గత పదేళ్లలో బీఆర్ఎస్ యువతకు చేసింది ఏమీ లేదు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. మేము ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఏటీసీ సెంటర్ల ద్వారా ప్రతి ఏడాది 20-25 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్‌కు సూచిస్తున్నాను.
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బీఎల్ఏ-2 సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నాను. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుకు జరుగుతున్న ప్రయత్నాలను అప్రమత్తంగా గమనించాలని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడేందుకు బీఎల్ఏలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చాను.
అలాగే, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు, పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాను. యువత విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను.
బీఎల్ఏ-2 సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై స్పందన, రాబోయే రాజకీయ కార్యాచరణపై సమగ్రంగా చర్చించాము.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశాను.
చెన్నూరులో రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించాను. నియోజకవర్గంలో గోడౌన్లు, లేబర్ కొరత, లారీల సమస్యలు తలెత్తకుండా అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకున్నాను. మైనింగ్ పీవోతో మాట్లాడి ఇసుక లారీలను వడ్ల రవాణాకు డైవర్ట్ చేయాలని ఆదేశించాను.
చెన్నూరులో 2022‑23లో జూన్ 15 నాటికి 1.13 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయబడింది. ఈసారి మే 27 నాటికే 1.06 లక్షల టన్నులు కొనుగోలు అయ్యాయి. జూన్ 6 నాటికి మొత్తంగా 1.60 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించాను.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశాను. ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది.
గత పంట సీజన్లో లక్ష పది వేల టన్నుల కొనుగోళ్లు జరిగితే, ఈసారి జూన్ 6 వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగించి లక్ష 70 వేల టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
పెద్దపల్లిలో మూడు గోడౌన్లు కేటాయించడం జరిగింది. హమాలీల కొరత, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. అందుకే సింగరేణి సంస్థను లారీలు ఇవ్వాలని కోరాం.
కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కావాలనే ధర్నాలు చేస్తున్నారు. రైతులకు భరోసా కల్పించాల్సింది పోయి పార్టీలకు అతీతంగా వారిని ఆందోళనల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు తిరస్కరించిన తర్వాత వచ్చిన ఫ్రస్ట్రేషన్లో బాల్క సుమన్ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో వందల లారీలు నిలిచిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని షో చేయాలని బాల్క సుమన్ చూస్తున్నాడు. రైతులు ధర్నాల్లో పాల్గొనడం లేదని, రావడం లేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అయినా కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ ఆందోళనలు చేయించాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించేది లేదు. చట్టపరమైన చర్యలు తప్పవు.
గత ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేశానని బాల్క సుమన్ స్వయంగా అన్నాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలందరూ చూశారు. తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి.
సింగరేణిని నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పింది వాళ్లే. మరి అలా అయితే సింగరేణి భవన్‌ను కాల్చివేయాలా? ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలి.
కేవలం బండి సంజయ్ కుటుంబం గురించి రేవంత్ రెడ్డి కుటుంబం గురించి ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడటం కాదు దేని మీద ప్రెస్ మీట్ పెట్టి స్పందించండి @RSPraveenSwaero@KTRBRS@BRSHarish
బాలికపై అత్యాచారం.
జోకులు వేసుకున్న ముగ్గురు ఐపీఎస్ లు. ముగ్గురి జాబులు పీకి పడేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. @TVKVijayHQ
తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి..
అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. అంతేకాదు జరిగిన ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పరామర్శించారు.
ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించిన విషయాలను చెప్పడానికి నిన్న ఒక మహిళ ఐజీ అధికారి.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళ ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ.. ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆ మహిళ ఐజీ అధికారి వ్యవహరించిన తీర్పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా.. నీక్కూడా పెళ్లయి ఉంటుంది కదా.. నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా.. ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిపోయాయి.
విజయ్ వెంటనే స్పందించారు. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు.
ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని.. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు.
దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని.. పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు.
మినిమమ్ వేజెస్ కమిటీ చర్చల్లో పరిశ్రమల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పెట్టుబడులు ఆకర్షించేలా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పాటు, కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. సీఐఐ, ఫాప్సీ ప్రతినిధులు కూడా పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని వేతనాల పెంపు అవసరమన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
తెలంగాణలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ ఉపాధి రంగాలలో కొత్త కనీస వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.11 కోట్లకు పైగా కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కొన్ని రంగాలలో గరిష్టంగా 34.95% వరకు వేతనాలను పెంచాం. కార్మికులకు కనీస జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత కల్పించడాన్ని ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం 73 షెడ్యూల్డ్ ఉపాధి రంగాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలు సవరించాల్సి ఉన్నప్పటికీ, 2012 తర్వాత సమగ్ర సవరణ జరగలేదు. ఆ లోటును ఇప్పుడు భర్తీ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, ఒస్మాన్నగర్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను. రూ.60 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నాం.
సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానికులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
భవిష్యత్ తరాల మెరుగైన భవిత కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ప్రతి విద్యార్థికి మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందేలా కృషి కొనసాగిస్తున్నాం.
KTR: హల్లో RSP
RSP: దొర చెప్పు
KTR: జనగాం జిల్లాలో మన పార్టీ నేత ఒక గలీజ్ పని చేసిండు నువ్వు మీడియా ముందుకు పోయి మాట్లాడకు.
నీ పాత్ర కేవలం బండి సంజయ్ వరకే.
RSP: అలాగే దొర, నువ్వు చెప్పినట్టు వింట.
KTR: పోయి మల్ల ఇంట్ల రెస్ట్ తీసుకో.
RSP: అట్లనే దొర.
పాస్టర్ అభినయ ధర్శన్ ని నరికేసిన దుండగులు..💔😲😱
టీడీపీ , జనసేన ప్రభుత్వంలో ఏంటి దళితులు , క్రైస్తవులు , పాస్టర్లపై ఇలాంటి దాడులు ?
పవన్ కళ్యాణ్ ఏమో 2029లో కూడా టీడీపీ జనసేనకి ఓట్లు వేయండి.. వైసీపీ గెలిస్తే ప్రజలని చంపేస్తారు అని చెప్పాడు..మీ ప్రభుత్వంలో ఏమో ఇలా చంపేస్తున్నారు
నరేంద్ర మోడీ గారు, ఆయన ‘వరల్డ్ క్లాస్’ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వల్ల గ్యాస్ నుంచి మళ్లీ మట్టికట్టెలపైకి వచ్చాం.
ప్రపంచానికి ఇమేజ్ సూపర్… కానీ మన ఇళ్లలో పొగే పొగ. 🔥
@narendramodi@BJP4India@DrSJaishankar
నేను సింగరేణి 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సురేష్ ను పరామర్శించడానికి రెనీ ఆసుపత్రికి వెళ్లాను. ఈ సంఘటన గురించి తెలియగానే, వెంటనే ఆసుపత్రికి చేరుకుని అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నాను.
డా. బంగారు స్వామి తో మాట్లాడి, గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలన్నది వైద్యులకు సూచించాను. మన కార్మికుల ఆరోగ్యం నా మొదటి ప్రాధాన్యత. వారిని అన్ని రకాల సహాయం అందించేందుకు నేను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నాను.
మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమమే మా ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రస్తుత జీవన వ్యయం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు గౌరవప్రదమైన కనీస వేతనం అందేలా శాస్త్రీయ విధానంలో వేతనాల సవరణ చేపట్టాలని నిర్ణయించాము.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, కేంద్ర ప్రభుత్వ నూతన లేబర్ కోడ్ ప్రభావం వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాము. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు న్యాయం చేసే విధంగా తుది నిర్ణయం తీసుకుంటాము.
కార్మికుల పక్షపాతిగా తెలంగాణను మరింత బలోపేతం చేయడమే మా ప్రభుత్వ దృఢ సంకల్పం.