ప్రతి ఒక్కరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
భారత గణత��త్ర రాజ్య ఆవిర్భవానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన సమయమిది. భారతీయుల ఆశల, ఆకాంక్షలకు ప్రతీకైనా మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్చా, సమానత్వం, ప్రజాస్వామ్య విలువులకు కట్టుబడి ఉంటామని మనమంతా నేడు ప్రతిజ్ఞ చేద్దాం.
#RepublicDayIndia #HappyRepublicDay #Republic #RepublicDay
ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్లే టీఎస్ఆర్టీసీ పయ్యాలు సాఫీగా నడుస్తున్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. నిబద్ధత, క్రమ శిక్షణతో పాటు ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ.. #TSRTC ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న డ్రైవరన్నలకు.. డ్రైవర్స్ డే శుభాకాంక్షలు.
డ్రైవర్స్ డే సందర్బంగా #TSRTC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యా��్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ఉన్న డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోంది.
@TSRTCHQ @PROTSRTC #DriversDay
స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయిని. ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా వారికి ఘన నివాళి.
Remembering Savitribai Phule on her birth anniversary, a figure of courage and advocacy for female education.
#SavitriBaiPhuleJayanti
పొలారిస్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ ఉల్లాస్ ట్రస్ట్ శనివారం 'కెన్ డూ' పేరిట నిర్వహించిన వర్క్ షాప్ లో @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కాలర్ షిప్ టెస్ట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. సత్కరించారు.
Today, Chief Minister Shri. @revanth_anumula Garu launched prestigious Mahalakshmi scheme, which is aimed at providing free travel for women and third gender persons in the @TSRTCHQ buses in the State.
@BhattiCLP, @KMuraliSurekha, @mpponguleti, @Manikrao_INC, @SajjanarVC
*జేబీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (@SajjanarVC), IPS
*మహిళ���కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలుపై క్షేత్ర పరిశీలన
హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.
జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్���ే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు.
అనంతరం టీఎస్ఆర్టీ��ీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసి��ందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి.. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్స��ల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు.
ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి.. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033 ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (గ్రేటర్ హైదరాబాద్ జోన్) వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, ఖుష్రోషా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్వో, టీఎస్ఆర్టీసీ
#Hyderabad #Telangana
@revanth_anumula @PonnamLoksabha @TSRTCHQ
సెల్ ఫోనే లోకం కాదు!
రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయి.
ఖమ్మం నగరంలోని 10వ డివిజన్ నందు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు..
ఖమ్మం నగర అభివృద్ది మాత్రమే ఆకాంక్షించానని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి గా ఉన్న కూడా ఖమ్మం నగరం పైనే అత్యధిక ఫోకస్ పెట్టి హైద్రాబాద్ మహానగరం లో వస్తున్న పనులన్నీ ఇక్కడ అమలు చేయడం జరిగింది.
అభివృద్ది చేసినం అని భావించకుండా ఇదే నగరంలో సైకిల్ పై ఇంటింటికీ వెళ్ళి వాళ్ళ సమస��యలు క్షేత్ర స్థాయిలో వెళ్ళడం ద్వారానే పారిశుధ్యం సమస్యకు సమూలంగా పరిష్కరించగలిగినం.
నా చేతిలో ఉన్న ప్రతి పనిని చేయడంతో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అండగా ఉన్నామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో BRS పార్టీ బ్రహ్మానంగా గెలుపొందుతుందని, ప్రభుత్వం ప్రజలు అందించిన సంక్షేమం ను ప్రజలు గుండెల్లో ఉంచుకున్నారని వివరించారు...
ఎన్నికల్లో BRS పార్టీ అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
@BRSparty @KTRBRS
#PuvvadaAjayKumar #khammamwithpuvvada #khammamdevelopment #VoteForCar #BRS #BRSParty #VoteForDevelopmentbrs
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో #TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో ప్రయాణికులు వేయాలి.
బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను సంస్థ అందించనుంది.
ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్��ం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ��వ్వనుంది.
బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోంది.
@PROTSRTC @TSRTCHQ @CTMOTSRTC #Dasara2023 #Dasara
#TSRTC చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ గారికి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్-వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. చైర్మన్ గా రెండేళ్ల తన పదవీ కాలంలో ఆయన సంస్థకు చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ గారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని మంగళవారం టీఎస్ఆర్టీసీ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గారు మాట్లాడుతూ.. రెండేళ్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన కాలం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. చిన్నతనం నుంచే ఆర్టీసీతో తనకు అనుబంధముందన్నారు. తాను, ఎండీగా సజ్జనర్ గారు 18 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించామని, ఆ సమ���ంలో ఎన్నో సవాళ్లు తమకు స్వాగతం పలికాయని గుర్తు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. సంస్థ బాగుండాలని, 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని అనునిత్యం తపించామని చెప్పారు. తన పదవీ కాలంలోనే ఆర్టీసీ ��ద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారితో పాటు అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో గతం���ో ఎన్నడూ లేని విధంగా సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. తాను రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి.. టీఎస్ఆర్టీసీని ముందుకు నడిపించారని కొనియాడారు. చైర్మన్ గారి గైడెన్స్ పాటు ఉద్యోగులు సమిష్టిగా పనిచేయడం వల్ల సంస్థ వృద్ధి చెందుతోందని, గత రెండేళ్లలో దాదాపు రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పడానికి తనకెంతో సంతోషంగా ఉందన్నారు. సంస్థ సమస్యలను ప్రభ��త్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఫలితంగానే సంస్థలోని ప్రతి ఉద్యోగికి 1వ తేదినే జీతాలను సంస్థ ఇస్తోందన్నారు. రైతు కుటుంబం నుంచి కేబినేట్ ర్యాంకైన టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ గారు ఎదగడం ఆదర్శనీయమన్నారు. భవిష్యత్ లోనూ మరిన్నీ ఉన్నతస్థానాలను ఆయన అధిరోహించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభిలాషించారు. బాజిరెడ్డి గోవర్దన్ గారి సేవలను స్పూర్తిగా తీసుకుని, ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువచేస్తామని చెప్పారు.
ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డ���రెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగరాం, బాజిరెడ్డి గోవర్దన్ గారి కుటుంబ సభ్యులతో పాటు సంస్థ హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
@TSRTCHQ @PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay
#WorldEnvironmentHealthDay
The environment plays an important role in healthy living and the existence of life on earth. We are all dependent on the environment for food, air, water, and other needs!
Therefore, it is very important for every individual to save and protect our environment!
#environnement @TSRTCHQ #WorldEnvironmentalHealthDay
గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును శుక్రవారం(సెప్టెంబర్ 22) నుంచి #TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయ��� 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని.. ఈ కొత్త సర్వీసును ఆదరించాలని సంస్థ కోరుతోంది.
@TSRTCHQ @PROTSRTC @puvvada_ajay @KTRBRS @CTMOTSRTC
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయ���ణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.
“బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థాన���లకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ https://t.co/T98ngINDot ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు.
@TSRTCHQ @SajjanarVC @puvvada_ajay @Govardhan_MLA @CTMOTSRTC
వరంగల్లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు రేపే (సెప్టెంబర్ 23) తుది గడువు. ఆసక్తిగల అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో రిపోర్ట్ చేయాలి. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్లలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 9849425319, 8008136611 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ సదుపాయాన్ని అర్హత గల విద్యార్థులు వినియోగించుకోగలరు.
@TSRTCHQ @PROTSRTC @puvvada_ajay @Govardhan_MLA @SajjanarVC@YakaswamyChalla
"గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"
మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధ���కృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు #TeachersDay శుభాకాంక్షలు.
#TEACHers #teachersdayspecial #teachersdaycelebration @TSRTCHQ @tsrtcmdoffice
రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా కి మహిళా ప్రయాణీకుల నుండి అనుహ్య స్పందన.
సెప్టెంబర్ 5న లక్కీ డ్రా రీజియన్ వారీగా 3 నగదు బహుమతులు.
సెప్టెంబర్ 8న #MGBS నందు బహుమతులు అందజేయబడును.