#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.
https://t.co/L3TzrE9h5l
@ThisIsDSP, you nailed it throughout! You brought magic to every scene.
@nagashwin7, fulfilling a legend’s 40 year dream is nothing short of a god’s boon. The tribute you and @VyjayanthiFilms have given to Singeetham garu is remarkable. Kudos to the entire team!
Just like Singeetham Srinivasarao garu’s films always surprise us, releasing the trailer after the film is the biggest surprise… and I’m honoured to present it to you all. Go enjoy the film in theatres!
ప్రపంచ రక్తదాన దినోత్సవం
రక్తదానం చేయటం నిర్జీవమవుతున్న మనిషికి జీవాన్ని, జీవితాన్ని దానం చేసినట్లే.....
నేడే రక్తదానం చేద్దాం..🩸🩸🩸
#WorldBloodDonorDay2026#THR
Harish Rao Thanneeru
Live: హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు. https://t.co/U0lu14uTrr
"రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు… 3 గంటల కరెంట్ చాలు" అని ERC ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయి.
ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు… ఇది రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన.
అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయి.
పొలం అంటే ఏమిటో… బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో… రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది.
కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.
రుణమాఫీ అటకెక్కించారు.
రైతు బంధు బంద్ చేశారు.
పంట బోనస్ బోగస్ చేశారు.
ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు, పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు.
ఇవి చాలదన్నట్లు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్ ను ఖతం పట్టిస్తున్నారు.
రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా?
కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్‌గా తగ్గించిన @UttamINC గారూ.. మరికొన్ని రోజుల్లో ఏకంగా “కొనుగోళ్లు పూర్తయ్యాయి” అని ప్రకటిస్తారేమో!
ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూ…
మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం అంటారా?
“చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం” అంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్ ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా?
దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు..
2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తు పెట్టుకోండి.
ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమై…
రైతుల గోసను కప్పి పుచ్చేందుకు మీరు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గం.
ఒకవైపు రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే… మరోవైపు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు.
వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా?
కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా?
తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా?
నెలల తరబడి కొనుగోళ్లు ఆలస్యం చేసింది అబద్ధమా?
డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలుచేసింది అబద్ధమా?
హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదు..
కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడండి.. వాళ్ల కన్నీళ్లు తుడవండి.
మాటలు కట్టి పెట్టి, కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, టార్గెట్లు పక్కన పెట్టి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారి అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో హరీష్ రావు గారు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు చేశారు:
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కొంత సమయం కేటాయించి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
ఈసారి సాధారణ సభ్యత్వానికి రూ. 10, క్రియాశీలక సభ్యత్వానికి రూ. 50 రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతోంది. స్పాట్లో లైవ్ ఫోటో తీసుకోవడంతో పాటు ఓటరు వివరాలు కూడా అక్కడే నమోదవుతాయి. దీని ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు.
క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేస్తే.. అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం ఇప్పటికే 7 స్థానాలు గెలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు సాధించేలా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున.. రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిద్దామని చెప్పారు.
ఆన్లైన్ నమోదు విధానంపై నాయకులకు, కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈ మెంబర్షిప్ డ్రైవ్ నూరు శాతం విజయవంతం కావడానికి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మాణిక్ రావు గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి గారు, క్రాంతి కిరణ్ గారు, భూపాల్ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, సమన్వయకర్తలు, మెదక్ జిల్లా మెంబర్షిప్ ఇన్చార్జి బాలమల్లు గారు తదితరులు పాల్గొన్నారు.
عید الاضحیٰ کی دلی مبارکباد، اللہ آپ کی زندگی کو خوشیوں، صحت اور کامیابیوں سے بھر دے۔
ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
#EidUlAdha
నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను.
దాడిచేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, దుశ్చర్ల గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.