శాంతి భద్రతలు కాపాడే పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనంలో ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు పెట్టొద్దు అని అంటున్నాడు
గొడవలు అయితే ఆపాల్సిన పోలీసులు, కేసీఆర్ పాట పెడితే డీజేలు ఆపుతున్నారు
తెలంగాణ మట్టి స్వభావంలో సందర్భం వస్తే గడ్డి పోచ కూడా గడ్డపారై తిరగబడుతుంది
అందుకే యువత సజ్జనార్, కిషన్ రెడ్డిల ముందే దేక్ లేంగే అని పాటలు పెట్టి కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు
- కేటీఆర్
ప్యారడైజ్ సినిమా ఒకెత్తు.. ఆ సినిమాలో కేసీఆర్ వచ్చిన 4 నిమిషాలు ఒకెత్తు
తమకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని, గొంతును ఇచ్చిన నాయకున్ని, ఒక జాతిని మేలుకొలిపిన నాయకున్ని తెలంగాణ ఎలా యాది చేసుకుంటున్నదో సినిమాలో చక్కగా చూపించారు
పోయింది అధికారం మాత్రమే.. ప్రజల్లో కేసీఆర్ మీద మమకారం, అనురాగం అలానే ఉంది
- కేటీఆర్
బీజేపీ జేబు సంస్థ ఈడీనే సైలెంట్ చేసిన అసలైన 'కేడీ' బాంబులేటి!
ప్రతిపక్షాలపై ఎగిరెగిరిపడే బీజేపీ పెంపుడు సంస్థ ఈడీ.. కాంగ్రెస్ మంత్రి 'బాంబులేటి' ఇళ్లపై దాడులు చేసి నేటితో రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు.
బీజేపీ - కాంగ్రెస్ మధ్య నడుస్తున్న 'చీకటి బంధానికి' ఇదే నిదర్శనం!
Exactly two years since the Congress-BJP unholy nexus became official in Telangana
The Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024
Reports of several cash-counting machines being carried to his residence made headlines
Since then, neither the @dir_ed nor the BJP-led Union Govt has offered any official statement on the outcome of the raids or disclosed details of what was seized
The BJP hounds opposition leaders using various central agencies. Yet when the target is a Congress minister, there appears to be a deafening silence
Why is a minister belonging to Congress party enjoying immunity from the BJP?
Ajab Prem ki Ghajab Kahani @RahulGandhi 👏
ఒక సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఒక నాయకుడు వచ్చి పోరాటం చేసి గుర్తింపు తెచ్చిన కథకి చక్కటి దృశ్య రూపం ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు, సోదరుడు నానికి, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు
- కేటీఆర్
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
ఇప్పుడే ఊర్ల ఉండే నా చిన్నప్పటి ఫ్రెండ్‌తో మాట్లాడిన…
వాడు గత 3 ఏండ్ల నుంచి బీజేపీ బూత్ ఇంచార్జ్‌గా ఉన్నడు.
ఏమ్రా… మన గల్లీ నిమజ్జనం ఎట్లా జరిగింది, లడ్డు ఎంతకు పోయింది అంటూ అట్లా మాట్లాడుకుంటున్నం.
మధ్యలో “పారడైజ్ సినిమాకు పోయినవ్ గా… ఎట్లుంది?” అన్నడు.
“ఆ… పర్లేదు చూడొచ్చు. నాకు KCR కనపడగానే మస్త్ అనిపించింది” అన్న.
వెంటనే వాడు అంటడు…
“ఎట్లాగైనా మళ్లీ వచ్చేది KCR ఏ కదా!” అని.
“ఏందిరా… నువ్వు బీజేపీ అని ఇంత కోసుకుంటావ్, మళ్లీ KCR వస్తడు అంటున్నవ్ ఏంది?” అంటే…
“ఎవరు ఏం అన్నా… వచ్చేది KCR. రాసిపెట్టుకో!” అంటున్నడు 🔥🔥🔥
ఇదే గ్రౌండ్లో టాక్ అంటే! 😂
నెక్స్ట్ వచ్చేది KCR మాత్రమే అంటున్నడు…
సామాన్లు సర్దుకోండి రండి బ్యాచ్! 🔥
గణేష్ నిమజ్జనాల్లో ఎటు చూసినా దేక్ లెంగే పాటలు, కేసీఆర్ గారి పేరు తలుచుకోవడమే కనిపించింది
కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం
– కేటీఆర్
ఇది హైదరాబాద్ నగరం 1950లలో..
300 సంవత్సరాల క్రితమే విదేశీ యాత్రికులు హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన విషయం మీకు తెలుసా..
కొంత మందికి ఇప్పటికీ రాజధాని లేదు..
అన్నం పెట్టే ప్రాంతం మీదనే ఇంకా ఏడుస్తారు వెధవలు.
తెలుగుస్క్రైబ్ ఎక్స్‌క్లూజివ్:
1922 బ్రిటీష్ చట్టం వాడి క్రిశాంక్ మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం!
తెలంగాణలో భావప్రకటనా స్వేచ్చ మీద ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంది.
ఎప్పుడో 1922లో బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చిన కాలంచెల్లిన చట్టం వాడి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీద కేసు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.
వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తమ పోలీసులు కూడా ఎక్కడ స్వాతంత్ర సమరయోధుల ప్రసంగాలు విని ఉత్తేజితులై తిరుగుబాటు చేస్తారోననే భయంతో "పోలీస్ ఇన్సైట్మెంట్ టు డిసఫ్ఫెక్షన్ యాక్ట్ 1922" అనే చట్టాన్ని తెచ్చింది.
ఈ చట్టాన్ని తొలిసారిగా బాలగంగాధర్ తిలక్ మీద బ్రిటిష్ ప్రభుత్వం వాడటం గమనార్హం.
కాలంచెల్లిన బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దుచేసేందుకు 1998లో కేంద్ర ప్రభుత్వం వేసిన పీ.సీ జైన్ కమిటీ ఈ చట్టాన్ని రద్దుచేయాలని సిఫారసు చేసింది.
పీసీ జైన్ కమిటీ ఈ 1922 చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ "ఇది భావప్రకటనా స్వేచ్చను హరించేందుకు, స్వాతంత్రోద్యమాన్ని బలహీనపరచడానికి తీసుకొచ్చిన కాలంచెల్లిన చట్టం" అన్నది.
వివిధ కారణాల వల్ల ఈ చట్టం రద్దుచేసే ప్రక్రియ ఆలస్యం అయ్యి ఫైనల్‌గా కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసింది.
ఇప్పుడు ఆ 1922 బ్రిటీష్ చట్టం కిందనే గతవారం మన్నె క్రిశాంక్ మీద ఒక అక్రమ కేసు నమోదు చేసి, ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి , ఇల్లంతా చిందరవందర చేసి, కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసి పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ బీఆర్ఎస్ లీగల్ సెల్ చేసిన న్యాయపోరాటం వల్ల అదే రోజు సాయంత్రానికి హైకోర్టు క్రిశాంక్‌ను విడుదల చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి ప్రవచనాలు చెప్పే రాహుల్ గాంధీ పార్టీ తెలంగాణలో చేస్తున్న నిర్వాకం.