Deeply saddened by the passing of the legendary #NanaPatekar.
An extraordinary actor with a powerful screen presence and artistic journey uniquely his own that left an indelible mark on Indian cinema.
Beyond the screen, his compassion for farmers and his service through his Foundation reflected his commitment to helping those in need. His legacy of art and humanity will always be remembered.
My heartfelt condolences to his family, loved ones and admirers. May his soul rest in peace.
Om Shanti 🙏
The passing of legendary Indian actor, National Award-winning artiste, and Padma Shri awardee Sri Nana Patekar Ji, is deeply painful. Over four decades, he brought extraordinary depth and authenticity to every role, from comedy to emotional, and from intense drama to the finest shades of human emotion, leaving an indelible mark on Indian cinema.
Beyond his remarkable contribution as an actor, his work as a social worker and his commitment to serving society will also be remembered with great respect.
I convey my deepest condolences to his family, loved ones, colleagues, and countless admirers.
Om Shanti.
#NanaPatekar
Wishing https://t.co/qvwuRkwXOE Shri @narendramodi ji for his relentless efforts and sacrifices for 25 years in making our Nation into Shakthiman Bharath.May Maa Durga protect him against all evils and give him strength , health and power to serve people of Bharath.
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. (1/2)
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ నివసిస్తున్న ��ోరకంటి నాగబాబు గారు గుండెపోటుతో దుబాయ్ లో మరణించడం బాధాకరం. జనసేన పార్టీ తరఫున UAE జనసేన టీమ్ వారి తరపున ఈరోజు రూ.1 లక్ష ఆర్థిక సహాయం పిఠాపురం జనసేన నాయకుల సమక్షంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యుల���ు అందజేశారు.
ఈ సందర్భంగా కోరకంటి నాగబాబు గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మీద అభిమానంతో, సమాజం మీద బాధ్యతతో 2009 యువరాజ్యం సమయం నుండి నేటి వరకు పనిచేస్తున్న కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు శ్రీ అచ్యుత��ాయుడు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.5 లక్షల ఆర్థిక సహాయం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి చేతుల మీదుగా NRI జనసేన UK బృందం వారు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ అచ్యుతరాయుడు గారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
@JANASENA_UK
ప్రకృతితో అనుసంధానం ద్వారా ప్రజలకు అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి
• ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి
• నగర వనాల్లో స్వచ్ఛమైన, ఆహ్లాదకర వాతావరణం
• అన్ని ప్రాంతాలను కలిపేలా పర్యాటక అభివృద్ధి
• నగర వన యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 6 నగరవనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నల్లమల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పర్యాటక కళను తీసుకొచ్చేలా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమైన 6 నగరవనాలను ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్బంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘నగర వన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 నగరవనాలుంటే, ఇప్పుడు ప్రారంభించిన ఆరు నగరవనాలతో కలిపి 25 నగరవనాలు రాష్ట్రంలో ఏర్పడతాయి. 305 హెక్టార్లలో, రూ.13 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ నగరవనాలు కేవలం మొక్కలు నాటే ప్రాంతాలుగా కాకుండా, ప్రజలను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే మార్గంగా ఉంటాయి. నగరవనాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లు, పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, జిమ్ పరికరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, స్వచ్ఛమైన అందాలతో నగరవనాలు ఆరోగ్యం, ఆహ్లాదం, ప్రకృతి అవగాహన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. బాపట్ల, చీరాల తీర ప్రాంత పర్యాటక వనాలుగా ఉంటే, కోటప్పకొండ ఆధ్యాత్మిక సువాసనలతో విరాజిల్లుతుంది. వినుకొండ, దేవరంపాడు, మాచర్లలో ఏర్పాటు చేసే నగరవనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకృతికి దగ్గరయితే, ఆరోగ్యం దగ్గరవుతుంది. ప్రకృతి అర్ధమైతే, పరిరక్షణ బాధ్యత పెరుగుతుంది. ఇది ప్రకృతి నియమం.
సత్సంకల్పంతో ముందడ��గు వేస్తున్నాం
రాష్ట్రంలో ఎకో టూరిజం పెరగడం వల్ల గిరిజన యువతకు ఉపాధి అవ��ాశాలు లభిస్తాయి. వెలిగోడు జంగిల్ సఫారీతో సరికొత్త అనుభూతులు లభిస్తాయి. మారేడుమిల్లి ట్రెక్కింగ్, ఆరోమా కనోపీ వాక్ ద్వారా తూర్పు కనుమల అటవీ అందాలను, ప్రకృతి పరిమళలను ప్రజలకు చేరువ చేస్తాం. గిరిజన సంస్కృతిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తాం. దీనివల్ల గిరిజనుల జీవన విధానంలో మంచి మార్పులు వస్తాయని సత్సంకల్పంతో పని చేస్తున్నాం. ప్రకృతిని ప్రేమించాలి.. భావితరాలకు బహుమతిగా ఇవ్వాలనేది మా సంకల్పం. దీనికి కట్టుబడి పనిచేస్తాం. దీనికి ప్రజలు తమవంతుగా సహకరించాలి’’ అన్నారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ రూపొందించిన వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆఫ్ ద నల్లమల ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రీ టాన్స్ లోకేషన్ మాన్యూవల్ పుస్తకాలను ఉప ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ దేశంతోనే మొదటిసారి ‘‘ఈకోలిప్టస్ పల్ప్ ఉడ��� ప్లాంటేషన్’’ విభాగంలో అనుసరిస్తున్న సుస్థిర నిర్వహణ పద్ధతులకు గుర్తింపుగా సాధించిన ప్రమాణ్ సర్టిఫికేట్ ను డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ కొణిదల నాగేంద్రబాబు, వినుకొండ ఎమ్మెల్యే శ్రీ జీవీ ఆంజనేయులు, రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శీరిష, చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య, అటవీ, పర్యావరణ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీ రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సీఈవో ఏపీ గ్రీన్ శ్రీ బీఎన్ఎన్ మూర్తి, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, ఎకో టూరిజం ఈడీ శ్రీమతి నందిని సలారియా, అటవీశాఖ ఐటీ సలహాదారుల శ్రీ పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
(1/2)
మొక్కల లెక్క కాదు.. మనుగడ లెక్క ముఖ్యం
•2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
•హరిత లక్ష్య సాధనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
•హరిత కార్యక్రమాల్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యం పెంచ���లి
•ఈ ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల మొక్కలు సిద్ధం చేయాలి
•తొలి దశలో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించాలి
•కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు, తాటి తోటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక
•మొక్క నాటిన నాటి నుంచి మహా వృక్షంగా ఎదిగే వరకు నిరంతర పర్యవేక్షణ అవసరం
•ఏపీ గ్రీన్‌లో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట
•ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశంలో ఏపీ గ్రీన్ ఛైర్మన్ శ్రీ @NagaBabuOffl గా���ు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పిల��పునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్య, పరిశ్రమలు, స్థానిక సంస్థలు తదితర అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ శాఖల కృషితోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం మంగళగిరిలోని అరణ్యభవన్‌లో శ్రీ నాగబాబు గారి అధ్యక్షతన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరిత ప్రణాళికలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ... “ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలక��� అనువైన స్థలాలను గుర్తించి, 15 వేల ప్రైమరీ బెడ్లను ఏర్పాటు చేయాలి. మొక్కలు నాటడంలో సంఖ్య కంటే నాణ్యతకు, నాటిన మొక్కల సంఖ్య కంటే వాటి మనుగడ శాతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. స్థానిక వాతావరణం, నేల స్వభావానికి అనువైన జాతులను నర్సరీల్లో పెంచాలి. రావి, మర్రి, వేప, చింత, కానుగ, ఉసిరి, పనస, మోదుగ, ఇప్ప, రేల వంటి స్థానిక జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్ ట్రీ–రైట్ ప్లేస్ అనే విధానాన్ని పాటించాలి.
రహదారుల వెంబడి పచ్చదనం విస్తరణకు ప్రణాళిక*
రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక ప్లాంటేషన్ టార్గెట్‌ను నిర్దేశించడంతో పాటు భూమి లభ్యత, మొక్కల ఎంపిక, నాటడం, నీటి సరఫరా, రక్షణ, సర్వైవల్ మానిటరింగ్‌పై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. 3 నుంచి 5 మీటర్��� ఎత్తు ఉన్న బలమైన మొక్కలతో ట్రీ బ్యాంక్స్ ఏర్పాటు చేసి రహదారులు, పట్టణాలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో వ్యూహాత్మకంగా వినియోగించాలి. ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, పట్టణ ఓపెన్ స్పేస్‌లను అవెన్యూ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, మియావాకీ, డెన్స్ ప్లాంటేషన్లకు వినియోగించాలి.
తీర ప్రాంత పరిరక్షణతోపాటు గ్రీన్ ఎకానమీకి ప్రోత్సాహం
రాష్ట్రానికి ఉన్న దాదాపు 1,053 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని కాపాడుకోవ���ానికి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, సముద్ర అలల ఉధృతిని తగ్గించే మడ అడవులను పెంపకం. తీరంలో రక్షణగా నిలిచే తాటి చెట్ల తోటలను పెంచడం, గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయాలి. నర్సరీలను కేవలం మొక్కల పెంపక కేంద్రాలుగా కాకుండా గ్రీన్ ఎకానమీ సెంటర్స్ గా అభివృద్ధి చేయాలి. స్థానిక యువత, మహిళా సంఘాలకు మొక్కల పెంపకం, నిర్వ���ణ, సంరక్షణలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏపీ గ్రీన్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా సృష్టించాలి.
పరిశ్రమల భాగస్వామ్యంతో హరిత కార్యక్రమాలు
పరిశ్రమల భాగస్వామ్యంతో సీఎస్ఆర్, సీఈఆర్ వనరులను వినియోగించుకోవాలి. వన్ ఇండస్ట్రీ–వన్ విలేజ్, వన్ ఇండస్ట్రీ–వన్ గ్రీన్ జోన్, వన్ ఇండస్ట్రీ–వన్ గ్రీన్ కారిడార్ వంటి నమూనాలను అభివృద్ధి చేయాలి. ఏపీ గ్రీన్ లో పారదర్శకత, ���వాబుదారీతనం కీలకం. నర్సరీ నుంచి ప్లాంటేషన్ వరకు జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులు, డ్యాష్‌బోర్డును బలోపేతం చేయాలని సూచించారు. “ఎక్కడ నాటాం? ఎన్ని నాటాం? ఎన్ని బతికాయి?” అనే మూడు ప్రశ్నలకు ప్రతి స్థాయిలో స్పష్టమైన సమాధానం ఉండాలి. ప్రతి లక్ష్యానికి వ్యక్తిగత బాధ్యతను నిర్దేశించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు, ఎక్కడ అమలు చేస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, నిర్వహణ ఎవరు చేపడతారు, ఎంత సర్వైవల్ రేటు సాధించాలి అన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి.
మాకు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి "అమరజీవి జలదార "
మాకు రోడ్డు వేయించారు,నీళ్లు ఇచ్చారు మళ్ళీ @PawanKalyan గారు,MLA కొణతాల గారే రావాలి!!
Anakapalli, Shankaram!!
ALL TIME RECORD ❤️🔥
Rs. 30,156 Cr push for Water Security in Andhra Pradesh under Amarajeevi Jaladhara Scheme by AP Deputy CM and Minister of Rural Water Supply @PawanKalyan 🫡🔥
ALL TIME RECORD 💥
Rs. 30,156 Cr push for Water Security in Andhra Pradesh under Amarajeevi Jaladhara Scheme by AP Deputy CM and Minister of Rural Water Supply @PawanKalyan 💥💥✅✅🙏🏼🙏🏼
ANDHRA PRADESH IS IN SAFE HANDS! ✊
With ₹30,156 crore, this mission will benefit 3.27 crore rural people, with 27.36 lakh new household tap connections.
A HISTORIC investment in water security. A stronger foundation for rural Andhra Pradesh. 👏🫡