Hon'ble Union Minister of Finance & Corporate Affairs, Smt. Nirmala Sitharaman visited Mangaluru Port and inspected the Customs processes.
👉This was followed by an open interaction with members of the Trade & Industry in Mangaluru to seek their feedback and suggestions on EoDB and trade.
👉She was accompanied by Shri Vivek Chaturvedi, Chairman CBIC and Shri Yogendra Garg, Member (Customs) CBIC.
Additional Commissioner, Customs & CGST, Shri N. Balram, IRS, popularly known as the "Treeman of Telangana," planted saplings at the Office of the Chief Commissioner, Visakhapatnam , on the occasion of World Environment Day @balaram_irs
భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు🚩🙏
@balaram_irs
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆయన చూపిన ధర్మ మార్గం, సేవా స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
#SantSevalalMaharaj 🙏🙏
@balaram_irs
ఆ అర్ధనారీశ్వరుడు మీకు, మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్య, అష్టశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... శ్రీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.🙏🙏🙏
@balaram_irs
@balaram_irs congratulated the Indian Under-19 cricket team on their historic sixth U19 World Cup victory. He praised their exceptional talent, determination, and teamwork, stating that their achievement has brought great pride to the nation. @Teamindiacrick
The Hon'ble Governor of Telangana Shri Jishnu Dev Varma, hosted the "At Home" reception at Lok Bhavan, Hyderabad, as part of the 77th Republic Day celebrations.
The Hon'ble Deputy Chief Minister, Sri Bhatti Vikramarka Mallu; Hon’ble Chief Justice, Sri Justice Aparesh Kumar Singh; Hon’ble Union Minister of Coal and Mines, Sri G. Kishan Reddy; several cabinet ministers and distinguished guests, attended the event.
The Hon'ble Governor also presented the Governor’s Excellence Awards for the year 2025 to the distinguished perons and organization who have done excellent work in the fields of Women Empowerment , Tribal Development , Rural Health
& Medical Philanthropy and Corporate Volunteering.
సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ శుభ మకర సంక్రాంతి సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం, శాంతి, సంతోషం, మరిన్ని వృత్తిపరమైన విజయాలు కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను .
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సంస్థ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ IRS గారు. @revanth_anumula@Bhatti_Mallu
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2026 ఈ కొత్త ఏడాది మీ జీవితాల్లో
ఆశల వెలుగులు నింపాలి,
సరికొత్త విజయాలతో ముందుకు నడిపించాలి,
ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా అందించాలి.
మీ ప్రతి కల నిజమవాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
#NewYear2026 🎉✨
@balaram_irs
సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో సింగరేణికి సీఎండీ (ఎఫ్ఏసీ)గా శ్రీ దేవరకొండ కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుత ఛైర్మన్ శ్రీ ఎన్. బలరామ్ నుండి బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు.
శ్రీ డి.కృష్ణ భాస్కర్ 2012 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులస్పెషల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గతంలో ఆయన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించారు. తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖకు డైరెక్టర్ గానూ, రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీ గానూ వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047 కు అనుబంధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కూడా తన విజన్ 2030-2047 డాక్యుమెంట్ ను ప్రకటించింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ
శ్రీ ఎన్. బలరామ్ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసి దానిపై స్ఫూర్తిదాయకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, వివిధ విభాగాల ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా కంపెనీని బొగ్గు రంగం తో పాటు ఇతర రంగాల్లోకి పెద్ద ఎత్తున విస్తరింపజేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి భారీ ఎత్తున ప్రణాళికలు తయారు చేశామని, దేశవిదేశాల్లో కీలక ఖనిజరంగం లో ప్రవేశించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు, విజన్ డాక్యుమెంట్ లోని స్వల్ప, మధ్య కాలిక ప్రణాళికలో 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
సింగరేణి సంస్థ 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీని కోసం ప్రస్తుత లీజు ప్రాంతంలోనే కాక, లీజుకు వెలుపల ఉన్న ప్రాంతంలోని కొత్త బ్లాకులను, వివిధ రాష్ట్రాలలోని కొత్త బ్లాకులను కూడా చేపట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుత 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పాదనను 4,400 మెగావాట్లకు పెంచాలని అందుకు అనుగుణంగా కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది.
ప్రస్తుతం 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ 2030 నాటికి 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రాజస్థాన్ లో అతి త్వరలోనే 1,500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతుంది.
రాష్ట్రంలోని పలు భారీ నీటి జలాశయాల పైన 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది.
ఎత్తైన ఓపెన్ కాస్ట్ డంపుల పైన 100 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోంది.
500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ తొలి దశలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 250 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మణుగూరుకు సమీపంలోని పగిడేరు వద్ద ప్రయోగాత్మకంగా విజయవంతమైన జియో థర్మల్ ప్లాంటు వద్ద 200 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, ప్రణాళికలు రూపొందించారు. ఇది కాక ఎఫ్.డి.ఆర్.ఈ హైబ్రిడ్ ఆర్టీసి విభాగాలలో కలిపి మరో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని, 700 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం లను వివిధ సోలార్ ప్లాంట్ల వద్ద ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలు రూపొందించింది. దీనితో మొత్తం మీద 2029 - 30 నాటికి సింగరేణి 5.85 గిగా వాట్ల(5,850 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని విజన్ డాక్యుమెంట్ లో స్పష్టం చేసింది.
సింగరేణి సంస్థ కేవలం బొగ్గు, థర్మల్ విద్యుత్, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాలలోనే కాకుండా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించిందని, ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ రంగంలో గల అవకాశాలను పరిశీలించడం కోసం ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుందని, రాగి, బంగారం అన్వేషణకు లైసెన్స్ కూడా సాధించిందని ఇక ముందు కూడా ఈ రంగంలో దూకుడుగా ముందుకు పోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ (జి.ఎస్.ఎల్)అనే అనుబంధ సంస్థ ఏర్పాటు విజన్ డాక్యుమెంట్ లో సూచించారు.
దీర్ఘకాలిక ప్రణాళిక- విజన్ 2047 లో లక్ష్యాలు
కాగా సింగరేణి సంస్థ తన దీర్ఘకాలిక ప్రణాళిక 2047 లో అవసరమయ్యే థర్మల్ విద్యుత్తును, 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును, 2815 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ను, 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను, 500 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, మొత్తం మీద 25 గిగావాట్ల పరిమాణంలో వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని విజన్ డాక్యుమెంట్ లో పేర్కొంది.
విజన్ డాక్యుమెంట్ లో పేర్కొన్న పలు ఇతర ప్రాధాన్యత అంశాలు
సింగరేణి రక్షణతో కూడిన ఉత్పాదకత గల ఆధునిక టెక్నాలజీలతో బొగ్గు ఉత్పత్తులు సాధిస్తుంది.
పర్యావరణహిత, మైనింగ్ చేపడుతూ, జల సంరక్షణకు, జీవ వైవిధ్యానికి, వాతావరణ కాలుష్య నివారణకు పాటుపడుతుంది.
పూర్తి పారదర్శకంగా నీతి, నిజాయితీలతో ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని మైనింగ్ జరుగుతుంది.
వాతావరణ కాలుష్య నివారణ కోసం కోల్ వాషరీలను ఏర్పాటు చేస్తుంది.
కోల్ గ్యాసిఫికేషన్, లిక్విఫికేషన్ ప్రణాళికలు అమలు చేస్తుంది.
కర్బన ఉద్గారాలను అదుపు చేస్తూ వాటితో ఉపయోగకర పదార్థాలను తయారుచేస్తుంది.
వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, ఫ్లోటింగ్ సోలార్ వంటి ప్లాంట్లు ఏర్పాటుచేస్తుంది.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో ప్రవేశిస్తుంది.
బొగ్గు నుంచి రసాయనాలు, కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత ఉత్పత్తులు సాధిస్తుంది.
మూతపడిన గనుల్లో రిక్లేమేషన్ పనులతో పాటు, అక్కడ ఉన్న నీటి వసతులను పంప్డ్ హైడ్రో ప్రాజెక్టుల కోసం వినియోగిస్తుంది.
మెటల్ మైనింగ్ రంగంలో అన్వేషణ విభాగపు సేవలు అందిస్తుంది.
అనేక కార్మిక ప్రయోజన, ప్రజాహిత చర్యలు
నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమేషన్ పద్ధతులకు తగిన విధంగా ఉద్యోగులకు శిక్షణలు ఇవ్వడం.
ఉద్యోగులకు గట్టి ఆరోగ్య రక్షణ, భద్రత , సంక్షేమ కార్యక్రమాలు.
సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాల పెంపుదల.
మహిళా ఉద్యోగుల సేవలను ఓపెన్ కాస్ట్ మరియు భూగర్భగనుల్లోని కీలక విభాగాల్లో వినియోగించడం వంటి చర్యలను విజన్ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు
Rajasthan Cabinet clears major joint power projects with Singareni
Rajasthan Power Minister Shri Hiralal Nagar @hlnagar met Telangana Deputy CM & Energy Minister Shri Bhatti Vikramarka Mallu @Bhatti_Mallu in Hyderabad and handed over the official approval for 2,300 MW power projects — 1,500 MW Solar + 800 MW Thermal — to be jointly developed by Singareni (SCCL) and Rajasthan Rajya Vidyut Utpadan Nigam Limited (RRVUNL).
These projects will significantly strengthen the power supply needs of both states and mark Singareni’s first inter-state green energy collaboration. Senior officials from Rajasthan and SCCL were also present at the meeting.
#Telangana #Rajasthan #Singareni #GreenEnergy #SolarPower #ThermalPower #EnergySector #PowerProjects #iprtelangana #TelanganaRising2047 #TelanganaRising
Rajiv Gandhi Civils Abhay Hastham Scheme — Financial aid for every UPSC aspirant who qualifies
Hon’ble Deputy CM Shri Bhatti Vikramarka Mallu @Bhatti_Mallu distributed ₹1 lakh each to 50 candidates selected for the UPSC Civil Services Interview stage at Praja Bhavan.
He announced that every candidate who qualifies for Mains or Interviews will receive support — with no cap on numbers.
• ₹1 lakh for Mains qualifiers
• ₹1 lakh + accommodation in Delhi for Interview qualifiers
This year, 202 cleared Mains and 50 reached Interviews, showing the growing impact of the scheme under Singareni’s CSR.
The Deputy CM urged aspirants to serve society with integrity and announced the setting up of an Interview Board with senior officials for guidance.
Hon’ble Minister Shri Ponnam Prabhakar @Ponnam_INC, CMD N. Balaram, and senior Singareni officials joined the programme.
#Telangana #UPSC #CivilServices #AbhayHastham #iprtelangana #Singareni #YouthEmpowerment #TelanganaRising #UPSC2025