న్యూస్ లైన్ తెలుగు #Unfiltered ప్రోగ్రామ్‌కు
మా నెక్ట్స్ గెస్ట్
తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్. కోదండరాం గారు
ఆయనను మీరు అడగాల్సిన ప్రశ్నలు కామెంట్ చేయండి, వారిని మా @NewsLineTelugu టీం అడిగే ప్రయత్నం చేస్తుంది..!
#ధారుణం_సార్
గ్రూప్2 అభ్యర్థుల మీద లాఠీ ఛార్జ్....
రణ రంగంగా మారిన
చిక్కడిపల్లి సెంట్రల్ లైబ్రరీ....
👉🏽మీ కోసం గొంతెత్తి మిమ్మల్ని గెలిపించారు సార్
👉🏽మీ పై నమ్మకం తో రాహుల్ గాంధీని అదే లైబ్రరీ దగ్గర కలి���ి తమ బాధను చెప్పుకున్నారు సార్
👉🏽మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓటు వేశారు , మీకే ఓటు వేయమని ప్రచారం చేశారు సార్ …
👉🏽తెలిసో , తెలియకో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా అడిగారు సార్
👉🏽మీకు విజ్ఞాపనలు మాత్రమే చేశారు సార్ ,
👉🏽వినతి పత్రాలు , విజ్ఞాపనలు , వినమ్ర ప్రతిపాదనలు ఇచ్చాక … మీరు ��రిష్కరించలేనప్పుడు విధిలేని పరిస్థితులలో నిరసన తెలిపారు సారు …
👉🏽అంతమాత్రానికే లాఠీలు జులిపిస్తారా ?
👉🏽లాఠీలతో ఉరికిస్తారా సార్ ?
🤷🏼అన్యాయం సార్ ….
🤷🏼అణిచివేయడమే ఇందిరమ్మ రాజ్యమా సార్ ?
🙏🏾నిరుద్యోగుల పై దాడిని ఆపి , వాళ్ల డిమాండ్ల ను నెరవేర్చండి ….
🔥జై తెలంగాణ - తెలంగాణ అణిచివేత ఒప్పుకోదు ….అన్యాయాన్ని ఎదురొస్తుంది …
👉🏽పరీక్ష నిర్వహణ పై ప్రభుత్వానికి ఒక విధానం ఉండవచ్చు ..కాదనలేం కానీ ..రేవంత్ రెడ్డి గారి “అహంకారం” విద్యార్థులను తీవ్రంగా మానసిక క్షోభకు గుర��� చేస్తుంది ….
🤷🏼రాహుల్ గాంధీ గారు ఏ Exam కు ప్రిపేర్ అవుతున్నాడని చిక్కడ్ పల్లి లైబ్రరీ కి వచ్చాడు ?
🤷🏼నీట్ రద్దు చేయాలంటూ రాజభవన్ ను ముట్టడించిన బల్మూరు వెంకట్ హాల్ టికెట్ దొరికిందా మరి ?
🤷🏼ప్రతి పక్షం లో ఉన్నప్పుడు నువ్వు ఏం పరీక్ష రాస్తూ …నిరుద్యోగుల గురించి పోరాడినావు ?
🤷🏼నిరుద్యోగ అంశం పై రోజుకో రాద్ధాంతం చేసున్న కొంతమంది కాంగ్రెస్ నిరుద్యోగులు ఏ పరీక్షలు రాస్తున్నారు ?
👉🏽విద్యార్థుల పై ఇలాంటి కక్షపూరిత వైఖరి దేనికి సంకేతం ?
@Congress4TS ఒక్కప్పుడు అధికారం లోకి రాగానే gp2 పోస్ట్ పెంచి exam అంటే నమ్మి మోసపోయి చస్తున్నం ఇప్పుడు జాబ్ క్యాలండర్ అని 4.5 years చంపుతావు, నీ మాటలునమ్మి మోసపోయాం
#WATCH | Telangana: A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad.
పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి గారివి పరిణితి లేని వ్యాఖ్యలు.
మీరు గతం మరిచిపోయినట్టున్నారు!
నాడు...గ్రూప్ 2, టెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్
చెయ్యాలని అభ్యర్థులు అడిగితే
మద్దతు తెలపలేదా మీరు?
అప్పుడు సానుకూలంగా నిర్ణయం
తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీరు ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదు?
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చా��� మరొక మాటనా?
ఊసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది.
విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసింది మీరు.
అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేసింది మీరు.
డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నది మీరు.
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం.
పార్టీల బలోపేతానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు సన్నాసులు అంటున్న రేవంత్.. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయం కోసమే వాయిదా కోరినారా?
రాత్రి, పగలు కూడా లెక్కచేయకుండా అభ్యర్థులు, పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
మీరు వ్యవహరిస్తున్న తీరును, మీ రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక బుద్ధి చెబుతారు.
#CongressFailedTelangana
నిరుద్యోగ సోదరులారా, కేసీఆర్ పాలన బెటరా, రేవంత్ రెడ్డి పాలన బెటరా, ఒక సారి చూద్దాం….
ముందుగా ఈ రోజు తెలంగాణ నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ నిర్భందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. అరెస్ట్ చేసిన వేల మంది విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ముందు బారికేడ్లు ముళ్లకంచెలు అంతర్జాతీయ సరిహద్దును తలపిస్తున్నయి. నిరుద్యోగుల న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి & ఆయన మంత్రి వర్గం కేవలం పోలీసులను, బౌన్సర్లను, అబద్దాలను నమ్ముకున్నరు. వీళ్లకు చరిత్ర త్వరలోనే తగిన గుణ పాఠం చెప్తది.
కాంగీయులను నమ్మి ఘోరంగా మోసపోయిన నిరుద్యోగ సోదరులు కొన్ని నిప్పులాంటి నిజాలను ఇపుడైనా గమనిస్తారని ఆశిస్తున్న…
కేసీఆర్ గారి పాలనలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే ఏడాదికి దాదాపుగా సగటున 16,000 ప్రభుత్వ ఉద్యోగాలన్న మాట! ఇక ప్రైవేటు రంగంలో భర్తీ అయిన ఉద్యోగాలు లక్షల్లో ఉంటవి.
మరోవైపు మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్న రేవంత్ రెడ్డి గారు 7 నెలల్లో కేవలం 6063 ఉద్యోగాలకు నోటిఫై చేసిండు!
2016-17 లో గురుకుల ఉపాధాయ పోస్టులకు అర్హత విషయంలో నిరుద్యోగులు ఒక్క రోజు ఆందోళన చేస్తే అర్హత మార్కులను ఒక మెమోతో కేసీఆర్ గారు మరుసటి రోజే సవరించారు. @GhantaC
2023 లో గ్రూప్ -1 లీకేజి విషయం లో నిరుద్యోగుల March-15, 2023 న ఆందోళన చేస్తే, కేసీఆర్ గారు March-17 న నే ప్రిలిమ్స్ ను రద్దు చేయించి సిట్ వేసి ఎంతో మంది నిందితులను అరెస్టు చేయించారు.
10 వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకైతే బాధ్యుడైన బండి సంజయ్, ఎంపీ, (నేడు కేంద్ర మంత్రి) ని కూడా అరెస్టు చేయడానికి వెనకాడ లేదు కేసీఆర్. ఆనాడు టీఎస్పీయస్సీ (TSPSC) ఛైర్మన్ చేతకానితనం వల్ల రెండవసారి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ను కోర్టు రద్దు చేసింది.
2023 లో గ్రూప్-2 ఎగ్జాం చాలా పరీక్షలతో క్లాష్ అవుతుందని ఒక్క సారి నిరుద్యోగులందరూ రెప్రజెంట్ చేస్తే ఆ పరీక్ష కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు వాయిదా వేయించారు.
వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాకు చాలా కాలంనుండి అన్యాయం జరుగుతున్నదంటే వాళ్లందరిని ఒక్క జీవోతో రెగ్యులరైజ్ చేశారు.
��ూనియర్ పంచాయత్ సెక్రటరీలు 10 రోజులు నిరవధిక సమ్మె చేస్తే వాళ్లందరి డిమాండ్లను సావధానంగా విని ఒక్క కేసు లేకుండా రెగ్యులరైజ్ చేశారు.
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు సమ్మె చేస్తే వాళ్ల సమస్యలను పరిష్కరించారు. ఒక్కరి మీద కూడా పోలీసులను ప్రయోగించలేదు.
నిరవధిక సమ్మెలు చేసినా ఆర్టీసి కార్మికులనందరిని చేరదీసి వాళ్లను గవర్నమెంటు డిపార్టుమెంటుగా మార్చారు, కేసీఆర్.
ఆషా వర్కర్లకు ఏఎన్ యం/జీయన్ఎం లకు నర్సుల పోస్టుల్లో వెయిటేజ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్.
చాలా ప్రభుత్వ శాఖల్లో సమ్మెలకు అవకాశం లేకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని గుండెలో పెట్టుకొని పరిపాలించిన నాయకుడు కేసీఆర్.
ఉదా: ట్రాఫిక్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు. ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు .
నాకు తెలిసి కేసీఆర్ గారి పాలనలో ఏ నిరుద్యోగికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే అవసరం రాలేదు. ఒక వేళ వచ్చినా ఒకటి రెండు రోజుల్లో ఆ సమస���య పరిష్కారం అయ్యేది.
ఇప్పుడేమో ఒకటే డిమాండ్ మీద అశోక్ సార్(రెండు సార్లు), మోతిలాల్, బక్క జడ్సన్ లు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. తెలిసి తెలిసి గురుకులాల్లో బాక్లాగ్ పోస్టులు సృష్టించింది నేటి ప్రభుత్వం. వీటన్నిటిపై కాంగీయులు స్పందించాల్సింది పోయి గాంధీ భవన్ నుండి గూండాలను బౌన్సర్లను పంపించి అమాయక నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
అసలు ఇంతవరకు నేటి ముఖ్యమంత్రి గ��రు నిరుద్యోగుల సమస్యలపై ఒక్కసారికూడా స్పష్ట��ైన ఆధారాలతో మాట్లాడలేదు. బహుశా ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల కొనుగోలు-ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నరేమో..!
ప్రజాస్వామ్యంలో సమ్మెలు సర్వసాధారణం..కానీ ప్రజలను ప్రేమించే నాయకులు పట్టువిడుపు ప్రదర్శిస్తారు. తెగేదాకా లాగరు.
ప్రజలను కేవలం ఓటర్లుగా, ప్రేక్షకులుగా చులకనగా చూసే నాయకులు విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తరు. వాళ్లను చంపడానికి కూడా వెనకాడరు.. వీళ్లు పోలీసు నిర్భందాన్నే నమ్ముకుంటర���.
ఉదా: బషీర్ బాగ్, ముదిగొండ కాల్పులు..
తెలంగాణకు కేసీఆరే సీయంగా ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది కదా.. అందుకే ద్రోహులను పాతర పెట్టనీకె, మన తెలంగాణను ఢిల్లీ నుండి మళ్లీ కాపాడుకోనీకె పల్లె పల్లెనా, గల్లీ గల్లినా ప్రజలను చైతన్యవంతం చేయడమే మన తక్షణ కర్తవ్యం.
జై తెలంగాణ.
#CongCheatedUnemployed
#LiberateTelanganaFromCongress
#BRS4Jobs
@BRSparty
@KTRBRS
we tspsc aspirants demanding increased posts in group2,group3, postponment of grup2 to december,group 1 with 1:100 ratio.we are mentally tired,In 2023 revanth reddy sir and you rahul sir both promised us to do JUSTICE but we are still waiting for its fulfillment @revanth_anumula
తెలంగాణ నిరుద్యోగుల గొంతు ఇది!
@revanth_anumula@Bhatti_Mallu
తెలంగాణ పాలకులుగా మిమ్మల్ని గెలిపించిన ఈ నిరుద్యోగుల ఆవేదన ఇది, కొంచెం టైం కేటాయించండి. వాళ్లేమీ గొంతెమ్మె కోర్కెలు కోరట్లేదు. వాళ్ల ప్లేస్ లో మీరు ఉన్నా, ఇంకెవరున్నా ఏం అడుగుతారో అంతే న్యాయమైన డిమాండ్లు, మీరు ఇచ్చిన హమీలు నెరవేర్చమంటున్నారు. ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా మీ ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదని వాళ్లతో మాట్లాడాక నాకర్థమైంది. #VoiceOfUnemployees
https://t.co/2GYCSp76Ew