#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వెలిగొండ సంబరం-కృష్ణమ్మకు వందనం..!
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఈరోజును నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను. రైతులు, నిర్వాసితులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన నేను... మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండలో కృష్ణమ్మ జలాలను ఆహ్వానించడం, కరువు నేలపై జలసిరులను చూడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. కరువుతో పోరాడిన రైతన్నలు, ఫ్లోరైడ్ బాధలు అనుభవించిన కుటుంబాల సమస్యలు ఇకనుంచి తీరనున్నాయి. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు... పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బంగారు కొండ. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త అధ్యాయం. అందరికీ శుభాకాంక్షలు... వెలిగొండను సాకారం చేయడానికి కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. వెలిగొండ మొదటి దశతో మార్కాపురం ప్రాంతానికి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇక మార్కాపురం అన్ స్టాపబుల్...
వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు.
#VeligondaProject
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
కొడుకును కోల్పోయిన తండ్రిని జగన్ పరామర్శించడం వరకు పర్వాలేదు. కానీ అదే పరామర్శలో చెన్నారెడ్డి హత్యలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పాత్ర కానీ, టీడీపీ నేతల ప్రమేయం కానీ ఉందా... అని అడగడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అయితే చంపింది మన గొడ్డలి పార్టీ వాళ్ళే అని అంటూ గొడ్డలి పార్టీ హత్యారాజకీయాలను భాస్కర్ రెడ్డి బయట పెట్టడంతో జగన్ ఖంగుతిన్నాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంతతక్కువ సమయంలో అరకోటి కుటుంబాలకు పార్టీని చేర్చగలగడం... ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మామూలు విషయం కాదు. కేవలం కార్యకర్తల సంకల్పంతోనే ఇది సాధ్యం. అందుకు కార్యకర్తలకు అభినందనలు. ఇదే ఉత్సాహంతో “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#AndhraPradesh
రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును, బకింగ్ హామ్ కాలువపై నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించాను. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. అనేక అడ్డంకులు సృష్టిస్తూ, లెక్కకు మించి కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుపడినా.... అన్నింటినీ దాటుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన పురపాలక శాఖామంత్రి నారాయణ గారికి, సీఆర్డీఏ అధికారులకు అభినందనలు. రాయపూడి వద్ద నూతనంగా నిర్మించిన శాసనమండలి, శాసనసభ్యుల నివాస సముదాయాలను కూడా పరిశీలించాను. త్వరలో వీటిని సభ్యులకు కేటాయిస్తాం. రానున్న రోజుల్లో అమరావతిలో ఒక్కో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఈ శుభారంభంతో ప్రజా రాజధాని అమరావతి అజరామరం అవుతుంది.
@Dr_NarayanaP@mnadendla
#SeedAccessRoad
#AmaravatiUnstoppable
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
టెట్ క్లియర్ చేయకుండా స్పోర్ట్స్ కోటా లో జాబ్ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం!
టెట్ ధ్రువీకరణను స్క్రూటినీ కమిటీ పద్ధతిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు..
కేవలం ఆన్ లైన్ పరిశీలన మాత్రమే కాకుండా.. ఫిజికల్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి ధ్రువీకరించుకున్నారు..
జెన్యునిటీ సర్టిఫికెట్ సహా, అన్ని రకాలుగా నిగ్గు తేలాకే.. వారి అర్హతలను పరిగణించడం జరిగింది.
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
ఫేక్ సర్టిఫికెట్స్ అనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఫేక్ పై ఒక్క కేసు కూడా హైకోర్టులో లేదు..
‘నాకు ప్రయారిటీ రాలేదు’ అనే గ్రీవెన్సెస్ తప్ప.. ఎవ్వరూ ఫేక్ అనే క్లెయిమ్ చేయనేలేదు..
రికగ్నయిజ్డ్ సంస్థల నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ జెన్యూనిటీ చెక్ చేయడం మాత్రమే శాప్ పాత్ర..
ఫేక్ అని ఇప్పుడు మాత్రమే లేవనెత్తుతున్నారు.. హైకోర్టులో 69 కేసులుంటే.. ఒక్కటీ ఇలాంటిది కాదు..
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh