మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్
ఎంజీఎం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన దాస్యం వినయ్ భాస్కర్
ప్రస్తుతం వరంగల్ అజార ఆసుపత్రిలో వినయ్ భాస్కర్‌కు చికిత్స
పోలీసుల అత్యుత్సాహంతో వినయ్ భాస్కర్‌కు గాయాలు
బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్
కోతికి అధికారం ఇస్తే కొమ్మలన్నీ విరగదీసినట్టుగా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు.
ఎన్నికల ముందు 48 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి..
తీరా ఎన్నికలు అయ్యాక కనీసం 7 గంటల కరెంటు అయినా ఇవ్వమని అధికారులను అడుగుతున్న బేబీ కటింగ్!
జోరుగా అక్రమ ఇసుక దందా నడుపుతున్న కాంగ్రెస్ దొంగలు!
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ఊకచెట్టు వాగులో ఇసుకను అక్రమంగా ఊడ్చేస్తున్న దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అనుచరులు.
అర్ధరాత్రి వేళ భారత్ బెంజ్ లారీలతో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అనుచరులు జంగాల రవి, రవికాంత్ రెడ్డి.
పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన స్థానిక రైతులు.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలు, జేసీబీని అడ్డుకున్నారు.
ఇది కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ దొంగలు చేస్తున్న అక్రమ ఇసుక దోపిడీ!
325 సర్వే భూములకు కేసీఆర్ గారికి సంబంధం లేదు!
ఎవరి భూమి వారు దున్నుకుంటూ బ్రతుకుతున్నారు.
ఊర్లో కుంటలను తవ్వించారు, పొలాల్లో మట్టి పోయించి చదును చేయించారు.
బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని పలకరిస్తారు.
పేద కుటుంబాలను సైతం ఆదుకున్నారు.
— కాంగ్రెస్ పెయిడ్ మీడియాతో స్థానిక ప్రజలు
Kaleshwaram neellu ivvadam kante mineral water ivvadam better annaru ga @K_Nageshwar@JP_LOKSATTA ? Mari mee dosthu ganni adigi pampandi andariki biseleri water cans
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కారు కనికట్టు
ఎన్నికల సమయంలో ఆర్భాటంగా ఇచ్చిన హామీ ..
పేదవారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు
కానీ ఇప్పుడు ఇస్తున్నది కేవలం రూ. 2.9 లక్షలు..!!
ఇటీవల 5,280 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను రూ. 471 కోట్ల భారీ కాంట్రాక్టును పార్టీ మారిన ఎమ్మెల్యే గారి కంపెనీకి అప్పగించిన్రు
అయితే, ఒక్కో ఇంటికి లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం రూ. 6 లక్షలు వసూల్ చేస్తుండగా.. లబ్ధిదారుల మొత్తం వాటానే రూ. 316 కోట్లు.
అంటే రూ. 471 కోట్ల నుంచి రూ. 316 కోట్లు తీసేస్తే ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ. 154.8 కోట్లే
ఈ లెక్కన ఒక్కో ఇంటికి ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం రూ. 2.9 లక్షలు మాత్రమే..
ఈ మాత్రానికే ఏదో అద్భుతం చేసినట్లు ప్రచారం చేస్తున్నరు కాంగ్రెస్ మేధావులు
అదే KCR గారి హయాంలో లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన విషయమే మరిచినరు
పొంగులేటి గారూ.. ఈ లెక్కలు చూస్తుంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇచ్చే పైసల కంటే ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లుంది మీ ప్రభుత్వం
అందుకే మీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు బంద్ జేసి.. జర పేదోడికి మేలు చేకూర్చే పనులు చేయుర్రి!
@revanth_anumula@INC_Ponguleti
తనంతట తానే జారిపడి.. రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీస్ అధికారి
ఆ రైతు గల్లా పట్టుకొని.. గుంజుకుని వెళ్లి వాహనంలో ఎక్కించిన ఆఫీసర్
తానేమీ చేయలేదని, మీకు మీరే కింద పడ్డారని ఆ రైతు చెప్పినా.. కోపంతో రగిలిపోతూ ఆయనపై ప్రతాపం చూపించిన అధికారి
నీళ్ల కోసం జూరాల ప్రాజెక్ట్ వద్ద ధర్నాకు రైతులు వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న ఘటన ఇది!
వందల ఆరోపణలు వేల నిందలు వేస్తూ రాజకీయంగా సమాధి చేయాలి అని అటు మీడియాలో ఇటు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేల పేజీలు కొన్ని వేల idలతో నిత్యం కేసీఆర్ పై పూర్తి అసత్యాలతో దుష్ప్రచారం చేయిస్తారుకానీ ఆయన ఎక్కడఉన్నా రాజేరా అన్నట్టు మీకు అందనంత ఎత్తులో ప్రజల గుండెల్లో ఇలా వెలిగిపోతూ ఉంటాడు
ఎల్-కాంగో భీభత్సం 😭
అదిలాబాద్ రిమ్స్ లో నియో నేటాలజీ వార్డు లో ఏసీ సిలిండర్ పేలిన సంఘటన లో ముగ్గురు శిశువుల మృతి అత్యంత బాధాకరం. మిగతా బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.
ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే.
దీనిపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
ఇంత జరిగిన తరువాత హడావిడిగా సీయం రేవంత్ రెడ్డి గారు చిన్నారుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది! అసలు మీ ఆరోగ్య మంత్రి ఎవరు? ఎక్కడ సీయం గారు?
ప్రభుత్వ వ్యవస్థల ను నిరంతరం కంటికి రెప్పలా కాపాడాల్సిన సీయం, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కక్షపూరిత రాజకీయాలకు దిగజారడం, ప్రతిపక్షాల ఇండ్ల పై పొలాల పై అక్రమంగా దాడులు చేయడం సిగ్గుచేటు.
నిజానికి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రులు అదిలాబాద్ లో ఉండాలి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలి…
కానీ…
మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్య శాఖా మంత్రిగా అద్భుతంగా పని చేసిన, శాసన సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆస్తుల మీద దాడులను పర్యవేక్షిస్తున్నారు!!!
సీయం గారి కుటుంబ సభ్యులు కూడా ఒక కార్పోరేట్ హాస్పిటల్ MediXxxxR చైను లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి!
ఇది మన దురదృష్టం.
కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మరో సంస్థ ల్లో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? చాలా అరుదు. అక్కడ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
అసలు రిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుండి బాధితులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడం అంటేనే ప్రభుత్వం పాలనలో చేతులెత్తేసిందని అర్థం.
అసలు మీరు ఆసుపత్రులకు ఎలాంటి మెషీన్లను కొంటున్నారు? ఎక్కడ కొంటున్నారు? వాటిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు?? ఆ కాంట్రాక్టు ఎవరి చేతిలో ఉంది??? వాటికి సరిపోను డబ్బులు ఇస్తున్నారా???
సనత్ నగర్ టిమ్స్ లో దొంగలు పడడం, యంజీయం ఆసుపత్రుల్లో కప్పు కూలిపోవడం.. అసలు ఏం జరుగుతోంది తెలంగాణ ఆసుపత్రులల్ల???
మీ జేబులు, మూటలు నింపుకోవడం లోనే బిజీగా ఉన్నారు మీరందరు? అడుగుతే ప్రతిపక్ష @BRSparty మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
ఎప్పుడైనా ఆసుపత్రులను మీరు కానీ, మీ మంత్రి గారు కానీ పర్యవేక్షించారా? మీరేం ఆదేశాలు ఇచ్చారు? మీ ఆదేశాలు అమలు ఎలా అయ్యాయి??దయచేసి వాటి నోట్ ఫైల్స్ ను ప్రజల ముందు ఉంచండి.
తెలంగాణ కాంగ్రెస్-బీజేపీ ఎంపీలూ, మీరు ఏ ‘కారా కారా’ పబ్బుల్లో ఉన్నరు, భయ్యాలు?మీకు ధమ్ముంటే, మానవత్వం ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇళ్ల ముందు ధర్నాలు చేయండి. లేక పోతే రాజీనామా చేయండి.
#ElCongress
#TelanganaSinking
#SaveChildrenFromCongress
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@KTRBRS@dasyamofficial