ONGC యాజమాన్యం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ ONGC ఆఫీసర్స్ అసోసియేషన్ చేస్తున్న ఆందోళనల గురించి పెట్రోలియం మరియు సహజవాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ తో మాట్లాడడం జరిగింది.
సోషల్ మీడియా వేదికగా వక్ఫ్ సవరణ బిల్లు 2025 పై మరియు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణంపై, చట్టాన్ని అతిక్రమించి కూటమి నాయకులను అసభ్య పదజాలంతో నిందిస్తున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు అందజేసిన బిజెపి రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు.