The Supreme Court’s decision upholding Danam Nagender’s disqualification is a slap in the face to the Congress’s duplicity on “saving the Constitution.”
@RahulGandhi j constantly speaks about “Samvidhan Bachao.” Now, the real test begins.
If Rahul Gandhi ji genuinely believes in the Constitution, he must personally demand that every other MLA who defected to the Congress resign immediately and seek a fresh mandate from the people.
He cannot preach constitutional morality in Delhi and remain silent when the conduct of his own party in Telangana raises serious questions about those very principles.
Rahul Gandhi ji must answer Is #SamvidhanBachao a constitutional commitment or merely a political slogan?
If he truly believes his own words, let him act. Ask the defected MLAs to resign. Let them face the people.
Anything less will expose the glaring gap between Rahul Gandhi’s constitutional rhetoric and Congress’s political practice in Telangana.
#CongressFailedTelangana
ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
రేవంత్ తెచ్చిన కరువు!
ఎక్కడో ఉన్న కుప్పంకు కృష్ణా నీళ్లు వెళ్తాయి,
కానీ పక్కనే ఉన్న పాలమూరుకు ఎందుకు కృష్ణా నీళ్లు రావు @revanth_anumula ?
జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను అక్రమంగా నిర్బందించడం దుర్మార్గం.
కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 738 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పెన్నా బేసిన్లో ఉన్న కుప్పం వరకు తరలిస్తుంటే.. పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు తరలించడం లేదు?
ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యం కాదా? పాలకుల చేతగానితనం కాదా?
కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లపూర్ (8.51 tmc), ఏదుల (6.55tmc), కరివెన(17.34tmc), వట్టెం (16.74) మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను నిర్మిస్తే.. వాటిని నీళ్లతో నింపే సోయి కూడా మీకు లేదా?
గడిచిన రెండున్నరేళ్ల పాటు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా ఎందుకు మోటర్లను నడపలేదు?
శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదు?
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు?
ముఖ్యమంత్రి గానీ, నీళ్ల మంత్రిగాని దీనికి సమాధానం చెబుతారా?
పాలమూరును ప్రాజెక్టును పడావు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారు.
పాలమూరు బిడ్డ అని చెప్పుకునే @revanth_anumula పాలమూరు రైతులకు చేస్తున్న నమ్మకద్రోహం ఇది.
రైతులంటే ఎందుకు అంత నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి?
వ్యవసాయం అంటే ఎందుకు ఇంత పట్టింపులేని తనం?
జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారు? ఎందుకింత దౌర్జన్యం రేవంత్ రెడ్డి?
రైతులు నీళ్లు అడుగుతుంటే, వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా?
కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు.
నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు
తప్పు మీరు చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా?
ఎల్ ని నో సాకు చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటారా?
సాకులు చెప్పి తప్పించుకుంటే.. సాగు ముందుకు పోతుందా రేవంత్ రెడ్డి?
పంట పొలాలకు సాగు నీళ్లు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు.
జూరాలలో 8.4 tmc ల నీరు ఉన్నా కూడా రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదు.
పంట పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతుంటే అది మీకు కనిపించడం లేదా?
జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులను రైతులను విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@UttamINC@TelanganaDGP
పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నాయకత్వమని తన ఆచరణతో చూపిన గొప్ప దార్శనికుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. స్వాతంత్ర్య సమరం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన జీవితమంతా ఒక నిరంతర పోరాటం.
నాడు 1969 ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఆయన నిస్వార్థ త్యాగం, బడుగు బలహీన వర్గాలు, చేనేత కార్మికుల పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. నేడు బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం!
ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు!
#CongressFailedTelangana#CongressBetrayedFarmers
Danam Nagender Episode Exposes Congress’s Double Standards on the Constitution
The Telangana High Court’s judgment in the Danam Nagender disqualification case has exposed the Congress Government’s double standards.
Danam Nagender won on a BRS ticket, defected to Congress, and continued as an MLA while contesting the Lok Sabha election as a Congress candidate. Yet, instead of protecting the sanctity of the people’s mandate, the Speaker’s decision gave him protection. The High Court’s intervention has now raised serious questions about the Speaker’s handling of the matter.
@RahulGandhi ji goes around the country claiming to be the champion of the Constitution, while Congress’s 2024 manifesto promised to amend the Tenth Schedule and make defection an automatic ground for disqualification. But when defections benefit Congress, where does that constitutional commitment disappear?
In the light of the High Court’s order, the Speaker should, at least now, act on the disqualification petitions against the other defected MLAs in accordance with the Constitution and the law.
If Rahul Gandhi is truly committed to protecting the Constitution, he should instruct CM Revanth Reddy to ask all the defected MLAs to resign and seek a fresh mandate from the people.
@INCIndia and Rahul Gandhi must answer the people. Is their commitment to the Constitution genuine, or does it change with political convenience?
Satyameva Jayate!
రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా..
బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలోగానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ భారతి విషయంలోగానీ జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపిద్దాం.
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణకు మేం సిద్ధం..
నువ్వు సిద్ధమా ? @revanth_anumula
#CongressFailedTelangana
#CongressLootingTelangana
రేవంత్ రెడ్డికి… మాజీ మంత్రి @BRSHarish ఓపెన్ ఛాలెంజ్
మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్ సాక్షిగా ముసుగులు ధరించిన పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
పండగ రోజున విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు రప్పించి, సాయంత్రం 6:30 గంటల సమయంలో సుమారు 15 మంది ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారు.
ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న @BRSparty లీగల్ టీం దాడిని గమనించి కేకలు వేస్తూ అడ్డుకోవడంతో, ముసుగులు ధరించిన పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.
ప్రభుత్వమే పోలీస్ స్టేషన్‌కు ముసుగులు ధరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించి దాడికి యత్నించడం అత్యంత దుర్మార్గం.
రాష్ట్రంలో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్లోనే దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది?
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే దాడులు చేస్తారా?
ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని సైతం లెక్కచేయకుండా ఈ దాడి యత్నం చేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.
హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై స్పందించాలి.
పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే బహిర్గతం చేయాలి.
ముసుగులు ధరించి దాడికి యత్నించిన పోలీసులను గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పోలీస్ స్టేషన్‌నే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా లేనట్లా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
@TelanganaDGP@CPHydCity@TelanganaCMO
మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా @revanth_anumula చెప్పే ప్రజా పాలన?
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గం.
మున్సిపల్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 12.07.2026నాటి https://t.co/sGFLL2VPKS.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.
ఇన్నేళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి.. కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయం.
ఈ నిర్ణయం 31 వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుంది.
BRS ప్రభుత్వ హయాంలో వేతనాల పెంపు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేతనాల్లో కోతలు.
ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి?
ఉద్యోగుల వేతనాలు తగ్గించడం ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన అవుతుంది.
ప్రభుత్వం వెంటనే https://t.co/sGFLL2VPKS.1181ను రద్దు చేయాలని, ఉద్యోగుల పూర్వపు హోదాను యథావిధిగా కొనసాగించాలని, వేతన రక్షణ కల్పించడంతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఆర్టీసీ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లు పెట్టడం సిగ్గుచేటు.
హైదరాబాద్–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీ ఆగస్టు 20న రూ.410 ఉంటే.. సెప్టెంబర్ 11న ఏకంగా రూ.570కు పెంచారు
అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం?
ఇది ప్రజా పాలన కాదు..
ప్రజలపై దోపిడీ పాలన!
మాటల్లో ఉచితాలు..
చేతల్లో ఛార్జీల మోత!
ప్రజలపై భారం మోపడం ఆపి, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే.. BRS చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. @TelanganaCMO
కాంగ్రెస్ పాలనలో అన్నదాత పరిస్థితి ఇది!
మీరు తెచ్చిన 22A నిషేధిత జాబితా అనేది ఒక విలయం.. విధ్వంసం.
రైతన్న అవేదన రాష్ట్రానికి మంచిది కాదు రేవంత్ రెడ్డి..ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో...
#CongressLootingTelangana#22AScam
రేవంత్ రెడ్డి మీ సొంత ఇలాకాలోనే రైతుల రాస్తారోకో.. ఇది మీ పాలనా వైఫల్యానికి నిలువుటద్దం.
@revanth_anumula మీ సొంత ఊరు నుండే కౌంట్ డౌన్ మొదలయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులకు 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి చేరింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు.. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు 6–8 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయకపోవడం శోచనీయం.
రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూడడం విడ్డూరం.
ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితి వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా?
సొంత ఇలాకాలోని రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?
ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన ‘మార్పు’ .
రైతుల ఆక్రందన రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా ??
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడి రైతుల పొలాలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
ఇది @BRSparty సస్పెన్షన్ కాదు..
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్..
ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం BRSని బయటకు పంపండి అంటున్నడు.
నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం గుర్తుంచుకో @revanth_anumula
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
“అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి..
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి..
అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు”
అని కాళోజీ గారు చెప్పిన మాటలు నేటికీ మార్గదర్శకం.
అన్యాయాన్ని ఎదిరించి నిలబడేవాళ్లు..
ప్రజల తరఫున గొంతెత్తి, వారి హక్కుల కోసం కొట్లాడేవాళ్లు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రశ్నించేవాళ్లు నాకు నిజమైన ఆరాధ్యులు.
కాంగ్రెస్ అరాచక పాలనపై పోరాడుతూ.. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ నా సెల్యూట్.
కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళి.