బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే @BJP4India నాయకులకు ఎంత ఏవగింపు ఉందో రాజ్య సభలో కేంద్ర హోం మంత్రి @AmitShah మాటలు వింటే అర్థమైతుంది.
స్వర్గం ఉందో లేదో ఎవరికీ తెలవదు, కానీ కోట్లాది మంది భారతీయుల బానిస సంకెళ్లను తెంచివేసి భూతల స్వర్గాన్ని చూపిన అంబేద్కర్ దేవుడి కంటే ఎక్కువే అమిత్ షా గారు.
మర్యాద గా క్షమాపణ చెప్పండి.
Union Home Minister, Mr Amit Shah’s statement in Rajya Sabha trivialising #Babasaheb #Ambedkar is emblematic of BJP’s deep seated hatred for this great son of India, architect of Indian Constitution and his thoughts. It’s high time that nation understands the true colours of BJP and its affiliates. #SayNo2BJP
అలంపూర్ నియోజకవర్గం కొండేర్ గ్రామంలోని తమ నివాసంలో మాజీ నాగర్ కర్నూల్ ఎంపీ సీనియర్ రాజకీయనాయకులు డా. మంద జగన్నాథం గారు మీడియా సమావేశం ఎర్పాటు చేసి నాకు బేషరతుగా మద్దతు తెలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏.
డా. జగన్నాధం గారి లాగానే చాలా మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు నాకు ఫోన్లు చేసి తమ విలువైన మద్దతు తెలిపారు. వాళ్లకు, వాళ్ల అనుచరులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏
తెలంగాణ అంతటా ఇదే వాతావరణం నెలకొన్నది. కాంగ్రేసు-బీజేపీల పచ్చి మోసం వల్ల గాయపడ్డ తెలంగాణ దెబ్బతిన్న పులిలా గాండ్రిస్తున్నది.
ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్దం
త్యాగానికి భోగానికి మధ్య,
ఆశయానికి అహంకారానికి మధ్య
తెలంగాణకు, దోపిడి కాంగ్రేసు-బీజేపీల కూటమికి మధ్య
నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న
యుద్దం.
ఇందులో త్యాగమే జయిస్తుంది.
తెలంగాణే జయస్తుంది.
కారే జయిస్తుంది
గులాబీనే వికసిస్తుంది.
Sacrifice Triumphs
बलिदान में विजय निश्चित हैं।
@KCRBRSPresident@KTRBRS@BRSparty
దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలనందించి అతి త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీ లో చేరనున్న రిటైర్డు ఐపీయస్ అధికారి శ్రీ జె. పూర్ణచంద్రరావు (#JPR)గారికి హృదయపూర్వక అభినందనలు.💐💐💐
శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం కమీషనర్ గా, ఆర్టీసీ ఎం డీ గా, ఏసీబీ డీజీగా, తెలంగాణ పోలీసు రిక్రూట్మెంటు బోర్డు ఛైర్మన్ గా #JPR గారు అందించిన సేవలు మరువలేనివి.
వారి సారధ్యంలో బహుజనవాదం తెలుగు రాష్ట్రాల్లో మరింత పదునెక్కి బహుజన వర్గాలు అధికార పీఠం చేజిక్కించుకుంటాయని ఆశిస్తున్నా.
Hearty welcome to Sri. J PoornaChandra Rao (JPR) ji into Bahujan Samaj Party. He is an IPS Officer of 1988 Batch and served the Motherland as SP of Guntur, Srikakulam, and Nellore, as Commissioner of Police, Vizag, as RTC MD, ACB DG, and Chairman of Police Recruitment Board. He retired in the rank of DGP.
Deeply inspired by the life and works of icons of social justice and hon’ble Behenji @Mayawati and the commitment of party to the Bahujans, OBCs in particular, #JPR ji would be joining the #BSP on 22nd Feb in Vijayawada in the presence of Central Coordinator and MP, Sri @ramjigautambsp ji.
We all wish you the very best, Sir.
@AnandAkash_BSP
తెలంగాణ నిరుద్యోగ బిడ్డల పక్షాన నిలబడ్డందుకు న్యాయ వ్యవస్థకు మరోసారి ధన్యవాదాలు🙏. గ్రూప్-1 రెండవ సారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణం. ఆనాడే బీయస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.
ఇంక టైం వేస్టు చేయకుండా…
1. @TSPSCofficial మొత్తం కమీషన్ అర్జంటుగా రాజీనామా చేయాలి. (డా.జనార్దనరెడ్డి గారు, మీకు ఏ మాత్రం నైతిక విలువలున్నా స్వచ్ఛందంగా వైదొలగి పోలీసులకు నిజం చెప్పాల్సిందిగా కోరుతున్నా)
2. కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తరువాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలి.
3. కొత్తగా వచ్చిన 270 OMR షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
4. SIT ఇన్వెస్టిగేషన్లో కమీషన్ ఛైర్మన్,సభ్యులు మరియు SO వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలి.
5. ఈ కేసును CBI కు అర్జంటుగా అప్పగించాలి.
6. అందరు అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి.
7. నవంబర్ లో జరగనున్న గ్రూప్-2 మరియు మిగతా పరీక్షలన్నీ కొత్త కమీషన్ హాయాంలోనే జరగాలి. ఈ కమీషన్ పై ప్రజలకు విశ్వాసం లేదు(ఒక్క KCR కుటుంబానికి తప్ప)
8. Gr-1 కుంభకోణంలో @TelanganaCMO మరియు #KTR పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలి.
9. గత గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్ ఎవరో ముఖ్యమంత్రే స్వయానా వెల్లడించాలి.
పైవన్నీ జరగనిచో లక్షలాది నిరుద్యోగ బిడ్డలూ, వారి కుటుంబాలు తెలంగాణ లో @BRSparty ఎమ్మెల్యేలను తిరగనివ్వద్దని కోరుతున్నాను.
నిరుద్యోగ మిత్రులారా, దయచేసి నిరాశ పడకండి- మన బహుజనరాజ్యంలో పారదర్శకంగా నిజాయితీగా పరీక్షలను నిర్వహించుకుందాం. This is my promise to you all.✊
#KCRFailedTelangana
#LiberateTelangana
#VR99
@BSP4Telangana
డా.బి.అర్.అంబేడ్కర్ గారు రాసిన "భారత రాజ్యాంగం" మన దేశంలో 2 వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ కుల, మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటి చేసి సామాజిక,రాజకీయ,ఆర్థిక విప్లవానికి నాంది పలికింది.
దేశ పౌరులందరీకీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్చ, విశ్వాసం,మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొనబడ్డాయి.
భారత రాజ్యాంగ పీఠికలో 'సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే!
భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదాం! రాజ్యాంగ పీఠికలో ఉన్న 'సోషలిస్టు', ‘సెక్యులర్’ పదాల తొలగింపును #BSP తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి నేడు.నాడు దొరల గడీల భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి భూమి కోసం,భుక్తి కోసం పోరాడిన ధీరవనిత.
ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగం తెలంగాణలోని బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక,మహిళా చైతన్యానికి,శక్తికి స్ఫూర్తిదాయకం.
ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బహుజనులమంతా రాజకీయంగా ఏకమై దొరల గడీల పాలనను కూల్చి, బహుజన రాజ్యం నిర్మిద్దాం. ఇదే ఆమెకు ఘనమైన నివాళి.
#VR99
కాకతీయ యూనివర్సిటీ (KU) పీహెచ్డీ ప్రవేశాల్లో అవతకవలు జరిగాయని ఆరోపిస్తూ వర్సిటీలో శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్,డీన్స్ అందరూ కలిసి 75 శాతం పీహెచ్డీ అడ్మిషన్లను అనర్హులకు అమ్ముకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారంటే #KCR పాలనలో వర్సిటీలు ఎంతటి నీచ స్థాయికి దిగజారాయో అర్దం చేసుకోవచ్చు.
వర్సిటీలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి, ఉన్నత విద్యకు దూరం చేయాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్ విశ్వవిద్యాలయాలను బ్రష్టు పట్టిస్తున్నారు.#KCR స్వార్ధ రాజకీయాలకు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు తమ స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయి.
పీహెచ్డీ అడ్మిషన్లలో యూనివర్సిటీ అధికారులు అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి,మెరిట్ లిస్టు ఆధారంగానే అడ్మిషన్లు కేటాయించాలని #BSP డిమాండ్ చేస్తుంది.
ఛలో సూర్యాపేట👊
ఓటమి భయంతో మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతోని బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నడు?
ఎందుకు జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ ఆక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నడు? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడు??
జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా?
జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచెటోడా? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలె!!!
ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా? ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకా?
ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు #RSP వచ్చినందుకా? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా)మీకు చంచాలుగానే బతకాల్నా???
నూటికి 99% ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా?
మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లు గనే ఉండాల్నా??
తెలంగాణ ప్రజలారా …
50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణ దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లూ భరిస్తనే ఉంటరు?? వాళ్లిచ్చే పది గొర్రెలకు బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా? ఆలోచించండి.
దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా?
అందుకే…
మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్ను గా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్-జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరు గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె.
మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె.
లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము👊 పోలీసోల్లు సంపుతే సద్దామి, కానీ మన బిడ్డను, మన ఇజ్జత్ ను కాపాడుకుందామి.
దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.
రాండి. ✊
శనార్తి🙏
#Janaiah
#SelfRespect
#VR99
#LiberateTelangana
ఉమ్మడి వరంగల్ జిల్లా బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించేదిశగా పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ప్రాంగణం HNK యువతకి భరోసాని ఇవ్వడానికిబహుజన విద్యార్థి గర్జన సభకి విచ్చేసిన బహుజన రథసారధుడుఆర్ఎస్పీ గారితో.... BSP భూపాలపల్లినియోజకవర్గఅధ్యక్షులు కొయ్యడ దామోదర్✊🐘
ప్రజా యుద్దనౌక గద్దర్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మొన్న యాప్రాల్ లో గద్దరన్నతో వేదిక పంచుకునే అవకాశమొచ్చింది. అదే చివరిదని ఊహించలేదు.😭 విద్యార్థి దశలో ఊరు మనదిరా, వాడ మనదిరా అన్న పాటను 1987 లో అంబేద్కర్ జయంతి సందర్భంగా గద్దరన్న గొంతు నుండి విన్నాను. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఈ గొంతుక నేడు మూగబోవడం దేశానికి తీరనిలోటు. ఈ ప్రజాగాయకుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. #Gaddar
అయినా కూడా మనకు (BC, SC, ST) లకు సిగ్గురాదు..!
సర్పంచ్ నుండి రాష్ట్రపతి పదవులు చేపట్టిన కూడా మనం గిట్ల పక్కకు నిలబడాల్సిందే..!
అందుకే అధికారం మన చేతులో ఉండాలి,మనదై ఉండాలి,మన వాళ్ళు ఉండాలి..!
అప్పుడే మనకు,మన పదవికి విలువ..!
#BSP4Equality@RSPraveenSwaero#BSP