ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం మరియు ప్రతి పౌరుడి భాద్యత -వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, IPS.
ఆటో మరియు క్యాబ్ వాహనాలకు “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్ ను ప్రారంబించిన వరంగల్ పోలీస్ కమిషనర్.
--“అభయ–మై ట్యాక్సీ సేఫ్” స్టిక్కర్లను ప్రతి ఆటో మరియు టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా అంటించుకోవాలి.
-- స్టిక్కర్ ను చూడగానే ప్రయాణికులకు నమ్మకం కలుగుతుంది.
మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భర��సా కల్పించే లక్ష్యంత�� , రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, IPS ప్రారంబించారు.
ఈ సందర్బంగా కమిషనర్ గారు మాట్లాడుతూ-రానున్న రోజుల్లో ప్రయాణికులు “అభయ–మై ట్యాక్సీ సేఫ్” స్టిక్కర్లు అంటించి ఉన్న టాక్సీ వాహణాల్లో మాత్రమే ప్రయాణిస్తారని తెలిపారు. “అభయ–మై ట్యాక్సీ సేఫ్” స్టిక్కర్లను ప్రతి ఆటో మరియు టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా అంటించుకోవాలని, టాక్సీ పైన ఉన్న స్ట���క్కర్ ను చూడగానే ప్రయాణికులకు నమ్మకం కలుగుతుందని, ఇందుకోసం ప్రతి ఆటో మరియు క్యాబ్ యజమానులు వారి టాక్సీ వివరాలను “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్ లో నమోదు చేసుకొని, సమీప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించి, స్టిక్కర్ లను పొంది, వారి టాక్సీ వాహనాలకి అంటించుకోవాలని తెలిపారు.
ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూ���ించారు. ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ సందర్భంగా ట్యాక్సీ డ్రైవర్లకు యాప్ వినియోగం, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ట్యాక్సీ వాహనాల్లో ప్రయాణించే మహిళలు, ఇతర ప్రయాణికులు కూడా “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ట్యాక్సీ వాహనాలపై ఏర్పాటు చేసిన స్టిక్కర్ల ద్వారా ప్రయాణికులకు యాప్‌పై అవగాహన కల్���ించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలను వినియోగించుకునేలా ప్రోత్సహించనున్నారు. అలాగే నాటక ప్రదర్శన ద్వారా పోలీసు కళాబృందం వారు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు సుజాత, వెంకన్న, ట్రాఫిక్ సిబ్బంది, టాక్సీ డ్రైవరు లు, మహిళలు, మరియ��� విద్యార్థులు పాల్గొన్నారు.
@TelanganaDGP @TelanganaCOPs
అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన @cpwarangal ఎన్. శ్వేత, IPS
హనుమకొండలోని JNS స్టేడియంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ N. శ్వేత, IPS, ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా @cpwarangal గారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, JNS స్టేడియం క్రీడాకారులకు ఒక వరమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, క్రీడల్లో విజయం సాధించడం కంటే పాల్గొనడమే గొప్ప విజయం అని సూచించారు.
@TelanganaDGP@TelanganaCOPs
ఈ రోజు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నం. 225/2026, U/s 103(1) r/w 3(5) BNS కేసులో సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించడమైనది. అనంతరం, కేసు దర్యాప్తు అధికారికి(IO) దర్యాప్తును సమర్థవంతంగా మరియు వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సూచనలు జారీ చేయడమైనది.
పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్��వర్గ సభ్యులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులను పోలీస్ కమిషనర్‌కు పరిచయం చేశారు. న��తన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కె. కరుణాకర్, ఉపాధ్యక్షులుగా బి. సతీష్, బి. శరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా బి. నరేష్, కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి, సి.హెచ్. మహేందర్ యాదవ్, ఏ. రమేష్, ఎన్. ప్రవీణ్, ఎం.డి. తాజుద్దీన్, పి. సర్వేశ్ ఉన్నారు.
అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు ముందుగా అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం సిబ్బందికి అండగా నిలుస్తూ, స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని సీపీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ఎన్నికల నిర్వహణ కమ��టీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
@TelanganaDGP @TelanganaCOPs
రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్
పరకాల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం పరకాల జూనియర్ కళాశాల మైదానానికి హెలికాప్టర్లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్., మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
@TelanganaDGP@TelanganaCOPs
వరంగల్ డీఐజీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వరంగల్ డీఐజీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో వరంగల్ పోలీస్ కమిషనర్, జోన్-4 డీఐజీ ఎన్. శ్వేత, ఐపీఎస��� జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బాలస్వామి, సురేష్ కుమార్, హనుమకొండ, క్రైమ్, ట్రాఫిక్ ఏసీపీలు నర్సింగరావు, సదయ్య, సత్యనారాయణ, ఆర్ఐ సతీష్‌తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP @TelanganaCOPs #IndependenceDay2026 #WarangalPolice #Warangal #TelanganaPolice
జనగామ భరోసా కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ శుక్రవారం జనగామలోని భరోసా కేంద్రాన్ని ఆకస���మికంగా సందర్శించి, కేంద్రంలో అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడిని సానుభూతితో, గౌరవప్రదంగా స్వాగతించి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మహిళలు, చిన్నారులు, ఇతర బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందించే భరోసా కేంద్రం ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి కేసును నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల గోప్యతకు అత్య��త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ సుధా, లీగల్ అడ్వైజర్ దయామణి, సపోర్ట్ పర్సన్స్ స్వాతి, అపర్ణతో పాటు ఇతర సిబ్బంది సునీత, హరిత పాల్గొన్నారు.
@TelanganaDGP @TelanganaCOPs @tg_womensafety @CIDTelangana
వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవ��్గం ఎన్నికలు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్యల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్��హించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారి, ఎన్నికల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ ఎన్నికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 110 మంది పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానిస్టేబుల్ కొండా కరుణాకర్ (ధర్మసాగర్ పోలీస్ స్టేషన్) ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి. బాబుపై 17 ఓట్ల ఆధిక్యంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఉపా��్యక్షులుగా బి. సతీష్ (ఆర్ఐ), బి. శరత్ కుమార్ (ఆర్ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు (దామెర ఎస్ఐ), సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్ కుమార్ (ఏఆర్ కానిస్టేబుల్), కోశాధికారిగా బి. నరేష్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు.
కార్యనిర్వ��హక సభ్యులుగా ఎం. తులసి (మహిళా కానిస్టేబుల్, కాజీపేట), సి.హెచ్. మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఏ. రమేష్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్. ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎం.డి. తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి. సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.
@TelanganaDGP @TelanganaCOPs
#TGPOA_Elections_2026_Warangal
#WarangalPolice
Conducted an extensive review of Warangal Police’s performance along with SPs from EAGLE, CSB, TG-SPARK and CID, a practice I have introduced to bring specialised guidance on cybercrime, narcotics, organised gangs and portal updation directly to district police. CP Swetha presented the crime statistics, with overall crime showing a marginal decline and other major crime heads under check. I also reviewed the status of major economic offences, POCSO and SC/ST cases.
Since prominent educational institutions in Warangal attracts students from all over the country, influx of migrant labour, critical railway network, I directed intensified surveillance of passenger movements to check drug trafficking, snatchers and a special drive to replace defunct CCTV cameras. I exhorted all personnel to strengthen their skills in narcotics and cybercrime investigation, thorough crime scene analysis. Instructives were given to improve road safety on highways, and work on the key operational points, suggestions shared by the Bureaus . I also urged them to remain professional and impartial in discharging their duties.
Addressed a press conference towards the end and explained that department is undergoing a transformation to effectively respond to emerging challenges.
#TelanganaPolice
సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్-1గా నిలిచింది. Cyber Security Bureau, జిల్లా యూనిట్లు, కమిషనరేట్ల సమిష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైంది. స్మార్ట్, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో మరింత మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ పోలీస్ కట్టుబడి ఉంది.
#TelanganaPolice
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలి
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
భవిష్యత్తులో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా విద్యార్థులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ పేర్కొన్నారు.
"సురక్షా కా తిరంగా" కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని క���ళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్‌కు సైబర్ విభాగం అధికారులు స్వాగతం పలికారు.
ముందుగా సైబర్ క్రైమ్ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల విధానాలు, నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులు, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన�� ద్వారా వివరించారు. అనంతరం పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సైబర్ నేరాలపై చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ��ోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజల కష్టార్జిత ధనాన్ని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాల ద్వారా దోచుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాల గురించి అవగాహన ఉన్నప్పటికీ అత్యాశ, భయం, అత్యవసరం వంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం సెల్‌ఫోన్ వినియోగం విస్తృతంగా పెరగడంతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, ఫోటోలు లేదా ఫైళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో గోప్యత (Privacy) సెట్టింగ్‌లను తప్పనిసరిగా సరిచేసుకోవాలని, వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, ఫోటోలు వంటి వాటిని సామాజిక మాధ్యమాల్లో విచక్షణారహితంగా పంచుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
పిల్లలకు చిన్నప్పట��� నుంచే వ్యక్తిగత జీవితం (Private Life), బహిరంగ జీవితం (Public Life) మధ్య తేడాను తెలియజేయడంతో పాటు, ఆన్లైన్ కొనుగోళ్లు, డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం ఉపాధ్యాయులతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సైబర్ నేరాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను పోలీస్ కమిష��ర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, విద్యాశాఖ సీఎంఓ సుమ, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, ఎస్బీ ఏసీపీ జాన్ నర్సింహులు, ఇన్స్పెక్టర్లు రజినీత్, శివకుమార్, రవికుమార్, అశోక్, ప్రవీణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి పెట్టుబడులు పెట్టి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవద్దన�� వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ ప్రజలకు సూచించారు.
జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు" రాష్ట్రవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో కాజీపేట నిట్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక���రమానికి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
మోసగాళ్లు "100% గ్యారంటీ రిటర్న్స, "డైలీ ప్రాఫిట్", "ఇన్సైడర్ టిప్స్", "ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు" వంటి తప్పుడు హామీలతో అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రారంభంలో నకిలీ లాభాలను చూపించి, అనంతరం మరింత పెట్���ుబడి పెట్టేలా ప్రలోభపెట్టి, చివరకు క్యాష్ అవుట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, అప్‌గ్రేడేషన్ ఛార్జీలు వంటి పేర్లతో అదనపు డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
అదేవిధంగా, నకిలీ ఆర్థిక సలహాదారులు, నకిలీ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, చట్టబద్ధమైన అనుమతులు లేని సంస్థల ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేస్తూ, అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడి అవకాశాన్ని గుడ్డిగా నమ్మ��ద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సూచనలను విశ్వసించవద్దని, వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వ్యక్తులను నమ్మరాదని పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టే ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థి��� నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ సైబర్ నేరాలపై రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామని విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో నిట్ కళాశాల డైరెక్టర్ డా. ప్రొఫెసర్ సుబుధి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, రిజిస్ట్రార్ సునీల్ మెహతా, ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్స్పెక్టర్లు శ్యామ్ సుందర్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
High returns. Zero risk. Guaranteed profits. If it sounds too good to be true, it's probably a scam.
Stock investment frauds account for nearly 40–50% of the money lost to cybercrime in Telangana.
This August, follow the three colours of Suraksha Ka Tiranga—Stay Alert. Stay Aware. Stay Cyber Safe. Verify before you invest, and report suspicious messages by calling 1930.
Let's work together towards freedom from cyber frauds and achieve Fraud Ka Full Stop.
#SurakshaKaTiranga #FraudKaFullStop #StayAlert #StayAware #StayCyberSafe #TGCSB #Dial1930
@TelanganaDGP@Shikhagoel_IPS@CPHydCity@siddipetcp@CyberCrimeMlkg@MalkajgiriCop@cp_nizamabad@cpwarangal@KarimnagarCp@KhammmCp