ఆరోగ్య పరిరక్షణలో తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.
ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన క్రీడాకారులు మొత్తం 61 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణిస్తూ, నిత్యం సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వారిని ఆదర్శంగా తీసుకుని తోటి పోలీస్ సిబ్బంది వారానికి మూడు నుంచి నాలుగు రోజులు కొంత సమయం కేటాయించి, క్రమశిక్షణతో తమ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేలా ప్రేరణ కలిగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్ రాజ్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
@narendramodi Sir, let’s resolve ourselves to make our NATION a hub of beautiful destinations and secure amazing foreign reserves.Bhaarat Darshan
(IT/Indian Tourism) to be our Mission to attract foreign tourists. We shall start making all our places to be most beautiful/cleanest.
@narendramodi 🙏🏻Sir..! It’s time for us to rise to the occasion. Kindly prioritise Bhaarat Darshan (Indian Tourism) since we have vast potential in this sector. Our citizens are going to countries like Srilanka and on their return, praising their nature, cleanliness. Plz consider
ప్రపంచంలో మరేచోట లేని అద్భుత సృష్టి మన కుటుంబ వ్యవస్థ. భార్య భర్తల అన్యోన్యత పిల్లల భవిష్యత్తుకు మూలాధారం.
నిన్నటి పెద్ద పెండ్యాల సంఘటనను పరిశీలిస్తే అసహనం ఆవేశం అపార్ధాలతో కుటుంబాలు చిన్నాభిన్నమై ప్రాణాలు తీయడం పోవడం అనాగరికం.ఆపత్కాలంలో మేమున్నామని మరవకండి!
ఒక రైతు కుటుంబం తమకున్న ఒక చిన్న కమతంలో కూరగాయల సాగు చేస్తూ, దారిన వెళ్లేవారికి తాజా కూరగాయల్ని చవకగా అమ్ముతున్నారు. ఇద్దరు పిల్లల్లో,కూతురిని డాక్టర్, కొడుకుని ఇంజనీర్ ను చేస్తూ, నిజాయితీతో కష్టాన్నే నమ్ముకునే నీ కుటుంబానికి నా జోహార్లు రాజు..!
For the first time, Lord of obstacles, Ganesha’s idol (clay) was installed at our O/o ACP, Kazipet and after five days of prayers by the staff, today with utmost reverence immersed in pure water of Hasanparthy tank..
Ganesh Maharaaj ki Jai 🙏🏻
On the occasion of 79th Independence Day, I visited the humble abode of our Telangana’s Pride, Sri. Pamulaparthy Venkata Narsimha Rao garu at Vangara village and took his blessings by paying my heartfelt respects to his statue place in front of his house. #IndependenceDay
ప్రజలారా..ఆపత్కాలంలో మేమున్నామని గుర్తుంచుకోండి:వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులెదురైనా వెంటనే 100 నంబర్ కి ఫోన్ చెయ్యండి, మీ గ్రామ/వార్డ్ వి పి ఓ కి ఫోన్ చేసి తగిన సాయం పొందండి.ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులెదురైనా మన కుటుంబసభ్యుల్లా భావించి, తక్షణమే స్పందించిగ్రామస్థులదీవెనలనుఅందుకుందాం
@KAZIPETACP గత కొంత కాలంగా రైతాంగాన్ని వేదిస్తున్న సమస్యకు పరిష్కారం కనుగొన్న కాజీపేట డివిజన్ ముల్కనూర్ పోలీసులు. తొమ్మిది మండలాలలో విద్యుత్ ట్రాన్ఫార్మర్లను ధ్వంసం చేసి, దాదాపు 250 కిలోల రాగి వైరును ఎత్తుకుపోయిన ఇద్దరు దొంగలను, సొత్తును కొన్న వ్యక్తిని కటకటాలకు తరలించనైనది.
సమస్త సోదరీమణులందరికీ, రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీ క్షేమమే మా లక్ష్యం 👍🏼 రాఖీ పండుగ సందర్భంగా మనమందరం కంకణబద్దులై సోదరీమణులను సైబర్ నేరాల వలలో చిక్కకుండా ప్రయత్నిద్దాం. ఇదే మనం వారికిచ్చే కానుకగా భావిద్దాం 👍🏼#telanganacops#telanganapolice
Kazipetacp@Today a person from Orissa State was arrested at #Hasanparthy PS limits of Kazipet Dvn, around 30 Kgs above #Dry Ganja was seized from his possession