#PsychoFekuJagan
వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఒక బూటకం.
ఆ పరీక్ష నేను కూడా రాశాను. ఇప్పటికీ నాకు వచ్చిన ర్యాంక్ ఏంటో తెలియదు. నాకే కాదు, ఆ పరీక్ష రాసిన చాలా మందికి తమ ర్యాంకులు ఏమిటో తెలియదు. ర్యాంక్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు... ఏదీ అధికారికంగా విడుదల చేయలేదు. కావాల్సిన వారికి మాత్రం నేరుగా మెసేజ్‌లు పంపించి ఉద్యోగాలు ఇచ్చారు.
జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా... ఇది మీరు నిర్వహించిన నియామక విధానం.
ఈ రోజు కూటమి ప్రభుత్వం డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే, అదే యువతపై విషం చిమ్ముతారా? పారదర్శకంగా జరిగిన నియామకాలపై కూడా దుష్ప్రచారం చేయడం సరికాదని గుర్తించాలి.
#YCPFakeBrathuku
#AndhraPradesh
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
#QuantumRevolutionInAP
At Amaravati, we are building the foundations of a future-ready innovation ecosystem. By bringing together academia, industry, startups and government, Andhra Pradesh aims to position India at the forefront of the quantum revolution. Grateful to @livemint for this deep dive into Andhra Pradesh’s Quantum Valley initiative.
https://t.co/Oklu2eFKoO
డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.
నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.
మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.
కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.
#NaraLokesh
#AndhraPradesh
"ప్రజలలో అభద్రతా భావాన్ని కలిగించడానికి, శాంతి భద్రతలను భగ్నం చేయడానికి జగన్ రకరకాల కుట్రలు చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాది గొడ్డలి పార్టీయే అని చెప్పుకుంటున్నారు. కత్తులు, కటార్లతో వస్తారంట. ఇక్కడున్నది సీబీఎన్. గుర్తుపెట్టుకోండి."
- గొడ్డలి పార్టీ రౌడీగాళ్లకు చంద్రబాబు గారి స్ట్రాంగ్ వార్నింగ్.
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించాను. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నాను. సింహాచలం కోరినట్లుగా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి... వారు తీసిన తాజా కల్లును రుచిచూశాను.
#PensionsPandugalnAP
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
#Mahanadu2026#SthreeShakti
స్త్రీశక్తి థీమ్‌తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్‌లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP#RayalaseemaTakesOff#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
It is a matter of pride for Andhra Pradesh that the first project under our forward-looking Integrated Clean Energy Policy 2024 is now being commissioned.
SAEL’s 600 MW solar project in Rayalaseema, built with an investment of ₹3,000 crore in a record 11 months, reflects the speed, confidence, and execution capability of our state.
Our government is committed to positioning Andhra Pradesh as India’s clean energy capital, with a target of attracting ₹10 lakh crore in green energy investments over the coming years.
#ChooseSpeedChooseAP
@SAEL_India
ఈరోజు దళిత డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి... చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయిన డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో...
#DoctorSudhakarStory#DalitDrohiJagan
#AntiDalitYSRCP
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసిన అధినేతను మించిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. తమ రాక్షస రాజకీయాలకు మూగజీవాలను బలి చేస్తున్నారు. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగితే గాడిద ఏం పాపం చేసిందని.. దాని రక్తం కళ్ళజూశారు.
#PsychoFekuJagan
During my visit to Kavali in Nellore today, Thanamgari Babu garu invited me to his home for lunch. I bought some freshly caught fish from the market, and T Venkamma garu graciously cooked a delicious meal for us. We shared lunch with the family while discussing the aspirations of fishermen and the coastal community. Grateful for their warm hospitality.
#MatsyakarulaSevalo