మొన్న భీమవరం జగన్ సభకు జనాన్ని తరలిస్తున్న వైసీపీ నాయకురాలు 🤣🤣🤣
నిజంగా ఏ రాజకీయ పార్టీకి ఇటువంటి కష్టాలు రాకూడదు పాపం! ఎవరి జేబు ఖాళీ అయిందో కాని ఖర్చు తప్ప ఏమీ మిగలదు. మళ్ళీ ఇందులో మధ్యవర్తుల కమీషన్లు వుంటాయి. అదో నష్టం 🙆♀️🙆♀️🙆♀️
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'వందేమాతరం – 150 సంవత్సరాల వేడుకలు' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను.
బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తిని రగిలించిన మహోన్నత జాతీయ చైతన్య గీతం. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమనే విషయాన్ని ఈ గీతం భావి తరాలకు గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి రచన ఆధారంగా యువకులు రూపొందించిన "అమరావతికి ఆమడ దూరంలో వందేమాతరం గర్జన" సాంఘిక నాటకాన్ని వీక్షించడం ఆనందంగా అనిపించింది. దేశభక్తిని, జాతీయ భావాన్ని కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న కళాకారుల కృషి అభినందనీయం.
కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు శ్రీమతి ఎస్. పి. భారతి గారిని సత్కరించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు పురస్కారాలు అందజేసి అభినందనలు తెలియజేశాను.