If a #KCR inspired character can create this much excitement, imagine the anticipation for a full length movie on KCR garu.
When will we see it? A story waiting to be told.
Perhaps someday, we’ll witness it! 🎬❤️🔥
#TheParadise
మర్లవడ్డ తెలంగాణ జాతిని
ఒక్కటి చేసి రాజ్యం తెచ్చిండు
‘ధగడ్’ పాలనతో ఈ గడ్డపై
కొత్త వెలుగులు నింపిండు..
ఝూటా మాటలతో గద్దెనెక్కిన
రాబందుల రెక్కలు విరిచేందుకు
తెలంగాణ ‘షేర్’ వస్తున్నాడంటూ
సోషల్ మీడియాల వైరల్ అవుతున్న వీడియో!!
సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..
లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??
కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??
నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.
420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.
నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??
గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.
ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.
ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??
నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.
పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.
22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.
అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..
జై తెలంగాణ
కేసీఆర్ గారి వద్ద దళితుల భూములు లేవని తేలితే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తారా? ?
ఒకవేళ ఉంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధం..🔥
సవాల్ స్వీకరించే దమ్ముందా ఎవడికైనా??