గ్రాడ్యుయేట్ ఏమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో బోయినపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గ్రాడ్యుయేట్ MLC ఓటరుగా నమోదు కార్యక్రమంపై ముఖ్య సూచనలు చేయడం జరిగింది.
శాంతి, అహింసల మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి
అహింసా, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#ganghijayanthi
మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ అఫ్ allied అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అఫ్ కార్డివాస్కులర్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన 2వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ cardio wave 2026 కార్యక్రమంలో పాల్గోనడం జరిగింది.
మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ అఫ్ అగ్రికల్చర్ సైన్స్ లో జరిగిన ఒరియన్టేషన్ డే 2026 కార్యక్రమంలో పాల్గోని విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
తీరికలేని పనుల నుండి కొద్దిసేపు విరామం తీసుకుని Ch మల్లారెడ్డి గారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ యర్రా నదిలో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించారు. చుట్టూ మెల్బోర్న్ CBD స్కైలైన్ కనిపిస్తుండగా, ఆయన కాసేపు పడవను స్వయంగా నడిపారు.
#adminpost#chmallareddybrs#yarrariver#melbourneaustralia
భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై ప్రాణాలర్పించిన వీరుడు, దేశభక్తికి నిలువెత్తు రూపం, పోరాట స్పూర్తికి ప్రతిరూపం..
షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా
ఆ మహనీయుని దివ్య స్మృతికి ఘన నివాళులు
నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి తెలంగాణ సాధన కోసం పదవులను సైతం వదులుకుని మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన రాజకీయ వేత్త... ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రధాతకు ఘన నివాళులు...
న్యూజీలాండ్ విదేశీ పర్యటన లో ఉన్న మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు న్యూజీలాండ్ లోని గ్లాసిర్స్ క్వీన్స్ టౌన్ ను సందర్శించి మెడిటేషన్ చేయడం జరిగింది.
తాగు, సాగునీటి ప్రాజెక్టులతో
నవ భారత నిర్మాణానికి సేవలు అందించిన గొప్ప ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు.
ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నివాసంలో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం.
నిన్న శాసనసభలో జరిగిన సస్పెన్షన్ అనంతరం తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తున్న కేటీఆర్.