శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగానే కాకుండా అరుదైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయారు డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం గారు. పరిణతి, మానవతా విలువలను సమన్వయం చేసిన అసాధారణ వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు మరియు శాస్త్ర సాంకేతిక రంగాలకు సరికొత్త దిశను చూపిన ఆ దార్శనికుడి జయంతి సందర్భంగా ఆయన దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం.
#TGSRTC వైస్ చైర్మన్, ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా @SajjanarVC కు సంస్థ ఉన్నతాధికారులు, అధికారులు అభినందనలు తెలియజేశారు
#Hyderabad బస్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
వైస్ చైర్మన్, ఎండీగా సంస్థలో సజ్జనర్ ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలను ఈ సందర్బంగా ఉన్నతాధికారులు, అధికారులు గుర్తుచేసుకున్నారు.
ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు #TGSRTC యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తోంది.
తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది.
ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @SajjanarOffice @CTM_MKTG_TGSRTC @PROTGSRTC
#TGSRTC #Telangana #Hyderabad #Sankranthi #TakingTelanganaForward