Planing a Thread on Sardaar gabbar singh release celebrations and posters ame antaru cults Ala saradaga peak days gurthuchesinatu untundi mi response Batte plan chestha 😌
విజయదశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. దేశ ప్రజలందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరవ భారత రాష్ట్రపతితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో మరింత శోభాయమానంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తూ.. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada