మహేష్ గారు, శ్రీ మేకల మోహన్ యాదవ్ గారు, శ్రీ చంద్రశేఖర్ యాదవ్ గారు, శ్రీ మహిపాల్ రెడ్డి గారు, శ్రీ సుదర్శన్ గారు, శ్రీ లక్ష్మణ్ గారు, బిజెవైయం శ్రీ సాయి గారు తదితరులు పాల్గొన్నారు.
#BonaluFestival
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా.. మల్కాజిగిరి పార్లమెంట్ లోని కౌకూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా.. మల్కాజిగిరి పార్లమెంట్, నేరేడ్మెట్ డివిజన్ లోని మూడు గుళ్లు లోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి గారు, బిజెవైయం నాయకులు శ్రీ సాయి గారు, సీనియర్ నాయకులు శ్రీ మురళి యాదవ్ గారు, శ్రీ వీకే మహేష్ గారు, శ్రీ చంద్ర శేఖర్ యాదవ్ గారు, శ్రీ మహిపాల్ రెడ్డి గారు, శ్రీ అల్లి సుదర్శన్ గారు, శ్రీ లక్ష్మణ్ గారు తదితరులు పాల్గొన్నారు.
#BonaluFestival #TelanganaCulture
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా IDOC కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణభివృధి సంస్థ (#DRDO) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ "దిశ" కేంద్ర ప్రభుత్వ పథకాల పై సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు శ్రీ చామకూర మల్లారెడ్డి (@chmallareddyMLA) గారు, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి (@MarriRajasekar) గారు, శ్రీ బండారి లక్ష్మ రెడ్డి (@BrsBandari) గారు, జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి గారు, అన్ని విభాగాల జిల్లా ఉన్నతాధికారులు, జీ.హెచ్.యం.సి అధికారులు, దిశ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్దాల కల నెరవేరిన శుభ దినం.
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నేడు కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు ప్రారంభించారు.
ఈ పసుపు బోర్డు ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతీయ పసుపునకు ప్రాచుర్యం కల్పించి, 2030 నాటికి పసుపు ఎగుమతులను $1 బిలియన్కు పెంచడమే లక్ష్యంగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ శ్రీ @Arvindharmapuri గారికి, పసుపు రైతులకు అభినందనలు.
#NationalTurmericBoard
సరళీకృత విధానాలతో ఆర్థిక వ్యవస్థను గట్టెకించి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దర్శనికుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
#PVNarasimhaRao
📍ట్యాంక్ బండ్, హైదరాబాద్.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది.
పీవీ గారు మా హుజూరాబాద్ వాసి. అంచలంచలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఈరోజు ఆయన 104 వ జయంతి ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము. వారి పార్లమెంట్ పరిధిలో మా ఊరు ఉంది. అప్పట్లో వారి గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దళంలో పనిచేసిన వారు.
ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆణిముత్యాలలాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారుచేశారు. కేంద్రంలో HRD మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా పీవీ గారే.
విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మహోన్నతంగా నిలబెట్టిన వ్యక్తి. ఆయన దేశ ప్రధాని అయిననాడు అనేక ఆర్ధిక ఇబ్బందులతో దేశం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్న సమయంలో లిబరైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకువచ్చారు.
భారత ఆర్ధిక వ్యవస్థ దారిలో పెట్టారు. మన దేశ ఆర్ధిక పరిస్థితి ఈరోజు ఈ స్థాయికి రావడానికి బాటలు వేశారు. ఆయన జీవితం రాజకీయవ్యవస్థకు, నాయకులకు గొప్ప సందేశం.
#PVNARSIMHARAO
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ
ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు.
#Bonalu
రాహుల్ గాంధీ అమెరికాకు పోయి భారత ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లుగా, వాళ్లు ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లు మాట్లాడుతున్నరు. ఇది వాళ్ల ధ్వంధ్వ వైఖరి.
ఇవాళ 50 సంవత్సరాల చీకటి అధ్యాయాన్ని తొక్కిపడేసి భారత ప్రజానీకం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేలా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేలా దోహదపడుతున్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం.. భారతదేశం అని ప్రూవ్ చేస్తున్నరు.
టు ద పీపుల్, బైద పీపుల్, ఫర్ ద పీపుల్ ను అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ.
మళ్లీ తెలంగాణ.. తన పాత గ్లోరీని కాపాడుకుంటూ ముందుకుపోవాలంటే బిజెపి మాత్రమే సరైన పార్టీ. అందుకే మోసపు పార్టీలను, మోసపు మాటలను నమ్మకూడదు.
రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మే నాయకుడు మోదీ గారు. ఈ మాట నీతి ఆయోగ్ సమావేశంలోనే అందరు ముఖ్యమంత్రుల సమక్షంలో చెప్పారు.
ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందని ముఖ్యం కాదు.. అన్ని రాష్ట్రాల్లో.. ప్రజానీకానికి నిలువనీడ, గూడు అందించాల్సిందని చెప్పిన గొప్ప నాయకుడు మోదీ గారు.
కేంద్ర ప్రభుత్వం 3 లక్షల 4 వేల ఇండ్లు తెలంగాణకు ఇస్తే.. గత ప్రభుత్వానికి కట్టే సత్తా, దమ్ము లేక.. కేవలం లక్షా 50 వేల ఇండ్లు మాత్రమే కట్టింది. ఆ ఇండ్లు కూడా ఇవ్వలే.
ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఆ ముఖ్యమంత్రి అహంకారంతో మీరేంది ఇచ్చేది.. మాది దనిక రాష్ట్రమని ప్రగల్బాలు పలికారు.
నిజమైన పేదలను విస్మరించి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడానికి, డబ్బులకు అమ్ముకోవడానికి ఇదేం మీ జాగీరు కాదు.
కేంద్రప్రభుత్వం 81 కోట్ల మందికి దేశ వ్యాప్తంగా ఉచితంగా బియ్యం ఇస్తున్నది.
సొమ్ము మాత్రం ప్రజలదే.. కాని పేరుమాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.
స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీల జనగణన, కులగణన జరగాలని సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
నేను చాలాసార్లు చెప్పిన.. ఈ కులగణన అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉంటది.
ఒక కులం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా పరిగణించబడుతోంది.
ఇన్ని రకాలుగా వైవిధ్యాలున్నా.. ప్రజల డిమాండ్ ను, ప్రజల కోరికను ఫుల్ ఫిల్ చేయాలనే బాధ్యతతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ వ్యాప్తంగా కులగణనతో పాటు జనగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది. అదెలాగా చట్టసభల్లో కూడా ఓబీసీ రిజర్వేషన్ రావాల్సి ఉందని చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి మరి.
గతంలో జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలివ్వాలని 23 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కాని ఇస్తలేరు. చాలా పేపర్లలో జర్నలిస్టులకు జీతభత్యాలు సరిగ్గా ఉండటం లేదు. కలాన్ని నమ్ముకుని, అక్షరాన్ని నమ్ముకుని జర్నలిస్టులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కొనసాగుతున్నరు.
ఖమ్మం జర్నలిస్టులకు కూడా ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం తక్షణమే భూమి కేటాయించాలి.
100-120 గజాలలో ఇండ్ల స్థలాలు ఇస్తే సొంత ఇల్లు కట్టుకుంటరు. తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
A historic and proud moment for India! 🇮🇳🧑🚀🚀
After 41 long years, an Indian astronaut is finally on his way to space 🌌
Heartiest congratulations to Group Captain Shubhanshu Shukla, the Mission Pilot of Axiom Mission 4, on this historic achievement.
#Axiom4Mission
నిన్నటి రోజున రాజ్ భవన్ లో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ (@Dattatreya) గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా.. “ప్రజలకథే నా ఆత్మకథ’’అనే వారి ఆత్మకథ పుస్తకాన్ని బహూకరించారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. కుత్బుల్లాపూర్, సుచిత్ర సర్కిల్ లోని శివోహం యోగ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ సెంటర్ వారి అధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను.
#YogaDay2025#YogaForOneEarthOneHealth#IDY2025
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. కూకట్పల్లి Y జంక్షన్ వద్ద ఉన్న యన్.కే.యన్.ఆర్ గార్డెన్స్ లో స్వచ్ఛభారత్ అభియాన్ మరియు పతంజలి యోగ సమితి - భారత్ స్వాభీమాన్ ట్రస్ట్ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ అభియాన్ ట్రస్ట్ ఫౌండర్, బీజేపీ నాయకులు శ్రీ మాధవరం కాంతారావు గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రాజేశ్వర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారు, స్వచ్ఛా భారత్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. శ్రీధర్ రావు గారు, పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వి. శివుడు గారు, సీనియర్ నాయకులు శ్రీ నందనం దివాకర్ గారు తదితరులు పాల్గొన్నారు.
#YogaDay #YogaForOneEarthOneHealth #IDY2025
సికింద్రాబాద్ : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఈస్ట్ మారేడుపల్లి జిహెచ్ఎంసి గ్రౌండ్స్ లో టీచర్స్ కాలనీ అధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి దీపికా నరేష్ గారు, నాయకులు శ్రీ టి.ఎన్ వంశ తిలక్ గారు, శ్రీ పిట్ల నగేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
#YogaDay #YogaForOneEarthOneHealth #IDY2025
📍మల్కాజిగిరి పార్లమెంట్.
భారతీయ జనతా పార్టీ, కేంద్ర నాయకత్వం 11 సంవత్సరాల శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారి పరిపాలనలో జరిగిన అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా దౌత్య రంగాలలో సాధించిన విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపుమేరకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఒక సభను ఏర్పాటు చేసుకోబోతున్నాము.
ఈనెల జూన్ 22వ తేదీ నాడు మోదీ గారు 11 సంవత్సరాల పాలనపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతున్నాం. అలానే సంవత్సర కాలంలో మల్కాజిగిరి ప్రజానీకానికి మేం చేసిన పనులను, ఉద్యమాల పరంపర, పరిష్కరించిన సమస్యలను మా ప్రజానీకానికి వివరిస్తాము.
ఏడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించబోతున్నాము.
మాకు మద్దతు తెలిపిన గేటెడ్ కమ్యూనిటీ ప్రజలు, బస్తీ వాసులు, కాలనీలలో ఉండే ప్రజల దగ్గరకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
#11YearsOfSeva #11yearsofBJP #NarendraModiJi #BJP4ViksitBharat #BJP4IND #BJP4Telangana #ModiGuranteeEatalaSurety #1YearOfMPEatala