ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR - Special Intensive Revision) ప్రక్రియను పురస్కరించుకుని, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAs) శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
కావున బూత్ లెవల్ (BLAs),మండల పార్టీ అధ్యక్షులు మరియు సర్పంచ్‌లు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు కాగలరు...
ఓటర్ల జాబితా సవరణ అత్యంత కీలకమైన ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా హాజరుకావాల్సిందిగా కోరుతున్నాము.
🗓️తేదీ: 09.06.2026 (మంగళవారం)
⏰ ఉదయం 10.00గంటలకు
వేదిక: సాయి శివ ఫంక్షన్ హాల్, దేవరకొండ
*ఇట్లు...*
*ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం-దేవరకొండ*
పేదరికాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా పేదల బాధలు నాకు తెలుసు. పేదల సమస్యలను అర్థం చేసుకుని వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని. మూసీ నది ఆక్రమణల్లో నివసిస్తున్న వారికి ఇళ్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి గౌరవప్రదమైన జీవితం ప్రభుత్వం కల్పిస్తుంది. మూసీ నదిని శుభ్రంగా, గొప్ప నదిగా తీర్చిదిద్దడం నా లక్ష్యం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TelanganaDevelopment
#RiverConservation
#CleanRivers
#InclusiveGrowth
#HousingForAll
#EducationForAll
#HealthcareForAll
#EmploymentOpportunities
#UrbanDevelopment
#prajaprabuthvam
#telanganarising
తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు.
ఇది పేదోడి ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కాదు
పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం
పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్నిచ్చే ప్రభుత్వం
దొరలు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటయ్.. కానీ, వేదిక దిగిన తరువాత దొరలకు వాళ్లు చెప్పిన మాటలు గుర్తుండవు
హైదరాబాద్ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, రెండో విడతలో కూడా ఇండ్లు ఇస్తామని తెలియజేస్తున్నాను.
#IndirammaIndlu #IndirammaHousingScheme #HousingforPoor #Hyderabad
స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం
ఇందిరమ్మ ఇళ్లతో దేశానికి తెలంగాణ మార్గదర్శకం
13నెలల్లో లక్ష ఇళ్లు పూర్తి
మరో రెండు నెలల్లో మరో రెండు లక్షలు పూర్తి చేస్తాం
జూన్1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండవ విడతకు శ్రీకారం కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు
ఈ ఏడాది 3.50 లక్షల ఇళ్ల మంజూరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
🏚️ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ఉచితంగా ఐదు లక్షల రూపాయిలతో భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు
🏚️ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని అన్నారు.
🏚️స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచనలు, సలహాలు సూచనల మేరకు భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేశామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా రెండవ విడతకు శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు.
🏚️అలాగే కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5500 నుంచి 6,500 ఇళ్లను మంజూరు చేసినట్లు అవుతుందన్నారు. ఐటిడిఎ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1500 వరకు మంజూరు చేశామని తెలిపారు.
🏚️తాము ఆశించిన స్ధాయిలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం విజయవంతమైందని గత ఏడాది ఫిబ్రవరి మూడవ వారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్ధాపన చేశారని, ఈ 13 నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసుకొని మరో ఒకటి రెండు నెలల్లో మరో రెండు లక్షల ఇళ్లు పూర్తికాబోతున్నాయని తెలిపారు. ఇది ఏరకంగా చూసినా దేశానికే ఆదర్శవంతంగా ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు.
🏚️ఈ ఏడాది 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లకు రాష్టం లోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షలు మొత్తం 3.50 లక్షల ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక ప్రణాళికా బద్దంగా మొదటి విడతలో ఎదురైన మంచి చెడులను పరిగణనలో తీసుకొని మరింత పటిష్టంగా రెండోవిడత కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
🏚️దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలను కొనసాగిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేదవాడి ఇల్లు – ప్రభుత్వ బాధ్యత అనే లక్ష్యంతో స్వంత నిధులతో ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం కేవలం రూ.72 వేలే, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
🏚️గౌరవ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజురై, ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి, 2023 లో గృహ లక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై ఇప్పటికీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి రెండవ విడతలో ఆ ఇంటి నిర్మాణం పూర్తి అవడానికి అవసరమయ్యే ఆర్ధికసాయాన్ని అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇందిరమ్మ పధకంలో 20వేల రూపాయిల వరకు ఆర్ధికసాయం పొందినవారికి కూడా ఈ విడతలో ఇండ్ల మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పేదరికాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా పేదల బాధలు నాకు తెలుసు. పేదల సమస్యలను అర్థం చేసుకుని వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని. మూసీ నది ఆక్రమణల్లో నివసిస్తున్న వారికి ఇళ్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి గౌరవప్రదమైన జీవితం ప్రభుత్వం కల్పిస్తుంది. మూసీ నదిని శుభ్రంగా, గొప్ప నదిగా తీర్చిదిద్దడం నా లక్ష్యం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TelanganaDevelopment
#RiverConservation
#CleanRivers
#InclusiveGrowth
#HousingForAll
#EducationForAll
#HealthcareForAll
#EmploymentOpportunities
#UrbanDevelopment
#prajaprabuthvam
#telanganarising
రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి గాంధీభవన్ లో పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు, బోయ నగేష్ గారు, కుమార్ రావు గారు,ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#RevanthReddy
#MettuSaikumar
#RythuBharosa
#TelanganaCM
#FarmersWelfare
#TelanganaFarmers
#PrajaPrabhutvam
#TelanganaRising
#Gandhibhavan
గత ప్రభుత్వం ఇళ్ల విషయంలో చేసిన జాప్యం వల్ల ఎంతో మంది పేదవాళ్లలాగే మేము కూడా ఎన్నో కష్టాలు పడ్డాం. మా సొంతింటి కల కేవలం కలగానే మిగిలిపోతుందేమో అని భయపడ్డాం. కానీ ప్రజా ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మాకు అండగా నిలిచి, ఒక నీడను కల్పించింది. మా సొంతింటి కలను నిజం చేసి, మా కుటుంబంలో భరోసా నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#IndirammaIllu
#IndirammaHousing
#TelanganaGovernment
#PrajaPrabhutvam
#TelanganaDevelopment
#HousingForAll
#DevelopmentForAll
ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ 2 నుంచి అమలవుతున్న ఈ పథకానికి ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే, దురదృష్టవశాత్తు కుటుంబ యజమాని మరణిస్తే ప్రభుత్వం రూ. 5 లక్షల సాయం చేస్తుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ. 4 వేల కోట్లను కేటాయించింది..
@revanth_anumula@Bhatti_Mallu@INC_Ponguleti
#Indirammainsurance
#ZeroPremium
#TelanganaWelfare
#FamilySafety
#TelanganaRising
#PrajaPrabhutvam
#SecureFuture
ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
@Bhatti_Mallu@Bmaheshgoud6666
#khammamdcc
#congressflag
#AmbedkarJayanti
#TPCC
#PrajaPrabhutvam
#CongressUnity
#CongressRising
#DCC
#congressoath
#AmbedkarTribute
#tpccunity
తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం చొరవతో అంగన్వాడి టీచర్లకు చేయూతనిస్తూ.. స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తే... జీర్ణించుకోలేక మంత్రి సీతక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్ మరియు బీఆర్ఎస్ సోషల్ మీడియా దిష్టిబొమ్మను గాంధీ భవన్ వేదికగా NSUI ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది..
NSUI రాష్ట్ర అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి గారు మాట్లాడుతూ. మంత్రి సీతక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రిశాంక్ మరియు BRS సోషల్ మీడియా వాళ్లను కాపాడుతున్న KTR కు తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
#PoliticalNews
#TelanganaNews
#WomenInPolitics
#PoliticalAwareness
#BreakingNews
#StandWithTruth
#NSUITelangana
#CongressPublicVoice
#TrendingNow