🚨 #YSJaganPortsRevolution
ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరాన్ని అపార సంపదకి కేంద్రంగా వైయస్ జగన్ గారు ఎలా మార్చారో తెలియాలంటే ఈరోజు రాత్రి 7 గంటలకు వైయస్ఆర్సీపీ అఫిషియల్ X (ట్విట్టర్)లో విడుదలయ్యే వీడియోలో చూడండి.
-గుమ్మా తనూజ రాణి గారు, అరకు ఎంపీ
#APPortsRevolution
#YSJaganVision
#SadistChandraBabu
#YSJaganDevelopsAP
దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం వైయస్ జగన్ భూమి పూజ చేశారు. రూ.385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులు 2024 ఏప్రిల్ నాటికి పూర్తై ఉత్పత్తి ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
#YSJaganRevivesChittoorDairy#PaalaVelluva
ముఖ్యమంత్రి వైయస్ జగన్ దార్శనికతతో దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రఖ్యాత ఒబెరాయ్ గ్రూప్.
చారిత్రాత్మక గండికోటలో ప్రతిష్టాత్మక ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేసిన సీఎం వైయస్ జగన్.
#YSJaganDevelopsAP#CMYSJagan
#APTourism
#InvestmentsInAP
#APGIS2023
ఆమె వికలాంగురాలు అయినప్పటికీ వాలంటీరుగా పనిచేస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తుంది.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.......!
#APVillageWarriors#APVolunteers#CMYSJagan
మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల బీమా ప్రీమియం చెల్లించి.. క్రమం తప్పకుండా వారికి పరిహారం అందించడం మాత్రమే కాదు.. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లలో మనసు పెట్టి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం.
- సీఎం వైయస్ జగన్
#FarmersDay#YSRJayanthi #YSJaganWithFarmers
పేదవాడి ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ మన రాజన్న.
పేదవాడు సైతం కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని ఉచితంగా అందుకోగలడని నిరూపించిన మహోన్నత వ్యక్తి మన YSR. ఆరోగ్య శ్రీకి తోడుగా 104 మరియు 108 వంటి అత్యవసర వైద్య అంబులెన్స్ సర్వీసులను తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే 5వ ఎపిసోడ్ ""తన పాదయాత్రలో వృద్ధుల కష్టాలు చూసి.. కలత చెందిన రాజన్న"" ని తప్పకుండా వీక్షించండి.
#LegacyLivesOn #YSRJayanthi #CMYSJagan #YSJaganHealthReforms
ప్రపంచ దేశాలు మన రాష్ట్రంలో వ్యవసాయం ఎలా జరుగుతోంది అని మన గ్రామాలకు వచ్చి చూసి వెళ్లే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.
- సీఎం వైయస్ జగన్
#FarmersDay#YSRJayanthi#YSJaganWithFarmers
తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న తన తండ్రి బాటలోనే ప్రజారంజక పాలన సాగిస్తున్న మన జగనన్న కూడా మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా ముందుకు సాగుతోంది మన జగనన్న ప్రభుత్వం.
ఈ రోజు ఉదయం 11 గంటలకి ప్రసారమయ్యే 2వ ఎపిసోడ్ ""అన్నదాతకు అండగా.. రైతు బాంధవుడు మన YSR"" ని తప్పక వీక్షించండి.
#LegacyLivesOn #YSRJayanthi #CMYSJagan #YSJaganEmpowersWomen
2004లో రాష్ట్రంలో సీఎం పదవి చేపట్టిన వెంటనే YSR.. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. అందులో YSR ఆసరా పథకం ఒకటి. అప్పటికే.. రూ.75గా ఉన్న పింఛన్‌ను.. 2006 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు మన రాజన్న.
#LegacyLivesOn#YSRJayanthi#CMYSJagan#YSJaganForAll
‘ముఖ్యమంత్రిగారూ.. జీడిరైతు గుర్తున్నాడా?’ అంటూ 07–07–2023న ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురించిన కథనం కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారంలో భాగంగా రాశారు. జీడి మామిడి సాగు మీద, ఉత్పత్తి మీద, జీడిపప్పు పరిశ్రమల నిర్వహణ, ముడిసరుకు దిగుమతుల మీద ఈనాడులో రాసినవన్నీ అసత్యాలే.
ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో ‘రాష్ట్రంలో 550 పరిశ్రమల మూత’ అని రాశారు. ఇది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో అన్ని రకాల జీడిపిక్కల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలూ కలిపి మొత్తం 402 ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క జీడి పరిశ్రమ యూనిట్‌నూ శాశ్వతంగా మూసివేయలేదు. ఆషాఢ మాసం కారణంగా ప్రాసెసింగ్ యూనిట్లు తాత్కాలికంగా మూసేశారని ఈనాడు కథనంలోనే రాశారు.
ప్రతి ఏటా వేసవిలో పీక్ హార్వెస్టింగ్ వచ్చేసరికి ధరలు తగ్గడం.. మళ్లీ ఆగస్టు–సెప్టెంబరు నుంచి పెరగడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఈ ఏడాది పంట కోత దశ ప్రారంభంలో కూడా 80 కిలోల బస్తా రూ.11,500 పలికింది.
2019–20 నుంచి 2022–23 వరకు జీడి పంట నష్టపరిహారంగా 1,34,890 మంది రైతులకు రూ.87.31 కోట్లు పెట్టుబడి రాయితీగా ఈ ప్రభుత్వం చెల్లించింది.
రాష్ట్రంలో జీడిమామిడిని కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా 1.67 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి జీడి పిక్కల ఉత్పత్తి జరుగుతోంది.
2018–19లో సంభవించిన తిత్లీ సైక్లోన్ వల్ల జీడి తోటలకు, జీడి ఉత్పత్తికి చాలా నష్టం వాటిల్లింది. నష్టపోయిన తోటల్లో పునరుద్ధరణ, సస్యరక్షణ (ముఖ్యంగా టీ మస్కిటో బగ్ నివారణ) కార్యక్రమాలను 2019–20 నుంచి 8,500 హెక్టార్లలో అమలు చేస్తోంది ప్రభుత్వం. తద్వారా హెక్టారుకు ఉత్పత్తి 800 కిలోల నుంచి 1150 కిలోల వరకు పెరిగింది.
గత 10 సంవత్సరాలుగా జీడి గింజల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉన్నాయి. కిలో ముడి గింజలకు రూ.120 నుంచి రూ.80 వరకు ఈ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ ఈనాడు రాసినట్టు రూ.140 నుంచి రూ.150 ధరతో ఎప్పుడూ స్థిరంగా లేవు.
ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన మొత్తం ముడి జీడిపిక్కల్లో 40 నుంచి 50 శాతం ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతోంది. మిగిలినది స్థానిక పచ్చి జీడి గింజలను వినియోగించడం జరుగుతోంది. స్థానిక జీడిగింజలతో పోలిస్తే దిగుమతి చేసే జీడి గింజల నాణ్యత తక్కువగా ఉంటుంది. దిగుమతి చేసుకున్న మెటీరియల్ ధరలు తులనాత్మకంగా తక్కువగా ఉన్నాయి. అంటే ఒక కిలోకు రూ.50 నుంచి రూ.60 వరకు ఉంటుంది. స్థానిక గింజలు, దిగుమతి చేసుకున్న గింజలను కలిపి ప్రాసెసింగ్ యూనిట్లు అమ్ముతున్నాయి.
ఈ ప్రభుత్వం వచ్చాక జీడిమామిడి రైతుల అభివృద్ధికి, నాణ్యమైన జీడి ఉత్పత్తికోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వివిధ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించి జీడి పంట నాణ్యతను పెంపొందిచడం కోసం తోటబడి కార్యక్రమం ద్వారా 418 ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించాం. ఇంకా నాణ్యమైన మొక్కలతో జీడి విస్తీర్ణ పథకం, జీడి తోటలకు బిందు సేద్యం వంటి అనేక చర్యల వల్ల జీడి మామిడి విస్తీర్ణం 1.23 లక్షల హెక్టార్ల నుంచి 1.34 లక్షల హెక్టార్లకు పెరిగింది.
వైయస్ఆర్ జిల్లా గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మూడు చోట్ల ఒబెరాయ్ గ్రూప్.. సెవెన్ స్టార్ హోటల్స్‌ని నిర్మించనుంది. గండికోటతో పాటు తిరుపతి, విశాఖపట్నంలో ఈ హోటల్స్ నిర్మాణం జరగనున్నాయి.
#YSJaganDevelopsAP#Gandikota
గండికోటలో ఒబెరాయ్ గ్రూప్ నిర్మించబోతున్న సెవెన్ స్టార్ హోటల్ ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 800 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇలాంటి హోటల్ గ్రూప్ మరొకటి కూడా గండికోటకి వచ్చే అవకాశం ఉంది.
- సీఎం వైయస్ జగన్
#YSJaganDevelopsAP#InvestmentsInAP#Gandikota