I don’t see any change in our boss @ncbn garu , I think sir stopped Ageing along ago . Age is just a number, I bet even we can’t match his energy and his hard work.
Just look at this
Then Now
శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ఈ అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించిన MLA శ్రీ బొజ్జా సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.
ఈ రోజు మాడుగుల గ్రామ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి పండుగ మహోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
అమ్మవారి కృపతో మాడుగుల నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
జై మోదకొండమ్మ తల్లి!
పరవాడ ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో దివ్య దర్శనం 🙏
ఈ రోజు పరవాడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మాడుగుల శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారుతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాను.
గంగపుత్రులపై ముత్యాలమ్మ తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, వారి కుటుంబాలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వ��్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థించాను.
జై ముత్యాలమ్మ తల్లి! 🙏
ఈ రోజు విజయవాడలోని Nara Lokesh గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం లభించింది. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం.
లోకేష్ గారి ఆలోచనలు, మార్గదర్శనం నాకు మరింత ఉత్సాహాన్ని, నూతన శక్తిని ఇచ్చాయి. ప్రజల కోసం మరింత అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో తిరిగి వచ్చాను.
ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో ఉన్న 9 క్లస్టర్లో నిర్వహించిన డిజిటల్ మహానాడు 2026 DAY -2 లో రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి శ్రీ బండారు అప్పలనాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తదితర క్లస్టర్ లో కేక్ కటింగ్ లు చేయడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు ���ండలాల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది
డిజిటల్ మహానాడు 2026లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం క్లస్టర్-11లో లంకెలపాలెం ��య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమ��నికి పార్టీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కావడం ఆనందంగా ఉంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ, నేటి సాంకేతిక యుగానికి అనుగుణంగా డిజిటల్ వేదికల ద్వారా కార్యకర్తలను మరింత దగ్గర చేసే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం.
ఈ అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ బలోపేతం కోసం, కార్యకర్తల సంక్షేమం కోస�� మరింత కృషి చేస్తాను.
జై తెలుగు దేశం!
#DigitalMahanadu2026
డిజిటల్ మహానాడు విజయవంతం – కార్యకర్తలే పార్టీకి బలం
ఈ రోజు మాడుగుల న���యోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో గల 9 క్లస్టర్లలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.
పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయడం అభినందనీయం.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దాసరి శ్రీనివాసరావు గారు, నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా, కార్యకర్తల ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుదాం.
#DigitalMahanadu
మహానాడు విజయవంతం కోసం మాడుగుల నియోజకవర్గంలోని 9 క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మహానాడు వేదికలను ఈ రోజు నేను పర్యవేక్షించడం జరిగింది. కార్యక్రమ ఏర్పాట్లు, కార్యకర్తల సమన్వయం మరియు నిర్వహణపై నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, ���ార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటా���్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని మనసారా ప్రార్థించాను.
గోవిందా... గోవిందా...! 🙏
శ్రీ Sri Varaha Lakshmi Narasimha Swamy దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, అనంతరం స్వామివారి దివ్య దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా మరియు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. 🙏
మా స్వగ్రామం వెన్నెలపాలెంకు చెందిన బండారు దేవాన్ష్ నాయుడు గారు ఈ నెల 16 నుండి 19వ తేదీ వరకు మలేషియా, లో జరిగిన 11వ ప్రపంచ యోగా పోటీల్లో ట్రెడిషనల్ యోగాలో ప్రథమ స్థానం, ఆటిస్టిక్ యోగాలో ప్రథమ స్థానం సాధించడమే కాకుండా “Champion of the Champions” అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణం.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి మన గ్రామం, మన ప్రాంతం మరియు దేశానికి మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయం.
దేవాన్ష్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్ష��ు. వారి ప్రోత్సాహం, కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి.
ఈ రోజు కే కోటపాడు మండలం దాలివలస, పిండ్రంగి మరియు లంకవానిపాలెం గ్రామాల్లో “కార్యకర్తే అధినేత” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చొని వారి క��టుంబ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Nara Lokesh గారి పాడేరు పర్యటనను ఘన విజయవంతం చేసిన మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపించిన అపారమైన ప్రేమ, అభిమానంతో ఈ పర్యటన విజయవంతమైంది. ప్రతి ఒక్కరి కృషి, అంకితభావం పార్టీ బలోపేతానికి మరింత బాటలు వేస్తుందని నమ్ముతున్నాను. మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
— బండారు అప్పలనాయుడు
యువగళం నాయకుడు @naralokesh గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న “కార్యకర్తే అధినేత” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేవరాపల్లి మండలం నాగయ్యపేట మరియు రైవాడ గ్రామాలను సందర్శించడం జరిగింది.
ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కూర్చొని మాట్లాడి, వారి సమస్యలు, సూచనలు నేరుగా తెలుసుకోవడం జరిగింది. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, వారు తె���ిపిన సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాను.
తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలే… కార్యకర్తల గౌరవమే మా లక్ష్యం.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
#కార్యకర్తేఅధినేత #Yuvagalam #TDP #NaraLokesh #Devarapalli
🏆 Heartiest congratulations to every student, teacher & parent of #Madugula Constituency for securing the #1 spot in AP SSC 2026 with a remarkable 97.30% pass rate! 🎓
Our daughters led the way with a stunning 97.78% — the future is yours! 💪
Special appreciation to Hon. Minister @NaraLokesh garu for his relentless focus on transforming education in Andhra Pradesh. This is the fruit of your vision! 🙏
మాదుగుల విద్యార్థులకు అభినందనలు! 🌺
#APResults2026 #Madugula #NaraLokesh #APSSCResults #EducationFirst #AndhraPradesh #TDP
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, భీమిలి మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహారాజు గారి మరణవార్త చాలా బాధాకరం.
తన స్వగ్రామం పాండ్రంగిలో శివైక్యం చెందిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
పరవాడ మండల స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారిగా సేవలందించిన ప్రసాద్ గారి మరణం ఎంతో బాధాకరం.
ఎప్పుడూ నవ్వుతూ అందరితో మెలిగిన మంచి మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఈ రోజు చీడికాడ మండలం పరిధిలోని మంచాల, కోణం, సిరిజం గ్రామాల్లో “కార్యకర్తే అధినేత” కార్యక్రమాన్ని నిర్వహించాను.
ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చొని, వారి కుటుంబ పరిస్థితులు, పార్టీ కోసం చేస్తున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నాను. కార్యకర్తల సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లి, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాను.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన బలం అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు.