విజయవాడ, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో రాబోయే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సమష్టి కృషి, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఏపీ గ్రీన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల కార్యాచరణ, అన్ని వర్గాల నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు
•వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు
నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది.
శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ)
పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ)
అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ)
కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం)
•అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు
తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు)
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట)
బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు)
ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి)
శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల)
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
జిల్లా పరిషత్ ఎన్నికలు–2026లో నూతనంగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన కూటమి అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వంలో కూటమి సాధించిన ఈ విజయం అభినందనీయం. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కూటమి ప్రభుత్వ సహకారంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మీ పదవీకాలం విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ZPChairman #AndhraPradesh
కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు
రెండో దశలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఈ మేరకు ఎన్నికల సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఎన్నికల్లో స్థానికంగా జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, కూటమి పార్టీలతో నిరంతర సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలుపు సాధించేలా ఆయా ప్రాంత నాయకుల సమన్వయంతో కమిటీలు కృషి చేస్తాయి.
*కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు
1. శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
2. శ్రీ కొణతాల రామకృష్ణ, అనకాపల్లి శాసనసభ్యులు
3. శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ
4. శ్రీ బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే
5. శ్రీ బత్తుల బలరామకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే
6. శ్రీ గిడ్డి సత్యనారాయణ, పి. గన్నవరం ఎమ్మెల్యే
7. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, APMSIDC చైర్మన్
8. శ్రీ సామినేని ఉదయభాను, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు
9. శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్
10. శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
*శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు
1. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు
2. శ్రీ సుందరపు విజయ్ కుమార్ , యలమంచిలి ఎమ్మెల్యే
3. శ్రీమతి లోకం మాధవి, నెల్లిమర్ల ఎమ్మెల్యే
4. శ్రీ నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఎమ్మెల్యే
5. శ్రీ టి. శివశంకర్, ఏపీ ఎంఎస్ఎంఈ, చైర్మన్
6. శ్రీ కొరికాన రవికుమార్, సుడా ఛైర్మన్
7. శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మేయర్
8. శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
9. శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు
10. శ్రీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు
దేశభక్తికి నిలువెత్తు రూపం ఝాన్సీ లక్ష్మీబాయి.
బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంటూ, చివరి శ్వాస వరకు స్వరాజ్యం కోసం ఆమె పోరాడిన తీరు భారతీయులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆమె పోరాట పటిమ మనందరికీ ఆదర్శం.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#RaniLakshmiBai
రాబోయే 23 మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలి
* స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది
* శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో జనసేన పార్టీ నాయకులు కూటమి స్ఫూర్తిని నిలిపేలా పనిచేస్తున్నారు
* యువతకు కూటమి పార్టీలు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాయి
* తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి పార్టీల విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రతి చోటా కూటమి పార్టీల అభ్యర్థులను ప్రజలు గెలిపించడం, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ప్రజలు ప్రభుత్వంపై, పాలనపై పెట్టుకున్న నమ్మకాన్ని అది మరోసారి తెలియజేయడమే కాకుండా, మాపై మరింత బాధ్యతలను పెంచింది అని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల మాదిరే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి పార్టీల పక్షాన నిలిచారని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కూటమి పార్టీల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీలు ఐక్యంగా కలిసి పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సవాళ్లను అంతా కూర్చుని మాట్లాడుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దీనిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రజా సంక్షేమంతోపాటు గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు కూటమి పార్టీలను అత్యధిక మెజార్టీతో గెలిపించారు.
*వైసీపీతో ప్రజలు విసిగిపోయారు*
కూటమి పార్టీలు కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన విధ్వంసం, అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం శుభపరిణామం. తర్వలో జరగనున్న 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలి.
*కూటమి స్ఫూర్తి కి అనుగుణంగా జనసేన పని చేస్తుంది.*
ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజలు ఆయన పరిపాలనపై విసుగు చెందారు. వాటిన్నంటిని అధిగమించి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్దంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ప్రకారం ఎన్డీయే పార్టీల అభ్యర్థులు ఎక్కడ నిలబడిన వారి గెలుపు కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి చేస్తున్నారు. కూటమి స్ఫూర్తిని నిలిపేలా జనసేన పార్టీ పని చేస్తుంది. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చాం. కొత్త ఆలోచనలతో వస్తున్న యువతకు సీట్లు ఇచ్చి అవకాశం కల్పిస్తున్నాం. ప్రజలు కూడా యువనాయకత్వానికి మద్దతుగా నిలవాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తున్న కూటమి పార్టీలకు ప్రజలు ఆశీర్వాదం కావాలి. త్వరలో జరగబోయే 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజా ఆశీర్వాదం కొనసాగాలి" అని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
Link: https://t.co/fg8ZS0qIO9
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి
•పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి
•ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
@PIB_India@IPR_AP@pibvijayawada