✨ దీపావళి శుభాకాంక్షలు! ✨
ఈ దీపావళి పండుగ మీ జీవితంలో వెలుగులను నింపి, అందరికి ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
మీ కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.
🌟 దీపావళి శుభాకాంక్షలు! 🌟
ఆర్కే రోజా సెల్వమణి
@RojaSelvamaniRK
పుత్తూరు | 18.10.2025
పుత్తూరు ఏడికె కళ్యాణ మండపంలో మాజీ మంత్రి ఆర్.కే. రోజా గారు మున్సిపాలిటీ మరియు రూరల్ వైఎస్ఆర్సిపి నాయకులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, కమిటీల రూపకల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను సమీక్షించారు.
తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, కరపత్రాలను నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.
రోజా గారు ప్రజలందరూ సంతకాల సేకరణలో చురుకుగా పాల్గొని, వైఎస్ఆర్సిపి సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రూరల్, మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.
సొంత జిల్లా మామిడి రైతులకు బాబు మార్కు మోసం!
మోసానికి మారుపేరు @ncbn గారు! ఆయన ప్రత్యేకత నమ్మిన వారినే మోసం చేయడం. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే ‘నాలుక మందం’ అంటున్నారు.
ఇప్పుడు సొంత జిల్లా చిత్తూరు మామిడి రైతులకూ చంద్రబాబు తనదైన శైలిలో మోసం చేస్తున్నారు. మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్యలపై పర్యటించి, వారికి గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
జగనన్న బంగారుపాళ్యానికి రానున్నారన్న సమాచారం తెలిసి, రైతులను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు కొత్త నాటకం ఆడారు.
తోతాపురి మామిడి కిలోకు ఫ్యాక్టరీలు ₹8, ప్రభుత్వం ₹4 చొప్పున మొత్తం ₹12 ఇస్తామని హామీ ఇచ్చి, మామిడి రైతుల సమస్య పరిష్కారమైందని అబద్ధ ప్రచారం చేశారు.
చంద్రబాబు మాటను నమ్మిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన దాదాపు 30 వేల మంది రైతులు 4.5 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు.
ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఫ్యాక్టరీల వాటా ₹360 కోట్లు, ప్రభుత్వ వాటా ₹180 కోట్లు, మొత్తం ₹540 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ మామిడి సీజన్ ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు.
తమ ఆవేదనను చర్చించుకోవడం కోసం రైతులు రాజకీయాలకు అతీతంగా బంగారుపాళ్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, ఆ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం దారుణం.
చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మామిడి రైతుల బకాయిలు ₹540 కోట్లు తక్షణం చెల్లించాలని చిత్తూరు జిల్లా ఆడబిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నాను. మామిడి రైతుల పోరాటానికి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది - @RojaSelvamaniRK
#SaveFarmer #SaveAPFarmers #APMangoFarmers
🌟💐 అసాధారణమైన విజయానికి, హృదయ పూర్వక శుభాకాంక్షలు! 💐🌟 శ్రీమతి @RojaSelvamaniRK కుమార్తె
అన్షు రోజా సెల్వమణి గారు
2025-26 Maureen Biggers Leadership Award for Equity and Technology
అందుకోవడం గర్వానికి, ఆనందానికి, మరియు గొప్ప ఆశయాలకు నిదర్శనం!
🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
ఈ రోజు మనకు స్వేచ్ఛను అందించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకునే రోజు.
మన దేశం శాంతి, ఐక్యత, అభివృద్ధి పథంలో ఎల్లప్పుడూ దృఢంగా ముందుకు సాగాలి.
ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి.
జై హింద్! ✊🇮🇳
#IndependenceDay
చిత్తూరు - కుప్పంలో..
ముఖ్యమంత్రి @ncbn గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో... విద్యార్థుల బతుకు విలువ ఇదేనా?
స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు!
తల్లిదండ్రుల ఆవేదన: “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?”
ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా?
@naralokesh గారు, పేద పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖ పై దృష్టి పెట్టండి 🙏
#ShameOnCBN #ShameOnLokesh
#SchoolNegligence #SaveChildren