Can You Guess the Bus? 🤔
Take a close look and tell us which #TGSRTC bus this is! 🚍
A️. Metro Express
B️. Metro Deluxe
C️. City Ordinary
D️. Cargo Bus
Drop your answer in the comments below! 👇
Let’s see who gets it right!🎯
#TGSRTC#PublicTransport#Telangana#Hyderabad
చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం.
సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు.
ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.
సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సెలింగ్ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దు.
నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు.
ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి.
@RPF_INDIA@AshwiniVaishnaw@PMOIndia@PIB_India@MIB_India
అది బైకా.. లేక ఇంకేమన్నానా!!
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.
జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు టీనేజర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు.
ఇదేం పిచ్చో వాళ్లకే తెలియాలి!!
@wave40k@TGSRTCHQ@SajjanarVC Sir, Sorry for the inconvenience and KP Depot did not given the permission to the stall. even through we will examine and pursue with the GHMC officials pl.
టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మానవత్వం..
బస్సులో మరిచిపోయిన రూ.27 లక్షల విలువైన ఆభరణాల బ్యాగు అందజేత
విధి నిర్వహణలో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. బస్సులో మరిచిపోయిన రూ.27 లక్షల విలువైన ఆభరణాల బ్యాగ్‌ను ప్రయాణికులకు అందజేశారు.
ఉదారత చాటిన గద్వాల డిపో కండక్టర్ సూరిబాబు, డ్రైవర్ పరుశురాములును టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని సన్మానించారు.
గద్వాల డిపో బస్సు ఈ నెల 5న కర్నూల్ నుంచి గద్వాలకు బయలుదేరింది. ఆ బస్సులో ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. గద్వాలకు బస్సు రాగానే వారు దిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రూ.27 లక్షల విలువైన నగలు, నగదు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను మరిచిపోయారు. బస్సులో ఆ బ్యాగ్‌ను గమనించిన కండక్టర్, డ్రైవర్.. దానిని తెరిచి చూశారు. అందులో 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు, ఒక ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. వెంటనేఆర్టీసీ అధికారులకు సమాచారం చేరవేశారు. బ్యాగులో ఉన్న వివరాల ఆధారంగా ప్రయాణికులకు సమాచారం అందించారు. దీంతో వాటిని సురక్షితంగా బాధితులకు అధికారులు అందజేశారు.
విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.27 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికులకి అందజేసిన కండక్టర్ సూరిబాబు, డ్రైవర్ పరుశురాములును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.
సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే తమలో ఉన్న మానవత్వపు ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ సమాజంలో ఆర్టీసీపై మరింత నమ్మకం పెరిగేలా ఉద్యోగులు చేస్తున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, గద్వాల డీఎం సునీత, తదితరులు పాల్గొన్నారు.
@PROTGSRTC @TGSRTCHQ
టీజీఎస్ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లకు సన్మానం!!
ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది.
హైదరాబాద్ బస్ భవన్లో దిల్సుఖ్నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపో శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు. ఉన్నతాధికారులతో కలిసి వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఎన్నో ఏళ్లుగా ప్రజా రవాణా వ్యవస్థలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోన్న మహిళా కండక్టర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్(ASRTU) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల న్యూఢిల్లీలో సత్కరించింది. అందులో టీజీఎస్ఆర్టీసీ నుంచి కండక్టర్లు శ్రీదేవి, అనిత, శారద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో వారి సేవలను కొనియాడుతూ యాజమాన్యం సన్మానించింది.
ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషా దేవి, దిల్ సుఖ్ నగర్ డీఎం సమత, తదితరులు పాల్గొన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC