I wish for a Kingdom which was established by Samrat Ashoka where there was a casteless,classless,religionless, genderless, Humanistic Jambudweepa Kingdom.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంకన్న మృతదేహానికి అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలి.
నిన్న విధినిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ముద్దోజు వెంకన్న పైకి బొగ్గు లారీ దూసుకొచ్చి మృతి చెందడం తీవ్ర బాధాకరం.ఈ వెంకన్న అట్టడుగు సామాజిక వర్గం నుండి ఎన్నో అణిచివేతల్ని ఎదుర్కొని వచ్చి ఒక అధికారి అయ్యాడు.ప్రభుత్వానికి ఒక సైనికుడిగా పనిచేస్తూ డ్యూటీ లో చనిపోయాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికార లాంఛనాలతో దహన క్రియలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ముఖ్యమంత్రి వెంటనే ఆ దిశగా.. చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు ఇవ్వాలి. ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.హైదరాబాదులో ఒక ఇల్లు కోసం 500 గజాల స్థలం ఇవ్వాలి. మృతుడు వెంకన్న భార్యకు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం వెంటనే ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరణం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మెజిస్ట్రేట్ తో ఎంక్వైరీ వేసి విచారించాలి అని పైన పేర్కొన్న అన్ని డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని BC SC ST JAC & DSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO@revanth_anumula@Ponnam_INC
#DTOVenkanna
#Telangana
#BCSCST
అఖిల భారతీయ సంత్ రవిదాస్ ధార్మిక అధ్యక్షులు సుఖదేవ్ మహారాజ్ మరణం నాకు, DSP ఉద్యమానికి తీరని లోటు. గురువు గారు దశాబ్దానికి పైగా ఉద్యమానికి దారిదీపం గా ఉన్నారు..గురూజీ మీరు చూపిన రవిదాస్ ఆశయాలను మేము కొనసాగిస్తాం.
#Sukhdevmaharaj#Santravidas#Ravidasia
డాక్టర్లు, ఇంజనీర్లు,IAS లు, ముఖ్యమంత్రు లు, ప్రధానమంత్రులు గా తీర్చిదిద్దే "ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్" లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుమడి ని చేర్పించి,చదివించి గొప్పవాడిని చేయాలని ముఖ్యమంత్రి గారిని ప్రేమ తో డిమాండ్ చేస్తున్నాం.
#Revanthreddy#TelanganaPublicSchool
తెలంగాణ 100% మా BC/SC/ST ల జాగిరే..!
KTR, పవన్ కళ్యాణ్ ల జాగీర్ కాదు
🔷🔶🔷🔶🔷🔶🔷
తెలంగాణ అగ్రకుల దొరల జాగీరు కాదు . ఆంధ్ర అగ్రకులపోల్ల జాగీరు అంత కన్నా కాదు.ఎందుకంటే 90% BC , SC, ST ప్రజలు తమ రక్త,మాంసాలని, స్వేదాన్నీ చిందించి తెలంగాణ సంపదని సృష్టించిన బానిసలు. ఈ 90% బానిసలే తెలంగాణ భూమి పుత్రులు తప్ప తెలంగాణ దొరలు, పటేళ్లు, రెడ్లు భూమి పుత్రులు కారు.
అసలీ తెలంగాణ ఉద్యమం బయలుదేరింది . మూడున్నర కోట్ల మందివున్న.. 90% BC SC ST తెలంగాణా శ్రామిక వాదం, 10% వున్న అగ్రకుల దోపిడీ తెలంగాణ వాదం. ఈ రెండింటి లో..పవన్ కళ్యాణ్,KTR, రేవంత్ రెడ్డి లు ఎటు వైపో ప్రకటించాలి.
ఈ ఉద్యమం ఏకకాలంలో ఇద్దరు శత్రువుల్ని ప్రకటిస్తుంది .
1) తెలంగాణలో 10 శాతం లేని "రెడ్డి, వెలమ, కమ్మ ,కరణం,కాపు" భూస్వామ్య పెట్టుబడిదారులు.
2) ఆంధ్ర "రెడ్డి, కమ్మ,కాపు దొరలైన పెట్టుబడి దారులు.
వీళ్ళని ఓడించడమే తెలంగాణ BC,SC,ST ల అస్తిత్వం.
తెలంగాణ అస్తిత్వం అంటూ...దానికిందకి మళ్ళీ తెలంగాణ దొరలంతా పోగు ఐతారూ..జాగ్రత్త. ఒక ప్రాంత అస్తిత్వం విలువని సృష్టించి దాన్ని గొప్పది అని అగ్రకుల దొరలు అన్నారు అంటే అది అత్యంత ప్రమాదకరమైనది అని అర్థం.
@KTRBRS@PawanKalyan
#Telanagana
#BCSCST
అమాయకులైన అణగారిన కులాల రక్తం చిందిస్తే..ప్రాణాలు..అర్పిస్తే ప్రజాశక్తి ని విడుదల చేస్తే.. "రెడ్డి-వెలమ- కమ్మ భూస్వామ్య,పెట్టుబడి దారుల" నాయకత్వం లోకి తెలంగాణ రాష్ట్రం పోయింది.
ఇంతకన్నా బహుజనులు బలై పోయిన చరిత్ర దేశంలో వుందా..? అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ రోజు నేను బాధ పడుతున్న , దుఃఖ పడుతున్న,నిరసిస్తున్న. దీనికి పరిష్కారం మన బహుజనులంతా ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలి...అందుకోసం జరుగుతున్న యుద్ధం లో అందరం పాల్గొనాలి.
#TelanaganaFormationDay
#BCSCST
2034 దాకా నేనే ముఖ్యమంత్రి
అంటే "కులగణన " సంగతేంటి ..?
🔷🔶🔷🔶🔷🔶🔷🔷🔶🔷.
రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే అహంభావం.. రెడ్డి భూస్వామ్య మనస్తత్వానికి నిదర్శనం.
కులగణన యొక్క లక్ష్యం ప్రజాస్వామ్య ఫలాలను అందరికీ పంచడం,అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. కులగణన ద్వారా
90% బీసీ ఎస్సీ ఎస్టీ & ముస్లిం లు ఉన్నారని & 10% అగ్రకులాలు ఉన్నారని లెక్క తేలిపోయింది. రెడ్లు 4% అని లెక్క తేలిపోయింది. మరి అలాంటప్పుడు. 90% అణగారిన వర్గాలను అణచివేసి 2034 దాకా తానే ముఖ్యమంత్రిని అనడం రెడ్డి భూస్వామ్య ఆ ధిపత్యానికి సంకేతం.కులగణన స్పూర్తినీ.. కాష్టం లో ఏసి..కాలబెట్టినట్టే. ప్రజాస్వామ్యవాదులారా ఆలోచించండి.
#CasteCensus
#Telangana
#Revanthreddy
బండి సంజయ్ కొడుకు భగీరథ్ ని..బజార్ల పడేసి కొట్టుకుంటూ.. పోక్సో కేసు..పెట్టాలి..! అరెస్ట్ చేయాలి.
🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డి సార్.... అమాయుకురాలైన..ఒక బాలిక పై అత్యాచారానికి ఒడికట్టిన బండి సంజయ్ కొడుకు పై పోలీసులు పోక్సో కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి..ఇప్పటివరకు కేసు పెట్టలేదంటే..రేవంత్ రెడ్డి మోడీ బంధం..బలం గా ఉందని నిరూపణ ఐపోతుంది..! అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..బీజేపీ బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..వదిలేయడమా..ఇదేమీ న్యాయం..?
ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..వారు.. ఏ పార్టీ లో ఉన్నా..అగ్రవర్ణాలంతా..ఒక్కటే అని..అర్ధం అవుతుంది. పోలీసులు చర్య తీసుకోకపోతే మా పోరాటం కొనసాగుతుంది..ఆ బాలికకు రక్షణగా వుంటాం..ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP
#ResignBandiSanjay
#SaveGirlchild
DGP గారు నన్ను వెంటనే విడుదల చేసి నర్సంపేట పంపించండి. నేను... శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడి అంతిమయాత్రలో పాల్గొనాలి.
-----------------------
తెలంగాణ రాష్ట్ర DGP గారికి నమస్కారం...!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం జరిగే పోరులో నిన్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నడు. ఈరోజు నర్సంపేటలో మృతుడు శంకర్ గౌడ్ అంతిమ దహన సంస్కారాలను దర్శించుకోవడానికి పొద్దున్నే నర్సంపేట పయనం ఐతుంటే పోలీసులు వచ్చి బలవంతంగా ముందు హౌస్ అరెస్ట్ చేశారు, ఒక గంట తర్వాత జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ కు అని చెప్పి పోలీసులు ఇంటి నుండి అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది పూర్తి గా ప్రజాస్వామ్యానికి ,వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకం.
RTC కార్మికుడి అంతిమ సంస్కారాలకు వెళ్ళవద్దా..? ఆయనకు ఉద్యమ వీడ్కోలు పలకొద్దా..? నా ప్రయాణం శాంతియుతంగా సాగుతుంది అలాంటప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించారు..? వెంటనే నన్ను విడుదల చేసి నర్సంపేటకు పంపించండి.
తెలంగాణ రాష్ట్ర DGP గారికి మరొక్క మారు విజ్ఞప్తి చేస్తున్నాను.
@TelanganaDGP@TelanganaCMO
#Rtcworkers
#Telangana
#BCSCST
క్రైస్తవ మతం స్వీకరించి, సెల్ఫ్ డిక్లేర్ చేసుకునే ఎస్సీ దళితు లకు..రిజర్వేషన్ల రద్దు తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
హిందూ మత,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక,సాంఘిక వ్యవస్థ లో మానవ గౌరవం, హక్కులు దక్కని అంటరాని ఎస్సీ దళితుల కు ఎటు వెళ్ళా లో మార్గం లేక దిక్కు లేక, సంఘంలో బతికే చోటు లేక క్రైస్తవం లోకి వెళ్లారు.. వారి తో పాటు అదే క్రైస్తవం లోకి అధికారం కోసం, నవ నాగరికత కోసం, ఇంగ్లీషు చదువు కోసం, విదేశీ సంబంధాల కోసం,డబ్బు కోసం హిందూ అగ్రవర్ణాలు కూడా చేరారు. చివరికి క్రైస్తవ మతం హిందూ క్రైస్తవంగా మారిపోయింది.
కుల ఆధిపత్యం ఆ క్రైస్తవంలోకి కూడా చొరబడింది
అంటే హిందూ మతంలో నరకం అనుభవించిన దళితులు క్రైస్తవంలో చేరితే అక్కడికీ చేరిన అగ్రవర్ణాలు మళ్ళీ అదే హింసను, వివక్షతను దళితుల పై చెలాయించారు.
మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అందుకని రిజర్వేషన్లను యధా స్థితి గా కొనసాగించాలని ధర్మ సమాజ్ పార్టీ & BC SC ST JAC ఎంతో కాలం గా డిమాండ్ చేస్తుంది. లేదంటే భారీ పోరాటానికి సిద్ధపడతాం. ఈ విషయం పై..దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని భారీ గా మాట్లాడే.. "మోడీ -చంద్రబాబు" కిరాయి మనుషులు..వారినే ఒప్పించి..వెంటనే పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల రక్షణ చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.
#DalitChristians
#SCReservations
#Constitution
నేను ఏం నేరం చేసాను..?
నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
🔷🔶🔷🔶🔷🔶🔷
నేను ఏం నేరం చేసాను..? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
వెలుగు మట్ల ఖమ్మం భూ బాధితులకు న్యాయం చేయాలని గత పదిరోజుల నుండి రాజ్యాన్ని ప్రశ్నించి,పోరాడటమే తప్పా..? చివరకు ప్రభుత్వం దిగివచ్చి కొంతవరకు,కొద్దిమంది బాధితుల కి పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.. అదేదో బాధితులందరకు పట్టాలిచ్చి సంపూర్ణ న్యాయం చేయమని ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కి భూ బాధితుల తో కలసి విజ్ఞాపన పత్రం ఇద్దామని..కార్ లో షర్ట్ మార్చుకుంటూ కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుంటువుండగానే కారు ఆపి అమాంతం తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలించడం..ఏం న్యాయం..? ఏం ధర్మం..,! మమ్మల్ని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, కొట్టండి,చివరకి చంపినా పర్వాలేదు..కానీ ఖమ్మం భూ బాధితులందరికీ పట్టాలిచ్చి,ఇండ్లు నిర్మించి సంపూర్ణ న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి ,ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి.
@TelanganaCMO@TelanganaDGP
#VelugumatlaBhudanLands
#Telangana
#BCSCSTJAC
తెలంగాణలో..సామాజిక,రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తున్న "ధర్మ సమాజ్ పార్టీ.".3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. పీడిత ప్రజల విముక్తి కోసం
రాజకీయ సమీకరణల తో.. రణ రంగం జరగబోతోంది..ఒక భూకంపం సృష్టికి సిద్ధం కాబోతున్నాం..అందరూ..సిద్ధపడండి.
#DharmaSamajParty#BCSCST#Telangana
మా సంయుక్త యుద్ధం ఫలించిందా...?
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు అదే భూదాన స్థలంలో పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. కొందరు బాధితులకు ఆ దిశగా టోకెన్లు కూడా ఇస్తున్న శుభవార్త తెలిసింది ఇది గొప్ప పరిణామం. దీనికి కారణం నిన్న ఖమ్మం లో జాగృతి అధ్యక్షురాలు కవిత గారితో కలిసి BC,SC,ST JAC&DSP గా మేము సంయుక్తంగా నడిపిన భారీ యుద్ధం కారణంగానే ఈ పట్టా పంపిణీ జరుగుతుందని బలంగా భావిస్తున్నాం. మొత్తం బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం సాగుతుంది.
కూలిపోయిన ఇండ్లకు పునర్ నిర్మాణాలు, అందరికీ పట్టాలు,ఇండ్లు ఇవన్నీ ఇంకా తేలాల్సిన అంశాలు.
వీటన్నింటిపై రేపు సంయుక్త ...ప్రెస్ మీట్ ఉంటుంది.
@RaoKavitha
#SaveLands
#SaveTelangana
#Velugumatla
#BCSCST
నాగర్ కర్నూల్ బాధితులని మేమే హైదరాబాద్ కు తీసుకువచ్చాము
🔶🔷🔶🔷🔶🔷🔷
గత ఐదు రోజుల నుండి నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర బాధితులకు న్యాయం జరగాలని భారీ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా లో... పోలీసు అధికారులు అన్ని సెక్షన్స్ పెట్టి, నిందితులందర్నీ అరెస్టు చేసి రిమాండ్ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. కానీ వారిచ్చిన మాటపై నిలబడలేదు. తర్వాత బాధితులకు న్యాయం జరగాలని 3 రోజులు ధర్నా శిబిరం నడిపించాము. అయినా పోలీసులు దిగి రాలేదు, పైగా ధర్నా శిబిరం మొత్తాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. కుమ్మెర గ్రామ నిందితులైన రెడ్లు వచ్చి నాగర్ కర్నూల్ లో ధర్నా ఏర్పాట్లు చేసుకోబోతున్నారు, వీటన్నింటి మధ్యలో 144 సెక్షన్ పెట్టి భారీ గందరగోళం సృష్టించి బాధితులకు భద్రత లేకుండా, ప్రమాదంలో పడే పరిస్థితి సృష్టిస్తున్నట్టు అర్థమై... ధర్నా శిబిరం లేకుండా చేస్తూ, నిందితులైన రెడ్ల పై కేసులు లేకుండా, పైగా బెదిరింపులతో బాధితులకు తీవ్ర నష్టం జరుగుతుందని గ్రహించి మరియు ఎటువంటి పరిస్థితుల్లో శుక్రవారం ధర్నా శిబిరం నడవకూడదు అని పోలీసులు నిర్ణయం తీసుకున్నారని తెలిసి,..నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులపై పూర్తి నమ్మకం పోయిన కారణంగా బాధితులను నిన్న (26.02.2026) 10 pm కి నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్ కి తరలించడం జరిగింది. ఈరోజు (27.02.2026) తెలంగాణ రాష్ట్ర DGP గారిని కలిసి బాధితులకు న్యాయాన్ని కోరుతాం, అవసరమైతే ధర్నా శిబిరం హైదరాబాదులో కూడా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాలన్నింటి లో పార్టీలను, సంఘాలను భాగస్వాములను చేస్తాం. @TelanganaDGP
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#BCSCST
#Telangana
చాకలి కులస్తుల పై రెడ్ల కిరాతక క్రూర దాడి.
🔶🔷🔶🔷🔶🔷🔶🔷
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మూడు రోజుల క్రితం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించిన కారణం గా చాకలి కులస్తులు ఐన గణేష్, చంద్రకళ,మౌనిక ల పై అదే గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి,సతీష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి,మధు రెడ్డి ఈ రెడ్డి వర్గం అంతా...రాయలేని భాష తో బూతులు తిడుతూ..దురహంకారంతో అతి కిరాతకంగా భయంకరంగా వారిపై దాడి చేశారు, మరియు రెండు నెలల పసిబిడ్డని కాలు తో తన్ని చంపారు. ఈ రెడ్ల దురహంకార సంఘటనను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ,కలెక్టర్ వెంటనే బాధితులకు భద్రత కల్పించాలి వారికి తగు నష్టపరిహారం చెల్లించాలి, వారికి వైద్యం చేయించాలి అని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి జిల్లా లో జరిగినందుకు వెంటనే వారు జోక్యం కల్పించుకొని నిందితులపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
#BCSCST
#Casteatrocities
#Telangana
యుద్ధ రహిత చైతన్యం పెను ప్రమాదం.
🔷🔶🔷🔶🔷🔶🔷
"జై BC,SC,ST తెలంగాణ" నినాదం తో...ఈ భూమి పై ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని మళ్ళీ పుట్టిద్దాం,మూడున్నర కోట్ల మంది అణగారిన వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలబెడదాం.
యుద్ధ రహిత చైతన్యం పెను ప్రమాదం దాన్ని చూసిన శత్రువు తన రూపం మార్చుకొని మారువేషం లో బయలుదేరుతాడు. అది చూసిన మన అమాయక జనం అయోమయం లో పడతారు. అందుకే సోషల్ మీడియా మరియు ఉపన్యాసాలకు,వాదనలకే పరిమితం కాకుండా.. "ఫూలే ,అంబేడ్కర్, కాన్షీరామ్" ల సిద్ధాంత ఆయుధం తో సైనికుల మై యుద్ధం చేసి మన రాజ్యాన్ని నిర్మిద్దాం. గుర్తింపు కాంక్ష ఉన్న విద్యావంతులైన BC SC ST యువకులార..!
ఈ యుద్ధ నీతిని,ఈ రాజ నీతిని అర్ధం చేసుకోండి,అపార్థం చేసుకోకండి.
#ChatrapathiShivajiMaharaj
#PhuleAmbedkarKanshiram
#BCSCST
#Telangana
BRS పార్టీకి ఘోరీ కడదాం.
🔷🔶🔷🔶🔷🔶🔷
బుట్టెంగారి మాధవరెడ్డి కి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేయడానికి BRS టికెట్ ఇవ్వడాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ JAC తీవ్రంగా ఖండిస్తోంది. BRS పార్టీ అణగారిన కులాలపై తన వ్యతిరేక స్వభావాన్ని బహిరంగపరచుకుంది..అంటే BC, SC, ST లకు సవాల్ విసురుతోంది. ఏం చేయగలుగుతరు మీరు అని..? దీనికి సమాధానం ఆ BRS పార్టీ కి ఘోరీ కడదాం అని బీసీ, ఎస్సీ, ఎస్టీ లు శపథం చేయడమే ప్రతి సవాల్.
#BCSCST
#BRSParty
కోమటిరెడ్డి కోట్లాటలో NTV యాజమాని నరేందర్ చౌదరిని అరెస్ట్ చేయకుండా.. BC బిడ్డలైన దొంతు రమేష్,పరిపూర్ణ చారి, సుధీర్ లని అరెస్ట్ చేయడమేంటి..? దీనిని BC,SC,ST JAC తీవ్రంగా ఖండిస్తుంది. వీరిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
#NTV#Telangana#BCSCST
Revolutionary thinkers thought...!
🔷🔶🔷🔶🔷🔶🔹🔶🔷
"I don't believe in the concept of Happy New Year wishes.
Let all of us who are oppressed unite and work towards our liberation, build our own kingdom and live happily for generations to come."
#NewYearWishes#NewYear2026
#Oppressedcommunities