ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది.
టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
@TGSRTCHQ @PROTGSRTC
డేటా సైన్స్ తో ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం
ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా రవాణా సేవలు
డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నిపుణులు శరత్
డేటా విశ్లేషణపై ఆర్టీసీ అధికారులకు అవగాహన
డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ బస్ భవన్ లో లీడర్ షిప్ టాక్స్ లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘ప్రజా రవాణా వ్యవస్థలో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వినియోగం’ అనే అంశంపై శరత్ కాటిపల్లి ప్రసగించారు. ప్రతి రోజు సగటున 55 లక్షల మందిని తమ బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చడం గొప్ప విషయమని అన్నారు. వారి ప్రయాణ డేటాకు అనుగుణంగా రియల్ టైంలో మెరుగైన రవాణా సేవలను అందించవచ్చని చెప్పారు.
మెసేజ్, మెసేంజర్, మెకానిక్స్, మెషినరీ అనే 4ఎం కాన్సెప్ట్ తో సంస్థను ఉన్నతస్థాయికి ఎలా తీసుకువెళ్లోచ్చో వివరించారు. సాంకేతికతలో వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు సంతృప్తికర సేవలను అందించే తీరును తన అనుభవంతో ఉదాహరించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
తెలంగాణకు చెందిన శరత్ కాటిపల్లి.. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీని అమెరికాలో చేశారు. అలాగే, ప్రముఖ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసించారు. అనంతరం మల్టీ నేషనల్ సంస్థలైన లెక్స్ మార్క్, జీఏపీ ఐఎన్‌సీ, ఐబీఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, హెచ్ఎస్బీసీ, అమెజాన్ లాంటి సంస్థల్లో డేటా సైంటిస్ట్ గా విధులు నిర్వర్తించారు. జేపీ మోర్గాన్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థకు చీఫ్ డేటా ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థ లూషియా ఏఐకి అడ్వైజర్ గా కొనసాగుతున్నారు.
డేటా సైన్స్ ను వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలకు జీవనాడిలాగా డేటా సైన్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన సేవలందించేందుకు డేటా విశ్లేషణను వినియోగించుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషారాణి, సీఎంఈ వెంకన్న, తదితరులతో పాటు వర్చ్ వల్ గా ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
@PROTGSRTC @TGSRTCHQ @SajjanarVC @eenadulivenews@TV9Telugu
#TGSRTC కి ఉద్యోగులే ప్రధాన బలం! సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని గుర్తించిన సంస్థ.. వారి ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని యాజమాన్యం ప్రారంభించింది. ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
నవంబర్ 2022లో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-1ను నిర్వహించింది. రికార్డుస్థాయిలో 40 రోజుల్లోనే 47 వేల మంది ఉద్యోగులకు ఈసీజీ, బ్లడ్, కంటి, బీపీ తదితర వైద్య పరీక్షలను సంస్థ చేసింది. ఈ పరీక్షల వల్ల తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న 300 మంది సిబ్బందికి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను సంస్థ కాపాడింది.
వైద్య పరీక్షలు నిర్వహించి.. అంతటితో ఆగకుండా ఆరోగ్య సమస్యలున్న సిబ్బందిని ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించి.. ప్రత్యేకంగా వారికి చికిత్స అందించడం జరుగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు డిపో స్థాయిల్లో హెల్త్ వలంటీర్లను సంస్థ నియమించింది. వారు సిబ్బంది ఆరోగ్య పరిస్థిని పరిశీలించి.. ఆర్టీసీ డాక్టర్లకు సమాచారం ఇస్తారు.
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-2ను ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి సంస్థ ప్రారంభించింది. రాష్ట్రంలోని 97 డిపోల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి 45 వేల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలను సంస్థ చేసింది. టెస్ట్ రిపోర్టులను సిబ్బంది మెబైల్ ఫొన్లకు పంపించింది. డిపోల్లోనే డాక్టర్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయించింది.
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-1తో పోల్చితే 2లో సిబ్బంది ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. క్రిటికల్ ఈసీజీతో బాధపడుతున్న 150 మందిని గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-2లో సంస్థ కాపాడగలిగింది. గతంలో ఈ, డీ కేటరిగీల్లో ఉన్న సిబ్బంది.. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుని ఏ, బీ, సీ కేటరిగీల్లో వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం.
సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక హంగులతో తార్నాక ఆస్పతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దటం జరిగింది. దేశంలో ఏ ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతోంది. ప్రస్తుతం కార్డియోథొరాసిక్ సర్జరీ, మేజర్ న్యూరో సర్జరీ మినహా అన్ని సేవలను ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు అందిస్తోంది.
సాధారణ వైద్య సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 ఆర్టీసీ డిస్పెన్సరీల్లో నిపుణులైన డాక్టర్ల ద్వారా అందించడం జరుగుతోంది. అవసరం మేరకు తప్పా.. డిస్పెన్సరీలు తార్నాక ఆస్పత్రికి రెఫరల్ చేయడం లేదు. వేరే ఆస్పత్రులకు రెఫరల్‌కు ఆస్కారం లేకుండా ఎంఆర్ఐ, సిటీ స్కాన్, తదితర అన్ని సేవలను తార్నాక ఆస్పత్రిలోనే అందిస్తోంది.
@PROTGSRTC @TGSRTCHQ@eenadulivenews@etvtelangana
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం. సంస్థ ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తి, అంకితభావం, కృషి, చిత్తశుద్ధి, త్యాగం ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచాయి. ‘బస్ కా పయ్యా నహీ చలేగా!’ అన్న ఒకే ఒక్క నినాదంతో ఆర్టీసీ చేపట్టిన సమ్మె ఉద్యమానికి ఊపిరిలూదింది. సకల జనుల సమ్మె విజయవంతం కావటంలో ఆర్టీసీ తనదైన చెరగని ముద్రను వేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి బాట వేసింది.
ఆర్టీసీ ఉద్యోగుల ప్రత్యేకతను చరిత్రలో నిలిపిన వివిధ కార్యక్రమాలు రాష్ట్ర సాధనలో చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి; ఫలితమే - మన నవ తెలంగాణ!
దేశంలో నేడు అగ్రగామి ప్రజా రవాణా సంస్థగా రూపొందటంలో అంతర్గత శక్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తియే!
👇
https://t.co/udVPalGmZW
@PROTGSRTC @TGSRTCHQ
భక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే వేడుక మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర!! అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో తరలివస్తూ.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తోన్న భక్తులందరికీ.. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు.
అడవి తల్లి ఒడిలో కొలువుదీరిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభమవుతోంది. వన దేవతల దర్శనం కోసం తరలివచ్చే లక్షలాది భక్తజనానికి మెరుగైన, వేగవంతమైన రవాణా సౌకర్యాలతో #TSRTC స్వాగతం పలుకుతోంది.
@TSRTCHQ @PROTSRTC #medaram #Sammakka #MedaramJathara2024
ఆదివాసీల ఆరాధ్య దైవాలైన ధీర వన దేవతల చల్లని దీవెనలు భక్తజనంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. అందరికీ మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు.
#Medaram#MedaramJathara#Sammakka#Saralamma
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వ సహకారంతో #TSRTC అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సులు అమ్మవార్ల గద్దెలకు అతి దగ్గరగా వెళ్తాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి, సురక్షితంగా వనదేవతలను దర్శించుకోవచ్చు.
@TSRTCHQ
➡️6 వేల ప్రత్యేక బస్సులు
➡️ మేడారంలో 55 ఎకరాల్లో సువిశాలమైన బేస్ క్యాంప్
➡️ భక్తుల కోసం 7 కిలోమీటర్ల పొడువున 50 క్యూలైన్లు
➡️రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు
➡️30 ఎకరాల విస్తీర్ణంలో 5 చోట్ల బస్సుల పార్కింగ్
➡️తాడ్వాయిలో ఎమర్జెన్సీ టికెట్ ఇష్యూయింగ్ కేంద్రం
➡️బస్సుల మెయిన్టెన్స్ కోసం 3 చోట్ల గ్యారేజీలు
➡️మొత్తంగా 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు
మేడారం జన జాతరకు #TSRTC సర్వసన్నద్దమైంది. భక్తజనాన్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సంసిద్ధంగా ఉంది.
@TSRTCHQ @PonnamLoksabha @TelanganaCMO@revanth_anumula @PROTSRTC @seethakkaMLA@KondaSurekha @mpponguleti @Bhatti_Mallu #medaram
ప్రతి ఒక్కరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
భారత గణతంత్ర రాజ్య ఆవిర్భవానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన సమయమిది. భారతీయుల ఆశల, ఆకాంక్షలకు ప్రతీకైనా మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్చా, సమానత్వం, ప్రజాస్వామ్య విలువులకు కట్టుబడి ఉంటామని మనమంతా నేడు ప్రతిజ్ఞ చేద్దాం.
#RepublicDayIndia #HappyRepublicDay #Republic #RepublicDay
'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్య' పథకం అమలు తీరుపై హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పథకం అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ. .ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా.. ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీంను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినంలోనూ మహాలక్ష్మి స్కీంను అమలు చేస్తూ.. క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారని కొనియాడారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా త్వరలో మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపున సహాయసహకారాలు సంస్థకు ఉంటాయని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేయడం వెనుక క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైవర్, కండక్టర్ల కృషి ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సందర్బంగా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని ఆయనను కోరారు. సిబ్బంది పెండింగ్ సమస్యల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి.. త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, టిఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.
@PonnamLoksabha @SajjanarVC @PROTSRTC @TSRTCHQ
హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం హైర్ బస్సు యాజమానులతో #TSRTC యాజమాన్యం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు విషయాలను వారు సంస్థ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ సిఫారసులను పరిశీలించిన తర్వాత.. ఆ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని హైర్ బస్సు యాజమానులకు వివరించడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించారు.
రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని ఇవాళ ఉదయం హైర్ బస్సు యజమానులు కలిశారు. తమ సమస్యలను పరిశీలించాలని ఆయనను కోరారు. దీనిపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారితో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడటం జరిగింది. సమస్యల పరిశీలనకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
“హైర్ బస్సు యాజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రవాణ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైనది. ఆ కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుంది. సంస్థ బస్సులు, హైర్ బస్సుల డేటాను క్రోడికరించి.. ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై హైర్ బస్సు యాజమానులు సానుకూలంగా స్పందించారు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు.
ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
@PonnamLoksabha @TelanganaCMO @TSRTCHQ @PROTSRTC
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని రాజేంద్ర నగర్ డిపో ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిబ్బందిని అప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిమందికి ఆయనే స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు.
@TSRTCHQ @PROTSRTC @SajjanarVC @HiHyderabad
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం #TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హైదరాబాద్ బస్ భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. మహా లక్ష్మి స్కీం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జ్ లుగా నియమించామని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని వివరించారు.
ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలిపారు.
సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకొని ప్రయాణించాలని సూచించారు.
ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(ఆపరేషన్స్) జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథ్‌రావు, సీపీఎం ఉషాదేవి, సీటీఎం (కమర్షియల్) సుదర్శన్, సీఈఐటీ రాజశేఖర్, ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
@PROTSRTC @TSRTCHQ @CTMOTSRTC@TelanganaCMO @PonnamLoksabha
#Hyderabad మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఘనంగా #NewYear2024 వేడుకలు. ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసిన TSRTC (@TSRTCHQ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC).
#NewYear#HappyNewYear2024
ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం !
నేడు ప్రజల సౌకర్యం కోసం నూతనం గా 80 బస్సులను
ఆర్టీసీ ఎండీ @SajjanarVC ,GHMC మేయర్ @GadwalvijayaTRS గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది !
హైదరాబాద్ లోని ICBM-School of Business Excellence 16వ స్నాతకోత్సవం ఆదివారం సందడిగా జరిగింది. ఈ వేడుకలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
@ICBMSBE @tsrtcmdoffice @SajjanarVC @PROTSRTC