Breaking news, political updates, exclusive stories, public opinions & ground-level reporting. We report what others ignore. Stay informed. Stay fearless.
2023 ఎన్నికల సమయంలో ప్రవల్లిక మరణం మీద కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయినా ఒక్కరు కూడా వారి కుటుంబాలను పరామర్శించలేదు
@INCIndia@RahulGandhi@priyankagandhi@revanth_anumula
#Unemployment #YouthUnemployment #JoblessYouth
#EmploymentForYouth #TelanganaUnemployment
కూటమి నాయకులు అమరావతిలో ఉండాలి, తెలంగాణలో కాదు — గుత్తా సుఖేందర్ రెడ్డి
@PawanKalyan పై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్
ఆంధ్రా నాయకులు తెలంగాణ–ఏపీ మధ్య షటిల్ ట్రిప్స్ ఆపాలని సూచన
పవన్ తన భాషను మార్చుకోవాలన్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి
@ncbn@naralokesh@ysjagan@BJP4Andhra@itsRamTalluri
#PawanKalyan #GuthaSukenderReddy #TelanganaPolitics #AndhraPradeshPolitics #APTelanganaRelations #Amaravati #JanaSena
రాజకీయ ఉనికి కోసమే అభినయ్ రెడ్డి ఆరాటం
అలిపిరి-జూ పార్క్ రోడ్డుపై 'భూమన' అభినయం
తోపుడు బండితో వచ్చి పొలిటికల్ స్టంట్.. పప్పులో కాలేసి, సెల్ఫ్ గోల్ చేసుకున్న @YSRCParty నేత
హైడ్రామా ముగిసింది
తిరుపతి 'అలిపిరి' వద్ద భూమన @Bhumana_Abhinay ని అరెస్ట్ చేసి ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్ కు తరలించారు . వివరాల లో వెళితే ఇటీవల అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే రోడ్డు మార్గంలో వీధి వ్యాపారులను తొలగించడంపై వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి చేస్తూ కేవలం రాజకీయ ఉనికి కోసం పోరాటం అనే నినాదం తీసుకున్నారు
ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని తిరుపతి ప్రజలకు తెలుసు
అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే రోడ్డు మార్గంలో అక్రమంగా వెలిసిన తోపుడు బండ్లను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని తలంపుతో వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి అలిపిరి జూ పార్క్ రోడ్ తోపుడు బండ్ల వ్యాపారుల తో సమావేశం గత వారం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 3వ తేదీ లోపల ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని ఒక గడువు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.
అందులోభాగంగా నిన్న అభినయ్ రెడ్డి అనుచరగణం తో ఒక తోపుడు బండి నీ సైతం.తీసుకొని వచ్చి అలిపిరి రోడ్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరించాలి.
అసలు సమస్యలు ఇవి..
అభినయ్ కి ఇవి కనపడవా? తిరుపతి అన్ని ప్రాంతాలలో తోపుడు బండ్ల తో వ్యాపారం చేసుకుంటున్నారు ఎక్కడ ఎవరిని నియంత్రించలేదు. పేద వాడి పొట్ట.కొట్టలేదు
కానీ అలిపిరి-జూ పార్క్ రోడ్డు అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ దుకాణాలు పెట్టడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నాయో కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది:
క్రూర జంతువుల సంచారం - ప్రాణాలకే ముప్పు:
ఇది పూర్తి అటవీ ప్రాంతం. ఇక్కడ అర్ధరాత్రి దాకా దోశ బండ్లు, చిరుతిళ్ల అంగళ్లు పెట్టి, ఆ వ్యర్థాలను అక్కడే పడేయడం వల్ల అడవిలో నుంచి చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు రోడ్డుపైకి వస్తున్నాయి. రేపు ఏదైనా ప్రమాదం జరిగి సామాన్యుల ప్రాణాలు పోతే ఈ అభినయ్ రెడ్డి బాధ్యత వహిస్తాడా?
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా: చీకటి పడితే నిర్జనంగా ఉండే ఈ అటవీ మార్గంలో దుకాణాల చాటున ఎలాంటి అసాంఘిక శక్తులు చేరుతున్నాయో, ఎలాంటి వికృత చేష్టలు జరుగుతున్నాయో పోలీసులకు స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. పైగా ఇదే దారిలో నిరంతరం వీఐపీల రాకపోకలు ఉంటాయి. భద్రతను గాలికొదిలేసి ఇక్కడ అరాచకానికి అనుమతి ఇవ్వాలా?
ప్రజారోగ్యం - కల్తీ ఆహారం: ఈ ప్రాంతంలో విక్రయించే ఆహార పదార్థాలలో నాణ్యత లోపించిందని, కల్తీ నూనెలు వాడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులు, పర్యాటకులు, స్థానికులు తెలియక ఈ ఆహారం తిని అనారోగ్యం బారిన పడుతున్నారు అనేది అందరికీ తెలుసు
ప్రభుత్వం కేవలం తిరుపతి నగరంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం, వన్యప్రాణుల రక్షణ కోసం తీసుకొన్న ఒక మంచి నిర్ణయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.
భూమన అభినయ్ రెడ్డి చేసిన పని ఏంటి?
మెరిడియన్ వెనుక అభినయ్ దందా ఏంటి అని ప్రశ్నిస్తున్న ప్రజలు ఒక్కసారి అభినయ్ రెడ్డి తను చేసిన ఘోరాలను ప్రజలు గుర్తుచేస్తున్నారు. కపిల తీర్థం సర్కిల్ అంటే తిరుపతిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆ సర్కిల్ లో గోడలపైన కుర్చీని సాయంత్రం ఆధ్యాత్మిక కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఎంతో మందికి ఆ ప్రాంతం .గొప్ప అనుభూతి ఇచ్చింది. సీనియర్ సిటిజన్స్ మొత్తం అక్కడే సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చుని సమయం గడిపేవారు
అభినయ్ రెడ్డి తన హయాంలో మున్సిపాలిటీ కి చెందిన స్థానిక NGO కాలని పార్క్ మరియు ఏమినిటీస్ స్థలం ను తన అధికార బలం తో లాక్కున్నారు , ప్రభుత్వ సొమ్ముతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అదే బిల్డింగ్ ను మెరిడియన్ హోటల్ తన అనుచరుడు పెట్టించి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ను లిటరల్ గా చంపేశారు.ఆయన కోట్ల వ్యాపారం రోజు అక్కడే చేస్తున్నారు. అక్కడ ఉండే తోపుడు వ్యాపారులు సైతం ఈ రోజు కనుమరుగు అయ్యారు.పేద వాళ్ల పొట్ట గొట్టి తన అనుచరుడికి హోటల్ కట్టించి ఇచ్చినప్పుడు అభినయ్ రెడ్డికి రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని తిరుపతి జనం ప్రశ్నిస్తున్నారు.
సొంత లాభం కోసం మున్సిపల్ ఆస్తులను ఆక్రమించి హోటళ్లు నడిపే భూమన అభినయరెడ్డి,నిన్న అలిపిరి రోడ్డులో ఏదో ఒక ఉద్యమం చేయాలనే తాపత్రయంతో వచ్చి ఘోరంగా అభాసుపాలయ్యారు.ఈరోజు అరెస్ట్ కావడంతో తిరుపతి ప్రజల ముందు మరోసారి పొలిటికల్ జోకర్‌గా మిగిలిపోయారు. ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు పబ్లిసిటీ స్టంట్లు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నగరవాసులు హెచ్చరిస్తున్నారు.
#Tirupati #Alipiri #Politics #YSRCP #StreetVendors #AndhraPradesh
తెలంగాణ జనసేనలో మొదలైన చేరికలు
తెలంగాణలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ!
జనసేన అధినేత @PawanKalyan సమక్షంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు నేడు జనసేన పార్టీలో చేరారు.
కొత్తగూడెం నుంచి డా. గడల శ్రీనివాసరావు, పెద్దపల్లి నుంచి గొట్టిముక్కల నరేష్ రెడ్డి, సరూర్‌నగర్ నుంచి ప్రేమ్ గాంధీ, కరీంనగర్ నుంచి అమ్రపెల్లి గంగాధర్, కోదాడ నుంచి పర్వతం సైదా చారి, హైదరాబాద్ నుంచి సాయి ఈశ్వర్ రెడ్డి, సిద్ధిపేట్ నుంచి కమ్మరి శ్రీను గారు జనసేన కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. @itsRamTalluri
#JanaSenaParty #PawanKalyan #Telangana #JanaSena #PoliticalNews #TelanganaPolitics #AndhraPradesh #JSPUpdates
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
• తెలంగాణలో పోటీపై ప్రస్తుతం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవు.
• దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు.
• నేను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎలాంటి చెడు వ్యాఖ్యలు చేయలేదు.
• తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదే.
• కేటీఆర్ నాకు సోదరుడి లాంటి వారు.
• ప్రాంతీయవాదం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరు.
• ఇలా విభజించుకుంటూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్తాం?
• భూమికి సరిహద్దులు ఉంటాయి, మనసుకు ఉండవు.
• ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదు.
• జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు.
• దేశంలో ఎక్కడైనా బతకడం మన హక్కు, ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు.
• కశ్మీరీ పండిట్లను వారి ప్రాంతం నుంచి వెళ్లగొట్టినప్పుడు ఏమైందో అందరికీ తెలుసు.
• 2014 నుంచి 2024 వరకు ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీలో పనిచేయలేదా?
• తెలంగాణ జనసేన నాయకులు పోరాటం చేస్తే వారికి మద్దతుగా వెళ్లాను.
• రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం గడిచినా ఇంకా ఇంత ద్వేషం ఉంటుందని ఊహించలేదు.
• మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.
• ఇదంతా సీఎం @revanth_anumula కు తెలిసి జరిగిందని నేను అనుకోవడం లేదు.
• Rahul Gandhi, Priyanka Gandhi Vadra వయనాడ్‌కు వెళ్లి పోటీ చేయవచ్చా?
• మా ఇల్లు ఉన్న తెలంగాణకు నేను వెళ్లకూడదా? @PawanKalyan
#PawanKalyan #JanaSena #Telangana #AndhraPradesh #KTR #RevanthReddy #Politics #IndiaPolitics
కాసేపు వయసు, హోదా, పరిసరాలు అన్నీ పక్కనపెట్టి.. ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకున్నారు.
ఎంత పెద్ద నాయకుడైనా.. ఓ చిన్నారి ప్రేమాభిమానాల ముందు చిన్నపిల్లాడిలా మారిపోతాడు. @ncbn#ChandrababuNaidu#AndhraPradesh
అసలు సిసలు తెలంగాణ బాపు ఎక్కడున్నారో..?
తెలంగాణ జాతి పిత అని గొప్పగా పిలిపించుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యేక తెలంగాణ రావడానికి ఆయనే కారణం అని గొప్పగా చెబుతారు. అసలు ఆయన పోరాటం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదంటారు. ఆయన ఎవరో కాదు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అంతా కేసీఆర్ అని పిలుస్తారు. ముందు ఉద్యమ పార్టీగా మొదలు పెట్టారు.. తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చారు.. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీ అని ప్రకటించారు. హ్యాట్రిక్ సీఎం అవుదామనుకున్న కలలు చెదిరిపోయాయి. ఆ తర్వాత నుంచి ఆయన కూడా కనుమరుగయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యం అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమం ప్రారంభించారు. నిజానికి కేసీఆర్ రాజకీయ ప్రస్తానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. 1999లో రెండోసారి గెలిచిన కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదు. కేసీఆర్‌ను చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్‌ను చేశారు. అది ఆయనకు నచ్చలేదు. మంత్రి పదవి కావాలన్నారు. కానీ సామాజిక సమీకరణలు బేరీజు వేసుకున్న చంద్రబాబు.. మంత్రి పదవి సాధ్యం కాదన్నారు. అంతే.. తెలంగాణకు అన్యాయం అంటూ గగ్గోలు పెట్టారు. నిజానికి అప్పటికే తెలంగాణ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కానీ.. వారికి వచ్చిన పదవి.. కేసీఆర్‌కు రాకపోవడంతో.. తెలంగాణ మొత్తానికి అన్యాయం జరిగినట్లు తెగ గోల పెట్టారు. అంతే.. భజన బ్యాచ్ కూడా మొదలైంది.
ఇక ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం అంటూ ప్రజలను నమ్మించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్.. యూపీఏ-1 సర్కార్‌లో కార్మిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పుడు తెలంగాణ గురించి మర్చిపోయారు. కానీ.. కొద్ది రోజులకే చేసిన అవినీతి బయట పడటంతో మళ్లీ కాంగ్రెస్‌తో లొల్లి పెట్టుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. మళ్లీ సైకిల్ పార్టీపై యుద్ధం ప్రకటించారు. ఇక ఆ తర్వాత నుంచి నిరాహార దీక్ష అంటూ మరో పోరాటం మొదలుపెట్టారు. మళ్లీ నీరు, నిధులు అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. సకల జనుల సమ్మె అన్నారు. తెలంగాణకు తొలి సీఎం దళితుడే అని.. లేదంటే కేసీఆర్ తల తీసుకుంటాడంటూ శపధాలు, హామీలు ఇచ్చారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతే.. దళిత సీఎం ఏమయ్యాడో తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ వాదం కూడా పోయింది. అంతా అన్నదమ్ములే అన్నారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రెండో సారి సీఎం అయ్యారు. 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ సీఎం అవుదామనుకున్న ఆయన కల నెరవేరలేదు. ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. అంతే.. నాటి నుంచి ఇప్పటి వరకు.. రెండున్నరేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు తెలంగాణ భవన్‌కు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు తప్ప.. అన్న చెల్లెలు మధ్య గొడవ కూడా తీర్చలేక పోయారు.
ఇక తెలంగాణ వాదానికి తానే పేటెంట్ అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ జాతి పిత, తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవటమే తప్ప.. కనీసం తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కాదు కదా.. ఫామ్ హౌజ్‌లో కూడా ఆయన తెలంగాణ జెండా ఆవిష్కరించినట్లు, తెలంగాణ జెండాకు అభివాదం చేస్తున్న ఫోటో కూడా బయటకు రాలేదు. అంటే తెలంగాణ పేరుతో రాజకీయం చేయడం.. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప.. తెలంగాణ అంటే ప్రేమ, గౌరవం లేవా అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్ 17న అంతా ఘనంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది.. భారత యూనియన్‌లో తెలంగాణ విలీనం అయిన రోజు సెప్టెంబర్ 17. రజాకార్ల ఆగడాలు అంతమై ప్రజాస్వామ్యానికి నాంది పలికిన రోజు. అలాంటి రోజున కూడా కేసీఆర్ అమరవీరులకు గౌరవ వందనం చేయలేదు. మరి ఈయన జాతి పిత, బాపు ఎలా అయ్యారో.. తెలంగాణ వాదులే చెప్పాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.
@KCRBRS@BRSparty@KTRBRS
#KCR #BRS #TelanganaFormationDay #TelanganaPolitics #KCRNews #BRSParty
#TelanganaStatehood #Hyderabad
#TelanganaNews
పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీల నేతల విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
•తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదు.
•ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు.
•విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు.
•ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణ లోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు.
•నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను.
•తమిళనాడుకు కర్నాటకతో పాటు ఆలిండియా నేతలతో పాటు అన్ని ప్రాంతాల నేతలు వచ్చారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు.
•తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉంది.
•బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు. విస్తరిస్తాం అన్నారు.
•మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు.
•అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు.
•ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారు. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారు.
•ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో... వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారు.
•అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
@ncbn@PawanKalyan@JanaSenaParty@BRSparty@INCTelangana@TelanganaCMO@AndhraPradeshCM
#ChandrababuNaidu #PawanKalyan #JanaSena #TelanganaPolitics #AndhraPradesh #BRS #Congress #TeluguStates #TeluguPeople #PoliticalNews #APPolitics #Telangana
దేశభక్తి, పోరాటాల గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
నటుడిగా అభిమానిస్తాం.. సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం. కానీ మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోం.
మొన్ననే ఎంతో కష్టపడి విడిపోయాం కదా.. మళ్లీ మీ పెత్తనం ఎందుకు?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం మాకు తెలుసు.
-@KTRBRS@PawanKalyan
#KTR #Telangana #BRS #PawanKalyan #TelanganaPolitics
ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు.
మరి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి పోరాటం కూడా ప్రాంతీయవాదమేనా?
తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు మళ్లిపోతే, జాతీయవాదం ముసుగులో జరిగే ఆర్థిక ప్రాంతీయవాదం సరైనదేనా?
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకే రాష్ట్ర ప్రయోజనాలకే పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నప్పుడు, దానిపై మీ అభిప్రాయం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు?-@KTRBRS@PawanKalyan
#KTR #PawanKalyan #Telangana #AndhraPradesh #Politics #BRS #JanaSenaParty
"కడుపులో కత్తులు పెట్టుకుని, పెదవులపై చిరునవ్వు పెట్టుకునే అలవాటు నాకు లేదు. అందుకే నాకు అహంకారం అంటారేమో. కానీ నేను అహంకారం చూపిన సంఘటనలు చెప్పమంటే ఎవరూ చెప్పలేరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అందరికీ నచ్చదు కదా... అందుకే అహంకారం అనుకుంటున్నారు." -@KTRBRS#KTR#KTwitter#BRS #TelanganaPolitics
పవన్ కళ్యాణ్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని అనుకుంటున్నాను.
తన పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా ఆడుతున్నాడు.
తెలంగాణను నిజంగా అభిమానించే వారు పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ప్రజలకు ఏం చేయాలో బాగా తెలుసు.
-@KTRBRS@PawanKalyan@revanth_anumula
#KTR #BRS #Telangana #RevanthReddy #PawanKalyan #JanaSena #TelanganaPolitics
నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్మీట్లో "బెదిరింపుల బ్యాచ్" గురించి మాట్లాడితే, దాన్ని కావాలనే వక్రీకరించి "తెలంగాణ ప్రజల గురించి అన్నాడు" అంటూ BRS సోషల్ మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది.
ప్రెస్‌మీట్ మొత్తం చూస్తే ఆయన వ్యాఖ్యలు కొందరు రాజకీయ నేతలు, ట్రోల్స్, బెదిరింపుల రాజకీయాలపై మాత్రమే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఎక్కడా వ్యాఖ్యానించలేదు. అయినప్పటికీ రాజకీయ లాభం కోసం మాటలను కత్తిరించి ప్రచారం చేయడం దురదృష్టకరం.
జనసేన తెలంగాణలో రాజకీయంగా చురుకుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది.
@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@BRSParty_News
#PawanKalyan #JanaSena #Telangana #TelanganaPolitics #BRS #FakeNarrative #PoliticalPropaganda #JanaSenaInTelangana #PKInTelangana #AndhraPradesh
నిన్న హైదరాబాద్‌లో జరిగిన జనసేన అధినేత @PawanKalyan ప్రెస్‌మీట్‌కు భారీ స్పందన. దాదాపు 300 కెమెరాల కవరేజ్‌తో తెలంగాణ రాజకీయాల్లో జనసేన చర్చనీయాంశంగా మారింది.
📌 తెలంగాణలో అమాంతంగా పెరిగిన జనసేన క్రేజ్
📌 పార్టీలో చేరేందుకు యువత నుంచి భారీగా ఫోన్లు
📌 త్వరలోనే భారీ చేరికలకు రంగం సిద్ధం
📌 కావాలనే సృష్టిస్తున్న వివాదాలను పట్టించుకోని తెలంగాణ ప్రజలు
📌 తెలంగాణలో స్థిరపడ్డ సెటిలర్స్, వ్యాపార వర్గాలకు ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్ ప్రసంగం
"తెలంగాణ అందరిదే... ఇక్కడ నివసించే ప్రతి భారతీయుడికి సమాన హక్కులు ఉన్నాయి" అనే సందేశాన్ని బలంగా వినిపించిన పవన్ కళ్యాణ్.
@JanaSenaParty@NagaBabuOffl@JSPTelangana@itsRamTalluri
#PawanKalyan #JanaSena #JanaSenaParty #Telangana #Hyderabad #JSPInTelangana #PowerStar #AndhraPradesh #TelanganaPolitics #JanaSenaForPeople
'పెద్ది' సినిమాకు టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
📌 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై ₹100 వరకు పెంపు
📌 మల్టీప్లెక్స్‌లలో ₹125 వరకు పెంచుకునేందుకు అనుమతి
📌 జూన్ 3 రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్‌పై ₹600 వరకు అదనంగా వసూలు చేసుకునే అవకాశం
📌 మొత్తం 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి
#Peddi #Telangana #MovieTickets #TicketPriceHike #Tollywood #TelanganaGovernment #MovieUpdates