तत्कालीन अमेरिका के राष्ट्रपति बराक ओबामा के बाबासाहेब अंबेडकर के प्रति विचार, "Ambedkar Protect the Rights of each and every Indian" #AmbedkarJayanti 🔥🔥
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.