ఆరోగ్య పరిరక్షణలో తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.
ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన క్రీడాకారులు మొత్తం 61 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణిస్తూ, నిత్యం సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వారిని ఆదర్శంగా తీసుకుని తోటి పోలీస్ సిబ్బంది వారానికి మూడు నుంచి నాలుగు రోజులు కొంత సమయం కేటాయించి, క్రమశిక్షణతో తమ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేలా ప్రేరణ కలిగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్ రాజ్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
భరోసా కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సోమవారం రంగంపేటలోని వరంగల్ భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, కేంద్రంలో అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడిని సానుభూతితో, గౌరవప్రదంగా స్వాగతించి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మహిళలు, చిన్నారులు, ఇతర బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందించే భరోసా కేంద్రం సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి కేసును నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్ స్టేషన్-1 ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్ఐ కిరణ్మయి, కౌన్సెలర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
Today, Hon'ble CP Warangal, Sri.Sunpreeth Singh,IPS sir participated in Bike rally for awareness in Helmet usage part of Arrive Alive program at Chintalapalli (v), Elkaturthy (m).
దామెర గ్రామంలోని A. సంపత్ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి నగదు ఎత్తుకపోయిన దొంగని ఎల్కతుర్తి PHC వద్ద 24.02.26 రోజు వాహన తనికి లో పట్టుకొని విచారించగాపేరు బెల్లి సందీప్, దామెరలో చేసిన దొంగతనము నేరం ఒప్పుకోగా తన వద్ద ఉన్న47,000/- స్వాదినం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది.
Today, arrested the accused who involved in House Breaking offense at Damera (v) and recovered Rs.47,000/- and FZ bike from him.He will produce in Hon'ble court.
ELKATURTHY మరియు పరిసర ప్రాంతాలలో బైక్ దొంగతనాలు చేస్తున్న (5) గురు ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇందులో ముగ్గురు మైనర్ లు ఉన్నారు.
(14) బైక్ లు రికవరీ అయ్యాయి.
Today, along with Nitional Highway officials visited the blockspots on the NH towards Husnabad at Mulkanoor PS limits and erected Hazard boards and median lines to avoid the road traffic accidents.
In view of *International Day Against Drug Abuse* Today, my self along with SI Elkaturthy Conducted Rally with St.Thomas High school, Elkaturthy Sir.
Regards
CI Elkaturthy @warangalpolice@cpwarangal
రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డు వరంగల్ అందుకున్న పోలీస్ కమిషనర్.
అత్యధిక సంఖ్యలో రక్తదానాన్ని చేసేందుకు ప్రోత్సాహించినందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డు అందుకున్నారు.
ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్ గారు హై బ్లడ్ డోనార్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
@cpwarangal@TelanganaCOPs@TelanganaDGP
పోలీస్ సమావేశ ప్రాంగణంను ప్రారంభించిన సీపీ.
జనగామ ఏసీపీ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వెస్ట్ జోన్ పోలీస్ అధికారుల సమావేశ ప్రాంగణంను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ప్రాంగణం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏ.ఎస్పీ చైతన్య నితిన్ తో ఏసీపీ భీం శర్మ, నర్సయ్య తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఎస్. ఐ లు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.