జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది.
విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో యోగశ్వరరావు, అతని చెల్లికి స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగాలు ఇచ్చారు
ఖమ్మంలో జరిగిన ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనకపోయినా.. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లకి ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అన్నాచెల్లెళ్లకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు
కానీ.. ఏడు దశల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామని అధికారులతో అబద్ధాలు చెప్పించారు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#DSCScamByNaraLokesh
#ScamsterBabu
#NaraLokeshMustResign
డా"వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వై.యస్.ఆర్ గారి విగ్రహం నందు డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించిన @YSRCParty నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి గారు
వైయస్ఆర్ గారు తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి!🌾
కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైయస్ఆర్ గారు.🙏🏻🌊
నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైయస్ఆర్ గారికి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని.
కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే.
చంద్రబాబుగారూ… వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం.
శిలాఫలకం మాత్రమే మీది…
సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది…
కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది…
ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ.
చంద్రబాబుగారూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావిడిగా అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది.
వైయస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు.
వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైయస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్‌త్రూ సాధించలేకపోయారు.
మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు? ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?
అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?
జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? నల్లమలసాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదు? రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు?
మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా?
@ncbn గారూ… ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్‌ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి.
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్ ఆత్మీయ సమావేశం.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం,38వ డివిజన్ టెక్కే మిట్ట సెంటర్ నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ @YSRCParty మహిళ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నగర, నియోజకవర్గ కమిటీ సభ్యులు కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
We challenge @ncbn & @naralokesh to order a CBI inquiry into the #MegaDSCScam and APPSC.
Are you ready to accept the challenge, @JaiTDP?
వైయస్ జగన్ గారి ఓపెన్ ఛాలెంజ్‌కి మీరు రెడీనా చంద్రబాబూ?
డీఎస్సీ నియామకాల్లో మీరు ఏ అవినీతికి పాల్పడకపోతే.. ఛాలెంజ్‌ను స్వీకరించి సీబీఐ ఎంక్వైరీ కోసం లేఖ రాయండి
సవాల్‌ను స్వీకరించి మీరు సీబీఐ ఎంక్వైరీ కోరకపోతే.. తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే!
#YSJaganPressMeet
#NaraLokeshMustResign
#CBNFailedCM
#SadistChandraBabu
@YSRCParty అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని,రాజకీయ బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరురూరల్ నియోజకవర్గ కేంద్రంలో సమన్వయకర్త @AnamVijaya గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష.
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!
దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!
@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు ! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?
చంద్రబాబుగారూ… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది.
చిప్పగిరి మండలం నేమకళ్లులో వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.
ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ… సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?
గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైయస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?
రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబుగారూ… గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.
English Version- https://t.co/9f3rhT4DOo
#BhogapuramAirportByJagan
A dream for Andhra Pradesh. ✈️
A legacy of YS Jagan
#ThankYouJaganAnna for Bhogapuram International Airport.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన చేసిన రోజే.. ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుందో కూడా చెప్పిన వైయస్ జగన్ గారు
ఈరోజు నిజమైన వైయస్ జగన్ గారి కల.. థ్యాంక్యూ జగనన్న అంటున్న ఆంధ్రాజనం..
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
#BhogapuramAirportByJagan
A Must Watch Video!🚨
Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️
During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary approvals, paying compensation to displaced families, and developing the required infrastructure.
Yet, despite making no real contribution, Chandrababu is trying to project the entire project as his own achievement. But the people know who laid the foundation and made the airport possible. That is why they are wholeheartedly saying:
"Thank You, Jagan Anna!"
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
ఎవరూ లేని వారికి అన్నీ తానై నిలిచిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు, సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, వికలాంగులకు ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్లు అందించి వారి జీవితాల్లో భరోసా నింపారు. సంక్షేమం అనేది దానం కాదని, అది ప్రభుత్వ బాధ్యత అనే నమ్మకంతో కోట్లాది కుటుంబాలకు ఆత్మబంధువుగా నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
#YSRForever
నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లు (BLA), నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చింతరెడ్డిపాళెం నందు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు SIR కార్యక్రమం గురించి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ..SIR కార్యక్రమానికి సహకరించిన BLA లకు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Jagan 2.0 Super App ని ప్రారంభించిన వైయస్ జగన్ గారు!💫
తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ యాప్ ను అధికారికంగా లాంచ్ చేసిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు
వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి- https://t.co/L75ME91myH
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp
Here's the #77thYSRJayanthi CDP!
చెరగని చిరునవ్వు.. నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం.. పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్ఆర్ గారు.🙏🏻
ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#FarmersDay
Heartiest congratulations to Shri @sajjanjindal Garu and the entire @jswsteel team on the restart of the steel plant project in Kadapa. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for employment and economic growth.
It is important to remember that such landmark projects are built on years of committed groundwork. During our government, we finalized JSW as the project developer and laid the critical foundations necessary for the project to take shape. Environmental clearances were facilitated, water allocation was secured, land was allocated, road connectivity and the required land for supporting infrastructure were provided, and all key approvals were pursued to enable the project to move forward. With these foundations in place, work on the project progressed at a brisk pace during our tenure.
Unfortunately, over the past two years, the project came to a grinding halt, resulting in further delays to this long-awaited investment. It is therefore encouraging to see work finally restarting. The people of Kadapa have waited long enough, and they deserve to see this important project completed without any further delay. As my home district, Kadapa holds a special place in my heart, and I have always believed its youth deserve greater opportunities through industrial growth and sustainable employment.
Development is a continuous process that transcends political boundaries. Every government has a responsibility to build on the work already done and take projects to completion in the larger interest of the people.
I sincerely wish JSW every success in expediting the project and ensuring that the people of Kadapa and the entire Rayalaseema region reap the benefits through employment, industrial growth, and inclusive development.
.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz