@6arj9@cyberabadpolice Sir, The road work was carried out by TGIIC officials and we have shared the issue with the concerned officers to take required action.
@CYBTRAFFIC The road under Raidurgam metro near IKEA was dug for laying some cable and the patch work is done only 50% which is also not a patch work till the Indian oil coco pump. When will it be done and who is responsible. Bcos of this traffic is more @CYBTRAFFIC@cyberabadpolice
@CYBTRAFFIC The road under Raidurgam metro near IKEA was dug for laying some cable and the patch work is done only 50% which is also not a patch work till the Indian oil coco pump. When will it be done and who is responsible. Bcos of this traffic is more @CYBTRAFFIC@cyberabadpolice
గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే ఎలా?
గత ఐదేళ్లుగా చూస్తున్నా. ఎవరైనా చనిపోయినా, చనిపోయే పరిస్థితిలో ఉన్నా ముందు ఆస్పత్రికి తీసుకెళ్తారు. తర్వాత ఆస్పత్రిలో ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసుకుని, వాట్సాప్ గ్రూపుల్లో మరణ సమాచారం పెట్టి, అంబులెన్స్ వ్యాన్ కమ్యూనిటీలోకి తీసుకొచ్చి, అరగంటపాటు అందరి చివరిచూపునకు ఉంచి, సొంత గ్రామానికి తీసుకెళ్తారు.
సొంత గ్రామంలో ఇల్లూ వాకిలీ లేకపోతే? కొన్ని తరాలుగా సొంత గ్రామమే హైదరాబాద్ అయితే?
ఇవాళ దగ్గర నుంచి చూశా.
మిత్రుడి తల్లి చనిపోయింది. ఎనభై ఏళ్లు దాటాయి. వృద్ధాప్యం. ఆర్నెల్లుగా మూడుసార్లు ఆసుపత్రుల్లో ఉండి వచ్చి మరణం కోసం ఎదురు చూస్తోంది. మూడు రోజుల నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ ఈ రోజు మధ్యాహ్నం కన్ను మూసింది.
ఆస్పత్రికి తీసుకెళ్లే ఆలోచన చేయలేదు. దగ్గరి బంధువులు మరణానికి ముందే వచ్చేశారు. ఆమె కన్నుమూశాక మరో ఇరవై మంది వచ్చారు.
గేటెడ్ కమ్యూనిటీ పెద్దలకు సమాచారం ఇచ్చారు. భౌతికకాయాన్ని తీసుకెళ్లడానికి ప్రొటోకాల్ మొత్తం సిద్ధం చేశారు. కానీ స్నానం చేయించడానికి, ఇతర క్రియలకు ఊళ్లలో లాగా చోటు లేదు. ఇటీవలి కాలంలో కమ్యూనిటీలో అలా చేసిన దాఖలాలూ లేవు. ఆ ఏర్పాట్లు కొడుకునే చూసుకోమన్నారు.
కొడుకు ఎమోషన్‌కు పోకుండా అన్నీ ఇంటి బాల్కనీలో, హాల్లోనే కానిచ్చేశాడు.
భౌతికకాయాన్ని అందరం మోసుకుంటూ వాహనం దాకా తీసుకెళ్లాం. అక్కడి నుంచి కుటుంబ సభ్యులే బయలుదేరారు. స్మశానానికి తీసుకెళ్లారు.
మా మిత్రుడి తల్లి పాతికేళ్ల క్రితమే భర్త చనిపోయినప్పుడే చిలకలగూడ ఖబరస్తాన్‌లో ఆయన్ని ఖననం చేసిన చోటే డబ్బు చెల్లించి తనకూ చోటు రిజర్వు చేసుకుందట. ఇప్పుడైతే లక్షో, రెండు లక్షలో పెట్టాలట. ఆ టెన్షన్ లేదు. అదొక ఊరట.
ఆకాశహర్మ్యాలు కడుతున్నారు. మూడు బెడ్రూముల ఫ్లాట్ రెండు కోట్లకు అమ్ముతున్నారు. ఆ ఫ్లాటే ఏకైక అడ్రస్ అయిన వాళ్ల పరిస్థితి ఏమిటన్నది మా మిత్రుల మధ్య చర్చకు వచ్చింది. మై హోం సంస్థ కొన్ని కమ్యూనిటీల్లో ఇలాంటి వాటికి ఏర్పాటు చేసిందట. అంటే చాలా కమ్యూనిటీల్లో ఆ ఏర్పాటు లేదన్నమాట.
చావు గౌరవంగా జరగాలి. ఇరుగుపొరుగు ఇబ్బంది పడతారేమోనన్న భయం లేకుండా జరగాలి. గేటెడ్ కమ్యూనిటీల్లో పెద్ద పెద్ద క్లబ్‌హౌస్‌లు కడుతున్నారు. సరే. చివరి క్రియల కోసం శోకమందిరాలు కూడా కట్టాలి.
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అంత చోటు చాలు. ఎకరాల్లో విస్తరించిన గేటెడ్ కమ్యూనిటీల్లో అది సాధ్యమే. అది కనిపించినప్పుడల్లా మరణం కూడా మన జీవితంలో భాగమేనని గుర్తుకొస్తుంది. అది అవసరం కూడా.
Now that @dpradhanbjp has resigned, he has sent a precedent. It clears the way for Punjab, Kerala, Karnataka education ministers to resign. Cmon #RahulGandhi#ArvindKejriwal. Respect your own words.