విజయవాడ పశ్చిమ ��ియోజకవర్గ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగించింది. నన్ను 47 వేల ఓట్లతో గెలిపించిన పశ్చిమ నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 'అభివృద్��ి ప్రయోగశాల' గా మారుస్తున్నాను. తాగునీటి పైప్లైన్లు, ప్రజల ఆరోగ్యం కోసం మొబైల్ మెడికల్ బస్సులు, ముందస్తు ఆరోగ్య పరీక్షలు, రూ.27 కోట్లతో లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియం పనులు చేపట్టాం. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను, వ్యాపార వర్గాల నుండి దందాలను అరికట్టాం. ఇంకా ప్రజలకు చేయాల్సిన సేవ చేయాల్సింది కొండంత ఉందని, భవిష్యత్తులోనూ ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా, కూటమి ఏకగ్రీవంగా గెలిచేలా అందరం ��లిసి పని చేద్దామని పిలుపునిచ్చాను.
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్‌బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. పోలియో మహమ్మారి రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ రక్షణ కవచాన్ని ప్రతి ఒక్క��ూ సద్వినియోగం చేసుకోవాలి. ఐదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు భరోసానిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నద��తల ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. దేశంలోని ప్రతీ రైతన్నకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో ప్రారం��ించిన 'పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి' లో భాగంగా, నేడు 23వ విడత కింద 9.44 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లకు పైగా నిధులను నేరుగా బదిలీ చేయడం ద్వారా రైతు సంక్షేమం పట్ల గౌరవ ప్రధానమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది.
ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన జీవన తత్వం 'యోగా'. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి కృషితో నేడు యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించి, కోట్లాది మంది మన సంస్కృతిని ఆచరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. శరీరం, మనసుల నడుమ సమతుల్యతను సాధించి, ప్రశాంతతను ఇచ్చే అద్భుత సాధన యోగా. ఆరోగ్యవంతమైన జీవనశైలితో సంతోషకరమైన కుటుంబాలను నిర్మించుకుంటూ, యోగాను జీవితంలో భాగం చేసి శక్తివంతమైన సమాజ నిర్మాణానికి పునాదులు వేద్దాం.
ఈరోజు విజయవాడ పర్యటనలో ఉన్న గౌరవ కేంద్రమంత్రి శ్రీ @JoshiPralhad గారు తాడిగడపలోని నా క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో ఆత్మీయ స్వాగతం పలికి, విందు ఏర్పాటు చేయ��ం జరిగింది. అనంతరం, శ్రీ @narendramodi గారు 12 ఏళ్ల విజయవంతమైన సుపరిపాలనను పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు శ్రీ @MadhavBJP గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ అడ్డూర��� శ్రీరామ్ గారు మరియు పలువురు సీనియర్ నాయకులతో కలిసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించాము.
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ.2,700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మ���ంచిన వెస్ట్ బైపాస్ ను కేంద్రమంత్రి @JoshiPralhad గారు, బీజేపీ రాష్ట అధ్యక్షుడు @MadhavBJP గార్లతో కలిసి పరిశీలించాను. విశాఖపట్నం, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా రాజధాని అమరావతి, గుంటూరు నగరాలను చేరుకోవచ్చని, ఈ కొత్త మార్గంతో విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ రద్దీ నుండి ఉపశమనం లభించిందని తెలియచేసాము.
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి, గౌరవనీయులు శ్రీ @JoshiPralhad గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @MadhavBJP గారితో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఆలయ ప్రధాన అర్చకులు, పాలకమండలి ఛైర్మన్ గారు, ఈవో శీనానాయక్ గారు గౌరవ మంత్రివర్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి, వేదాశీర్వచనం అందజేశారు.
విజయవాడ, రాయనపాడు శాటిలైట్ ���ైల్వే స్టేషన్‌ను గౌరవ కేంద్ర మంత్రి శ్రీ @JoshiPralhad గారు, బిజెపి నేతలతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ, గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో 'వికసిత భారత్' విజన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు; ఇందులో భాగంగా రాయనపాడు స్టేషన్ ఆధునీకరణకు రూ. 35 కోట్లు, 2026-27 బడ్జెట్లో ఏపీ రైల్వే మౌలిక వసతుల కోసం రూ. 10,144 క���ట్లు భారీగా కేటాయించామని, అలాగే రాష్ట్రంలో 178 అమృత్ స్టేషన్ల అభివృద్ధి, విశాఖ రైల్వే జోన్, అమరావతి రైల్వే కనెక్టివిటీ మరియు భవిష్యత్ బుల్లెట్ ట్రైన్ ప��రణాళికలతో రాష్ట్ర రైల్వే వ్యవస్థ సరికొత్త వృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు.
కేంద్ర మంత్ర���వర్యులు శ్రీ @JoshiPralhad గారు విజయవాడ పర్యటనలో అమరావతి ప్రగతిపై చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలు. 2019-24 మధ్య తీవ్ర ఒడిదుడుకులకు లోనైన అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కల్పించి సంపూర్ణంగా ఆదుకున్నారు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు. బడ్జెట్లో రూ.15,000 కోట్ల నిధులతో పాటు, HUDCO ద్వారా మరో రూ.11,000 కోట్ల ఆర్థిక సాయం, కొత్త రైల్వే లైన్, జాతీయ రహదారుల అనుసంధానం మరియు పలు జాతీయ సంస్థల ఏర్పాటుతో అమరా��తిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తోంది
సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఐదుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికై, దేవాదాయ మరియు ఎక్సైజ్ శాఖల మంత్రిగా ఆయన ప్రజలకు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలు ఎనలేనివి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
గత 12 వసంతాల పాలనలో, 2014కి పూర్వం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 'అతీ గతీ లేకుండా' నిలిచిపోయిన దేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు జీవం పోశారు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi. 'ప్రగతి' ద్వారా రూ.85 లక్షల కోట్ల పెండింగ్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, ఇంజనీరింగ్ అద్భుతాలైన చీనాబ్ వంతెన, బోగీబీల్ రైలు-రోడ్డు వంతెన, అటల్ టన్నెల్ నిర్మాణం, చైనా-పాక్ సరిహద్దుల్లో రోడ్ల నెట్వర్క్ విస్తరణ, దేశవ్యాప్తంగా నూతన AIIMS ఆసుపత్రుల ఏర్పాటు, నవభారత ప్రతీక 'సెంట్రల్ విస్టా' నిర్మాణాలతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి, అతి త్వరలో జాతికి అంకితం చేయబోతున్నారు మన గౌరవ ప్రధానమంత్రి గారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' నిర్వహించి, వినతులు స్వీకరించడంతో పాటు CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేయటం జరిగింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ��ూడా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుండగా.. మరోవైపు 'సుజనా ఫౌండేషన్' ద్వారా సీడ్స్, క్రిస్ప్, రెడ్డి ల్యాబ్స్, బీజీఎల్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తున్నాము.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. జూన్ 2వ వారంలో భారీ కార్యక్రమం ద్వారా రెండేళ్ల ప్రగతిని ప్రజల ముందు ఉం��ి, భవిష్యత్ అభివృద్ధిపై వారి సూచనలు తీసుకోవాలని నిర్ణయించటం జరిగింది.
'జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నా ఘన నివాళులు.
గడిచిన దశాబ్ద కాలంగా, గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సమర్థవంతమైన నాయకత్వంలో, శత్రువుల కుట్రలను తిప్పికొడుతూ, దేశ రక్షణలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఉగ్రవాదంపై భారతదేశం నిరంతరం విజయాన్ని సాధిస్తోంది. దేశ భద్రతను మరింత పటిష��టం చేస్తూ, ఉగ్రవాద రహిత నవభారత నిర్మాణానికి మనమందరం పునరంకితమవుదాం.
Heartiest congratulations to @doctorsoumya on being elected as a Fellow of the Royal Society (FRS), one of the world's highest global honours in science.
It is a truly proud moment for the nation as she and her late father, Bharat Ratna Prof. M.S. Swaminathan, become the very first father-daughter duo from India to receive this prestigious recognition. Being only the second Indian woman scientist in the Royal Society’s 365-year history to achieve this milestone, her dedication to global public health continues to inspire generations.
కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారంతో, పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి చేతుల మీదుగా 1,250 మంది నిర్వాసితులకు రూ.600 కోట్ల భారీ ప్యాకేజీని అందజేయడంతో పాటుగా, 312 కుటు���బాలకు OTS మరియు 190 మంది గిరిజన సోదరులకు భూమి పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుంది.
భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి మన రాష్ట్రంలోని రాయ���సీమ అయింది.శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో రూ.15,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే తొలి 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ, అసెంబ్లింగ్ కేంద్రానికి నేడు గౌరవ కేంద్ర రక్షణ మంత్రి శ్రీ @rajnathsingh గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు శంకుస్థాపన చేయడం మనందరికీ గర్వకారణం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో స్థానిక యువతకు అత్యున్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ, విజయవాడ నుంచి వెళ్లే రైలుకు అమ్మవారి పేరు పెట్టాలని నేను పంపిన ప్రతిపాదనకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించడం సంతోషకరం. దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ DRM గారు లేఖ ద్వారా తెలియజేశారు. విజయవాడ వాసుల చిరకాల ఆకాంక్షను, మనోభావాలను గుర్తించినందుకు రైల్వే అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి 'ఆంధ్ర కేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ తుపాకులకు గుండె ఎదురొడ్డి నిలిచిన ఆయన సాహసం, తరతరాల తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం
సృష్టిలో అత్యంత పవిత్రమైన పదం 'అమ్మ'. నిరంతరం నిస్వార్థమైన ప్రేమను పంచుతూ, మన ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే ప్రతి ఒక్క తల్లికి నా హృదయపూర్వక ప్రణామాలు. మన జీవితాల్లో అమ్మ చూపిన మార్గం, నేర్పిన విల��వలే మన విజయాలకు మూలస్తంభాలు. ఒక కుటుంబానికి వెలుగునిస్తూ, సమాజ నిర్మాణంలో నిశ్శబ్దంగా కీలక పాత్ర పోషిస్తున్న తల్లులందరికీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
ఈ మాతృ దినోత్సవం సందర్భంగా లోకంలోని ప్రతీ ఒక్క తల్లికి నా హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!