Thank You Venu 😊❤️
మీ ప్రేమకు, ఆప్యాయతకు, నాపై ఉంచిన నమ్మకానికి నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. మీరు కట్టిన రాఖీ నా బాధ్యతకు వేసిన ముడి.
మీ ఉద్యోగ పోరాటంలో మీ అన్నగా ఎప్పుడూ ముందుంటాను. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం చివరి వరకు పోరాడతాను. మీ గెలుపు నా బాధ్యత!
ఇట్లు,
మీ అన్న
రాకేష్ రెడ్డి
🔹రాఖీ పౌర్ణమి స్పూర్తితో అన్నగా మీ అందరికి అన్నివేళలా అండగా ఉంటా🙏
🔹హైదరాబాద్ లోని షైన్ ఇండియా కోచింగ్ సెంటర్ వేదికగా నిరుద్యోగ తమ్ముళ్లు, చెల్లెళ్లతో కలిసి రక్షాబంధన్ జరుపుకోవడం ఎంతో భావోద్వేగ క్షణం.
🔹నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన షైన్ ఇండియా అధినేత జలీల్ సర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
🔹ఆ చెల్లెల్లు నాకు రాఖి కట్టిన సందర్భంగా నేను వారికి ఈ విషయాలు స్పష్టంగా చెప్పాను:
🔹అర్ధరాత్రి పగలు అనక గ్రంథాలయాల్లో, కోచింగ్ సెంటర్లలో మీ కష్టాన్ని నేను చూస్తున్నాను. మీ కన్నీళ్లను, ఆవేదనను చూస్తూ ఊరుకోను.
🔹మీరు ఒంటరి కాదు. మీ వెనుక మీ కుటుంబం ఉంది, మీ అన్న ఉన్నాడు. నిరాశను దరిచేరనీకండి.
🔹మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ చంపలేరు. మీ మేధస్సు, మీ కష్టం ఎప్పటికీ వృథా పోవు. చీకటి ఎంతగా కమ్ముకున్నా ఉదయం సూర్యుడు ఉదయించక మానడు. మీ జీవితాల్లో ఆ వెలుగును తీసుకొచ్చే బాధ్యత నాది.
🔹ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం... చట్ట సభలో అయినా లేదా జన సభలో అయినా , వీధుల్లో అయినా ప్రభుత్వ గడప తొక్కైనా మీ తరఫున రాజీలేని పోరాటం చేస్తాను.
🔹ఈ రక్షాబంధన్ రోజున మీరు నాకు కట్టిన ఈ దారాలు... కేవలం రంగు దారాలు కావు. అవి నా మీద మీరు ఉంచిన బాధ్యత, నమ్మకం. ఆ నమ్మకాన్ని నా చివరి రక్తపు బొట్టు వరకు నిలబెట్టుకుంటాను.
చెడు వినకు
చెడు చూడకు
చెడు మాట్లాడకు
మూడు కోతుల గురించి మనకు తెలిసిందే,
కానీ ఖమ్మం జిల్లాలో మూడు పెద్ద కోతులు ఉన్నాయ్, అవి వేరే రకం.
ప్రజల కష్టాలు వినరు
ప్రజల బాధలు చూడరు
ప్రజల సమస్యల గురించి మాట్లాడరు.
ఆ కోతులు ఎవరో మనందరికీ తెలుసు.
#3MonkeysOfKhammam
కోట్ల విజయ్ భాస్కర్ గారి నుండి వైయస్ రాజశేఖర్ రెడ్డి వరకు చరిత్రలో అత్యధిక పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర గుర్తించి 29% పీఆర్సీ కమిటీ ప్రతిపాదిస్తే, కేసీఆర్ గారు ఏకంగా 43% ఇచ్చారు. దేశ చరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డ్.
#PRC #TelanganaEmployees
📍ఖమ్మం నియోజకవర్గంలో
ఖమ్మంలో నిర్వహించిన BLAs ఆత్మీయ సమ్మేళనం వేడుకల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ @puvvada_ajay గారు, కూరాకుల నాగభూషణం గారు, ఆర్జేసీ కృష్ణ గారు, నాగరాజ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా బీఎల్ఎస్లను ఘనంగా సన్మానించి, అభినందించడం జరిగింది.
ఇదే వేదికగా ప్రస్తుత కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వం మంత్రుల మధ్య సమన్వయం లేక, వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీ ఒక Divided House గా మారిపోయింది అని చెప్పాను.
ఆంతరంగిక కలహాలతో రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, తెలంగాణను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది.
ప్రజల పక్షాన నిలబడి, మన కేసీఆర్ KCR గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలని పిలుపునిచ్చాము.
#SIR #BLA
వేణు అనే నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు వెళ్లి పరామర్శించినపుడు, మంత్రులుగా చెలామణి అవుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు ఎక్కడ పడుకున్నారు?
ఈ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల కనీస ధ్యాసలేని దుర్మార్గ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
#congressLootsTelangana
నేడు ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం మేము పరుగు తీశాము. రేపటి నుండి ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాం.
ఓరుగల్లు కేంద్రంగా ప్రారంభమైన ఏ ఉద్యమం ఓడిపోలేదు. ఉద్యోగస్తుల, రిటైర్డ్ ఉద్యోగుల, నిరుద్యోగుల ఉద్యమం కూడా ఓడిపోదు.
కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వం మెడలు వంచైనా నూతన పీఆర్సీ, పెండింగ్ బకాయిలు విడుదల చేయిస్తాం.
ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకున్న బీ ఆర్ ఎస్ పార్టీ @BRSparty మీకు అండగా ఉంటుంది.
ఈ రోజు ఉద్యోగస్తుల, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమై తలపెట్టిన 2k రన్ విజయవంతం అయింది.
పెద్దయెత్తున పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, మీకు అండగా కడవరకు మేము కోట్లాడుతాము.
సంఘీభావం తెలిపిన యువత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శుభాభినందనలు.
జై తెలంగాణ✊
#CongressBetrayedRetiredEmployees
#RevanthCheatedRetiredEmployees
నోటిఫికేషన్ లేని జీవో చిత్తు కాగితం తో సమానం.
హిట్లర్ తనకు ఆదర్శమన్న రేవంత్ రెడ్డి @revanth_anumula అచ్చం అదే బాటలో నడుస్తున్నాడు.
ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
మూడేళ్లుగా నానబెట్టి, ముప్పు తిప్పలు పెట్టీ ఇప్పుడు అదే మూడేళ్లు వయోపరిమితి పెంచారు.
కానీ, నోటిఫికేషన్ ఇస్తేనే ఆ జీవో కు ఏమైనా సార్ధకత ఉంటది.
తక్షణమే వయోపరిమితి జీవో తో పాటు 20 వేల పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి.
#CongressBetrayedTelanganaYouth
దేశం కోసం కొట్టుకునే గుండె స్పందన, జెండాను చూసి పొంగిపోయే మనసు.
మువ్వెన్నెల జెండా నీడన, సమాజం కోసం పరితపించే మా కార్యకర్తల నడుమ ఈ రోజంతా పండుగే!
దీనికి మించిన అదృష్టం ఏముంటది? 😊🇮🇳❤️
#IndependencedayIndia
నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ @KTRBRS గారి పర్యటనలో వారితో కలిసి పలు వివాహాలకు, కార్యక్రమాలకు పాల్గొన్నాను.
#KTR#BRSParty#RakeshReddyAnugula
గండిపేటలోని నియో కన్వెన్షన్లో జరిగిన మాజీ సీఎంఓ స్పెషల్ సెక్రటరీ రాజశేఖరరెడ్డి గారి అన్న సోమశేఖర్ రెడ్డి గారి కుమారుని వివాహానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ @KTRBRS గారు, మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు @BRSHarish గార్లతో కలిసి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
మీ రక్తాన్ని నాకివ్వడని నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను.
-నేతాజీ సుభాస్ చంద్రబోస్
కడిపికొండ, విశ్వశాంతి పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
•||వందేమాతరం||•
#HappyIndependenceDay 🇮🇳
#IndependenceDay#80thIndependenceDay
స్వరాజ్యం నా జన్మహక్కు
Freedom is my birth right
-బాల గంగాధర్ తిలక్
🔹హన్మకొండ, అరుణదోయ జూనియర్ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
🔹ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్ దశలో ఉన్న విద్యార్థులతో సంభాషించే సదవకాశం లభించింది.
•||వందేభారతమాతరం||•
#HappyIndependenceDay 🇮🇳
#IndependenceDay #80thIndependenceDay