బిజెపి విధానం.. సరిహద్దుల్లో పటిష్ట భద్రత, చట్టాల్లో సమానత్వం
కాంగ్రెస్ విధానం.. వక్ఫ్ కు ఆస్తుల ధారాదత్తం, కుర్చీ కోసం కుమ్ములాటలు, అన్నదాతల ఆక్రందనలు
జాతీయవాదానికి, బుజ్జగింపు రాజకీయాలకు మధ్య ఉన్న అసలు వ్యత్యాసం ఇదే.
సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆటకట్టు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
జాతి వ్యతిరేక శక్తులపై మోడీ-షా ద్వయం కఠిన చర్యలు..
నవ భారత రక్షణకు 360 డిగ్రీల పటిష్ట భద్రతా కవచం
ఇది దేశ భద్రతను ఏమాత్రం ఉపేక్షించని శక్తివంతమైన మన మోదీ సర్కార్
Remembering Veer Savarkar on his Jayanti. His courage and patriotism will always inspire people. His intellect and emphasis on social reform are also noteworthy.
'రైతు గోస - బిజెపి భరోసా' యాత్రలో భాగంగా మేము ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయి. పండించిన పంటను అమ్ముకోలేక రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఈ ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అర్థమవుతోంది. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు.
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రెండు నెలలుగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగిపోయి రైతులను పట్టించుకోవడం లేదు.
-శ్రీ @Laxmin_Baswa గారు, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు
#RythuGosaBJPBharosa
మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో వడ్లు కొనాలని నిరసన తెలిపిన పాపానికి 30 మంది రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు తన చెప్పుతో తానే కొట్టుకున్న 70 ఏళ్ల వృద్ధుడిపై కాంగ్రెస్ గుండాలు దారుణంగా దాడి చేయడమే కాకుండా, అడ్డుకోబోయిన అతని తల్లి అయిన 105 ఏళ్ల వృద్ధురాలిని కూడా కొట్టారు.
-శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, బిజెపి శాసనసభాపక్ష నేత
#RythuGosaBJPBharosa
రక్తాన్ని చెమటగా మార్చి రైతన్న పండించిన వడ్లు, మొక్కజొన్నల కుప్పలు కళ్ల ముందే తడిసి మొలకెత్తుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. రైతుల గుండెలు పగిలి కన్నీరు పెడుతుంటే పాలకులకు ఎందుకింత నిర్లక్ష్యం. నాడు అహంకారంతో విర్రవీగిన కేసీఆర్ను గద్దె దించి బొందపెట్టినట్టే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రైతాంగం పాతాళంలో బొందపెట్టడం ఖాయం.
-శ్రీ ఈటల రాజేందర్ గారు, మల్కాజిగిరి లోక్సభ సభ్యులు
#RythuGosaBJPBharosa
కాంగ్రెస్ కు నమ్మి ఓటేసిన పాపానికి రైతన్నలకు కన్నీళ్లే మిగిలాయి. కాంగ్రెస్ గుండాలు ఇళ్ల మీద పడి దాడి చేస్తుంటే.. సచివాలయంలో కూర్చున్న ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం బిజెపి వాళ్లు డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేయడం వారి అహంకారానికి నిదర్శనం.
-శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్సభ సభ్యులు
#RythuGosaBJPBharosa
𝟗𝟎𝟎𝟎+ 𝐃𝐚𝐲𝐬 𝐨𝐟 𝐒𝐞𝐯𝐚, 𝐒𝐮𝐬𝐡𝐚𝐬𝐚𝐧, 𝐆𝐚𝐫𝐞𝐞𝐛 𝐊𝐚𝐥𝐲𝐚𝐧
PM Shri @narendramodi ji’s service to the people - from CM to PM have been phenomenal. From transformative reforms to bringing in positive societal changes, from rapid infrastructure development to giving impetus to Fintech, the journey towards Viksit Bharat continues..
ఏసీ రూముల్లో కూర్చుని 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని అబద్ధాలు చెప్పడం కాదు రేవంత్ రెడ్డి.. క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే రైతన్నల కన్నీటి గోస ఏంటో తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కిలోమీటర్ల మేర రోడ్ల మీదే ధాన్యం రాశులు పోసుకుని రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
-శ్రీ @maheshreddy_bjp గారు, బిజెపి శాసనసభాపక్ష నేత
#RythuGosaBJPBharosa
కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు స్థానం లేదు.
అధికార పీఠంపై ఆధిపత్య వర్గాలకే పెద్దపీట,
ఓట్ల కోసమే బడుగు, బలహీన వర్గాల జపం..
సమాజంలో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడమే కాంగ్రెస్ అసలు నైజం
ఒక కార్యకర్తగా మొదలై, శాసనసభ్యులుగా ప్రజలకు సేవలందించి, అతి పిన్న వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఈరోజు వందలాది మంది ఐటీ నిపుణులు, ఉద్యోగులు బిజెపి కుటుంబంలో చేరడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా వీస్తున్న బిజెపి గెలుపు పవనాలు ఇప్పుడు తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు కేవలం కుర్చీ కోసం పాకులాడితే.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాత్రం అధికారాన్ని ప్రజల సేవ కోసమే ఉపయోగిస్తున్నారు. మోదీ గారి నిబద్ధతను చూసిన యువత బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు.
-శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్రంలో గత పది రోజులుగా లక్షలాది పశువులు, గోవులను అక్రమంగా కబేళాలు, వధశాలలకు తరలిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పశువుల రవాణాకు సంబంధించిన ప్రతి చట్టాన్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంటే.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. బక్రీద్ పండుగను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులే దగ్గరుండి దీనికి సహకరిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
-డా. పాల్వాయి హరీష్ బాబు గారు, సిర్పూర్ శాసనసభ్యులు
హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లే భక్తుల కోసం MMTS విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తాం. అలాగే ఇక్కడి నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యం అందించేందుకు కొమురవెళ్లి మల్లన్న రైల్వే స్టేషన్ను కొత్తగా నిర్మించడం జరిగింది. ఈనెల చివరి వారంలో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తాం.
విపత్కర పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని మన ఆర్థిక కవచం..
భారత్లోనే అత్యల్పంగా పెట్రోల్, డీజిల్ ధరల మార్పు!
సంక్షోభ సమయంలోనూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వైనం..
బలమైన నాయకత్వంతోనే సామాన్యుడికి అసలైన భరోసా!
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకానికి ₹ 5 వేల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి 4 వేల నుంచి 5 వేల మంది యువతను దరఖాస్తు చేసుకోమన్నారు. స్వయం ఉపాధి కింద ఒక్కొక్కరికి ₹ 50 వేల నుంచి ₹ 4 లక్షల వరకు ఇస్తామన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిధులు మంజూరు చేయలేదు.
-శ్రీ @AnjiReddy_BJP గారు, బిజెపి ఎమ్మెల్సీ
ప్రస్తుతం మన తెలంగాణలో ఏకంగా ₹50,000 కోట్ల భారీ వ్యయంతో రైల్వే ప్రాజెక్టుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటికి తోడుగా, రాష్ట్రంలో 5 వందే భారత్, 6 అమృత్ భారత్ రైళ్లు మన ప్రజలకు అత్యాధునిక ప్రయాణ సదుపాయాలను అందిస్తున్నాయి.
- ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు.
#Modi4ViksitTelangana
తెలంగాణ సమగ్రాభివృద్ధే మా లక్ష్యం. సులభతర జీవనం, సులభతర ప్రయాణం, సులభతర వ్యాపారం అనే మంత్రంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. ఇందులో భాగంగానే సుమారు రూ. 9,400 కోట్ల విలువైన ఆరు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈరోజు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. అధునాతన రహదారుల అభివృద్ధి, రైల్వే నెట్వర్క్ విస్తరణ, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం మరియు పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. వికసిత్ భారత్ నిర్మాణంలో తెలంగాణ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించబోతోంది."
- ప్రధాని శ్రీ @narendramodi గారు
#Modi4ViksitTelangana
రాష్ట్ర అభివృద్ధితోనే దేశాభివృద్ధి అనేది బిజెపి మూలమంత్రం. 'వికసిత్ భారత్' ప్రయాణంలో తెలంగాణ, హైదరాబాద్ల పాత్ర అత్యంత కీలకం. అందుకే, తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ, వరంగల్లో నిర్మిస్తున్న 'పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్' ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా.. ఇక్కడి రైతులు, మధ్యతరగతి ప్రజలకు ఇవి ఒక వరంగా మారనున్నాయి. అలాగే, పత్తి రైతుల ఆదాయం పెంచేందుకు వేల కోట్ల రూపాయలతో కేంద్రం ప్రత్యేక మిషన్ను కూడా ప్రారంభించింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి, ఉపాధి కల్పనే మా ప్రాధాన్యత.
- భారత ప్రధాని శ్రీ @narendramodi గారు
#Modi4ViksitTelangana
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సభకు బ్రహ్మరథం పట్టిన తెలంగాణ ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉప్పెనలా కదిలివచ్చిన ఈ జనాదరణే తెలంగాణలో రాబోయే మార్పుకు స్పష్టమైన సంకేతం.
#Modi4ViksitTelangana