ఇదీ మన తెలంగాణ అని ఎలుగెత్తి చాటుదాం...
ఇదీ మన ప్రగతి అని గొంతెత్తి పాడుదాం...!
ఆరు దశాబ్దాల ప్రజా ఉద్యమం ఫలించి, స్వరాష్ట్రమై అవతరించిన తెలంగాణలో పునర్నిర్మాణ యజ్ఞం ప్రతీ రంగంలో అంకితభావంతో కొనసాగుతున్నది. సకలజనులకు సంక్షేమ ఫలాలను పంచుతూ అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaTurns10
#TelanganaFormationDay
Showcasing Beautiful Kamareddy district,natural grasslands, waterbodies, tribal hamlets, traditional mud homes,rich crafts and Heritage 💧💧Watch this space for more
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈరోజు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ:
జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులతోను క్రోడికరించి రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబందు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @SatyavathiTRS ను సీఎం ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు.
జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.
ఇండ్ల స్థలాల పంపిణీ:
ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం నిర్ణయించారు.
జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం:
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు.
నిమ్స్ దవఖాన నూతన భవనానికి శంఖుస్థాపన:
జూన్ 14, వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.