నేడు గజ్వేల్ పట్టణ కేంద్రంలో @BSYJAC_SDPT మరియు @Bsp4G ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయి ఫూలే గారి 194 జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.💐💐🩵✊🙏.
#SavitriBaiPhuleJayanti@Bahujan_JAC
బహుజన విద్యార్థి యువజన జేఏసీ(#BSYJAC ) : సమాజంలో మార్పు కోసం
భారతదేశంలో బహుజన విద్యార్థులు, యువత ప్రధానంగా అణగారిన వర్గాలకు చెందినవారు. కుల వివక్ష, ఆర్థిక దోపిడీ, సామాజిక అణగావలు విద్యార్థి సమస్యలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఈ వర్గాల కోసం సమాజంలో మార్పు తీసుకురావడమే ఈ బహుజన విద్యార్థి యువజన జేఏసీ(#BSYJAC ) ముఖ్య ఉద్దేశ్యం. ఈ కమిటీ ద్వారా, బహుజన విద్యార్థులు మరియు యువత ��మ హక్కులను సాధించుకోవడమే కాక, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడుతున్నాము
బహుజన విద్యార్థి యువజన జేఏసీ #BSYJAC యొక్క ప్రధాన లక్ష్యం సమాజంలో ప్రతి వర్గానికి సమాన హక్కులు మరియు అవకాశాలను అందించడం. ఈ కమిటీ కులవివక్ష, లింగ వివక్ష, మరియు ఇతర వివక్షలను నిర్మూలించడానికి పోరాడుతుంది. బహుజన యువత తమ హక్కులను, గౌరవాన్ని, మరియు సమాన అవకాశాలను సాధించే దిశగా గట్టిగా నిలబడుతుంది.
బహుజన విద్యార్థులు మరియు యువతకు ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలు, మరియు ప్రభుత్వ పథకాలు కల్పించడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం, మంచి జీవన ప్రమాణాలను ఇవ్వడం కోసం పోరాటం చేయడమే ఈ కమిటీ లక్ష్యం. ప్రభుత్వ శాఖలలో సబ్సిడీ, రిజర్వేషన్లు వంటి ఆర్థిక పథకాలను సమర్థంగా వాడుకోవడం, ఆరు దశాబ్దాలుగా వస్తున్న అణగారిన వర్గాల ఆర్థిక భారం తగ్గించడం.
బహుజన విద్యార్థులందరికీ అత్యున���నత విద్య అందించేందుకు అనేక కార్యాచరణలు చేపట్టడం. బహుజన విద్యార్థుల కోసం కులపరమైన రిజర్వేషన్లు, పేదరికానికి సంబ��ధించిన స్కాలర్షిప్లు మరియు విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం. ఈ కార్యక్రమాలు తమకు మరింత గొప్ప భవిష్యత్తు సాధించేందుకు వీలుపరుస్తాయి
ఈ కమిటీ యువతను సామాజిక చైతన్యంతో, పూర్వకాలంలో ఉన్న కుల వ్యవస్థ, వివక్ష, దళిత ఉధృతి వంటి అంశాలపై అవగాహన కల్పించడం మరియు సమాజంలో మార్పు కోసం వారి పాత్రను తెలియజేయడం. యువతను సశక్తపరచడం, వారిలో సమాజంలో మార్పు తీసుకురావడంపై అంకితభావాన్న��� పెంచడమే ప్రధాన లక్ష్యం.
బహుజన విద్యార్థులు మరియు యువత రాజకీయ రంగంలో కూడా తమ స్థానాన్ని బలపరిచేందుకు పోరాడుతుంటాము. ఈ కమిటీ సాంఘిక మార్పులకు రాజకీయ పరమైన మార్పును సమర్థించేందుకు, విద్యార్థి సంఘాలు, యువత సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పించేందుకు పోరాడుతుంది. రాజకీయంగా శక్తివంతమైన ప్రాతినిధ్యాన్ని కోరుకోవడం, వారి హక్కుల సాధనలో కీలకమైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం.
@Bahujan_JAC
వేచరేణి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకం
ఇసుక ఎత్తుతున్న విద్యార్థులు
పుస్తకం పక్కన పెట్టించి తట్ట,పార పట్టించిండ్రు..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో పుస్తకం పెన్ను పక్కన పెట్టించి తట్ట పార పట్టించారు. ప్రభుత్వం బడి పిల్లలకు చదువు తప్ప మరేపని చేయించొద్దని ప్రచారాలు చేస్తుంటే అందుకు భిన్నంగా ఆ పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కూలి పనులు చేయిస్తున్న సంఘటన శుక్రవారం చేర్యాల మండలం వేచరేణి ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. వేచరేణిలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ��కే చోట ఉన్నాయి. పాఠశాలకు సంబంధించిన ప్రధాన గేటు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇది లా ఉంటే పాఠశాల ముందు భాగంలో ఉన్న ఇసుకను పాఠశాల ప్రాంగణంలోకి ఎత్తి పోయాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదేశించడంతో విద్యార్థులు ఇసుకను పాఠశాల ప్రాంగణం లోకి ఎత్తి పోశారు. ఈ విషయమై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరేందర్ ను వివరణ కోరగా స్వంత పని నిమిత్తం మధ్యాహ్నం నుంచి సెలవులు తీసుకున్నట్లు తెలిపారు. చదు���ుకునే బడి పిల్లలను కూలీలుగా చేసి పిల్లల చేత పనులు చేపిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బహుజన విద్యార్థి యువజన జేఏసీ డిమాండ్ చేస్తుంది. @Bahujan_JAC @Collector_SDPT @revanth_anumula @TelanganaCMO @TelanganaCS
ప్రైవేట్ స్కూల్స్ (నారాయణ, శ్రీ చైతన్య) ప్రభుత్వ అనుమతులు లేకుండా అలాగే ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఇష్టానుసారంగా నడిపిస్తున్న పాఠశాలల యాజమాన్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్���ాము.
నారాయణ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఉదయం ఊరి వేసుకొని చనిపోయిన 7th క్లాస్ చదువుతున్న లోహిత్ రెడ్డి వల్ల కుటుంబానికి న్యాయం జరగాలని సంబంధించిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని @Bahujan_JAC కోరుతున్నాము
( చట్టం ఎవరికి చుట్టం కాదు )
@revanth_anumula @TelanganaCMO
గత కొన్నిరోజులుగా ప్రైవేట్ కళాశాల అయినటువంటి శ్రీ చైతన్య కళాశాలలో ఎన్నో దారుణాలు జరిగినవి.
అలాగే అధిక ఫీజులు వసూల�� చేస్తూ ఎంతో మంది పేద విద్యార్థ���లను వారి కుటుంబాలను ఆర్ధికంగా చాలా ఇబ్బందులకు గురి చేసిన చరిత్ర శ్రీ చైతన్య కళాశాలకు ఉంది.
ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కళాశాలల వల్ల విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది.
ముందు కాలేజ్ లో హాస్టల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలేజ్ ��ాజమాన్యానికే సపోర్ట్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఇలాంటి పర్మిషన్ లేకుండా అలాగే ఇలాంటి కళాశాలలకు పర్మిషన్ రద్దు చేయాలని అలాగే ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు ఇవ్వకూడదు అని @Bahujan_JAC గా డిమాండ్ చేస్తున్నాము.
@TelanganaCMO @revanth_anumula @EduMinOfIndia @TSEduDept @TelanganaCS
ఇంతకు ముందు తిండి లేక సచ్చిపోయెటొళ్లు బహుజనులు. ఇప్పుడు తింటే సచ్చిపోతున్నరు.
బహుజన బిడ్డల మీద జరుగుతున్న ఈ ఫుడ్ పాయిజన్ దాడులపై BSYJAC ఆందోళనకు పిలుపునిస్తోంది.
అన్ని బహుజన సంఘాలు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భవిష్యత్తులో మరింత మంది బహుజన బిడ్డలు చనిపోకుండా చూడాలని మనవి.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది.
వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నట్టు @TelanganaCS
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రులందరూ పక్క రాష్ట్రంలో ప్రచారాలకు వెళ్లే సమయం ఉంటుంది కాని ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ బడులు, సంక్షేమ హస్టళ్లలో జరుగుతున్న ��రిణామాల గురించి చర్చించే సమయం లేదు.
ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్న పట్టింపు ఇది...??
మీ ఈ అసమర్థ పరిపాలన వల్ల ఎంతో మంది పేద గిరిజన విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
విద్యా శాఖ కు అసలు మంత్రే లేడు ఉన్న శాఖలన్నీ సీటు కింద పెట్టుకొని పరిపాలన సాగించడమా ముఖ్యమంత్రి గారు..?? @revanth_anumula @TelanganaCMO
@Murali_IASretd సార్ ఉన్నారా...??
స్పందిస్తారా ఏం అయినా..??
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పటికి అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సరైన విద్యా,మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని బహుజన విద్యార్థి యువజన జేఏసీ గా డిమాండ్ చేస్తున్నాము.
#CongressFailedTelangana @RahulGandhi @EduMinOfIndia @Bahujan_JAC @tonybekkal
ఏంది ఈ పైత్యం? సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు? పిల్లల భవిష్యత్తు కంటే మీ రాజకీయాలే ముఖ్యమా?
మొన్న కులగణన కోసం బడులు బంద్ చేసి ఒక్క పూట బడులు పెడుతారు. సీఎం సభ ఉందని బడులు బంద్ చేస్తారు.
కాకతీయులు రాచరిక పోకడలకు పోయారని సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. మరి మీరు చేస్తున్న దాన్ని ఏమనాలో? @revanth_anumula
ప్రధానమంత్రి @narendramodi గారు వచ్చిన రోజు కూడా వరంగల్ లో బడులు బంద్ పెట్టలేదు కానీ ఇప్పుడు సీఎం అయిన @revanth_anumula రేవంత్ రెడ్డి గారు వస్తే హన్మకొండ లో అన్ని స్కూళ్ళు బంద్ పెడతారట.
విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బడులు మూసేయడాన్ని బహుజన విద్యార్థి యువజన జేఏసీ ఖండిస్తోంది
@Bahujan_JAC #BSYJAC #teambsyjac @bsp_ts@tonybekkal@Ambedkar_Boys@BahujanCarawan
బాసర ట్రిపుల్ ఐటిలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే @TelanganaCMO@TelanganaCS రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ?
విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా ?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదు?బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ట్రిపుల్ ఐటీ విద్యార్ధి స్వాతి ప్రియ ఆత్మహత్యకు కారణాల���ై సమగ్ర విచారణ జరిపి, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. ఇంకా జాప్యం చేయకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. @revanth_anumula @Bahujan_JAC
ఇదే స్ఫూర్తిని "మన చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం కొనసాగిద్దాం. 👆
*చేర్యాల రెవిన్యూ డివిజన్ జీవో వచ్చేవరకు సమగ్ర కుటుంబ సర్వే బహిష్కరిద్దాం* .
చేర్యాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించాలనే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత మట్టి బిడ్డలుగా.. అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న సామాజిక కార్యకర్తలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి ఉద్యమాభినందనలు. ✊✊✊
నా��ు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పంత ఏదైనా మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడం ఇప్పుడు కూడా అదేవిధంగా
మన ప్రాంత అభివృద్ధి కోసం చేర్యాల ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న బలమైన ఆకాంక్షతో చేర్యాల, మద్దూర్, కొమురెల్లి, దూల్మిట్ట మండలాలను కలుపుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అంశం ప్రభుత్వానికి వివిధ రూపాల్లో త���లియజేశాం.
అందులో భాగంగానే ప్రభుత్వానికి మన అంశం తెలియాలంటే ముఖ్యంగా రెవెన్యూ పరమైన అంశం ప్రభుత్వానికి చేరాలంటే మనకు ఇదొక్కటే మార్గం. అందుకు పార్టీలకు అతీతంగా.. రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ మేధావులు, విలేకరులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, కవులు, కళాకారులు అందరూ ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను.
ఇది తప్పు ఒ���్పో కానీ ప్రాంత అభివృద్ధి కోసం మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్తే మన లక్ష్యం నెరవేరుతుందనే
బలమైన ఆకాంక్షతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను.
వీలైతే ఈ అంశంపై మేధావులంతా కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. #CherialRevenueDivision @TelanganaCMO @revanth_anumula @KomatireddyKVR @kiran_chamala @BRSHarish @KTRBRS @RahulGandhi @TSwithKCR @TelanganaCS @Ponnam_INC
సోషల్ మీడియా ద్వారా పోస్టులు మరియు అభిప్రాయాలను తెలియపరిస్తే ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని గౌరవ సుప్రీమ్ కోర్టు ఆదేశించింది అన్ని రాష్ట్రాలకు ఆర్డర్ జారీ చేసింది కాని తెలంగాణాలో రేవంత్ సర్కార్ మరియు పోలీసు శాఖ కోర్టు ఆర్డర్ అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయింది @TelanganaDGP
ఆర్టికల్ 19(1)(a)భారత రాజ్యాంగంలో భారతీయ పౌరుల "భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ" హక్కును పొందుపరుస్తుంది
దీని ప్రకారం,ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తపరచుకోవటానికి,చెప్పటానికి, రాయటానికి,మరియు ప్రచారం చేయటానికి హక్కు ఉంది. ఈ హక్కు మానవుని స్వేచ్ఛా స్వభావానికి ముఖ్యమైనది
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో అభం శుభం తెలియని ఏడో తరగతి చదువుతున్న 9సంవత్సరాల బాలికపై అత్యంత పాషవికంగా సమాజం తలదించుకునేలా అత్యాచారం ఘటనకు పాల్పడిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలని బహుజన విద్యార్థి యువజన జేఏసీ డిమాండ్ చేస్తుంది
@siddipetcp@TelanganaCMO
పాలకులను,ప్రభుత్వాలను ఒక పద్ధతిలో ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ వ���ద్యార్థులు, యువతను బహుజన రాజకీయాల వైపు చైతన్యం చేస్తున్న @Bahujan_JAC రాష్ట్ర కోకన్వీనర్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... 🎂💙@Pavankalyan1916 @tonybekkal