Rameshbabu Praggnanandhaa is the Champion of Norway Chess 2026! With an incredible win on demand against Vincent Keymer in the final round, Praggnanandhaa wins one of the strongest tournaments of the year scoring 18/30 points, 2 classical wins against World no.1 Magnus Carlsen, and an incredible 4-game Winstreak to finish the event!
A huge congratulations to Praggnanandhaa, his team and his family- this is undoubtedly the biggest achievement of his career so far, and what a way to get there!
Graphic: Anmol Bhargav
#chess #norwaychess #Praggnanandhaa
లంచం తీసుకుంటూ దొరికిపోయి, ఉద్యోగం నుంచి తొలగించబడిన ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మీకు తెలుసు...
మీ చుట్టుపక్కల కానీ, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ....
మహా అయితే ఒక మూడు నెలలు సస్పెన్షన్... అంతకంటే ఇంకా ఏమీ పీకలేరు అని లంచావతారులు బాగా ముదిరిపోయారు
@kaaaash____ Software engineers spend years staring at laptop screens and specs — and sometimes, only after stepping away do they rediscover peace in the simple panorama of nature.
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.
చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.
ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?
నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి:
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.
ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.
మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?
Respected Chandrababu Naidu garu & Lokesh garu, Pawan Kalyan garu
Cyber frauds, fake accounts, morphing, and digital blackmail cases are increasing rapidly in these times
Many people don’t even know where or how to report these issues.
Andhra Pradesh needs a dedicated Cybercrime Portal and a strong, easily accessible cybercrime unit
Kindly think once🙏🏽
@ncbn@naralokesh@PawanKalyan
హైదరాబాద్ అతి త్వరలో బెంగళూరు మాదిరి ట్రాఫిక్ జోకులకు ఒక సబ్జెక్ట్ అవ్వబోతుంది. అసలు ట్రాఫిక్ పోలీసుల జాడే లేని రద్దీ జంక్షన్లు ఇప్పుడు ఎన్నో వున్నాయి. జనాలు ఇష్టానుసారం పోతున్నారు.
విపరీతమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా మొదలయింది.
కూడళ్ళలో మహా అయితే ఒక కానిస్టేబుల్ కనిపిస్తున్నారు. ఈ మహా మహా కూడల్లల్లో పాపం ఒకరు, ఇద్దరు ఏం చెయ్యగలరు?
ఉద్యోగుల కొరత చాలానే వుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకి. 🙏
@CyberabadR@CYBTRAFFIC@hydcitypolice