##శ్రీశ్రీగారు 🙏🙏🙏
నిన్న నువ్వు నేడు నీకు నవ్వు అయితే,నువ్వు నిరంతర నవతార్కిక(nationalistic) నిర్మాణంలో నిమగ్నమయినట్టు.
అదే నిన్న నీ పిచ్చి నేడు నీకు పిచ్చి అనిపించినా అంతే..... నేనేమంటానంటే ఆ పిచ్చిని అర్థం చేసుకోగల పిచ్చోళ్ళ పిచ్చి"శుద్దపరిపూర్ణమైనది"
నేను ఎవరో తెలియకపోయినా ఆ పండు ముసలి నన్ను ‘నాయనా ’ అని పిలిచింది. 2 ||
ఎంత ముద్దుగా పిలిచిందో ఆ బోసి నోటితో,
ఆ పిలుపుతో నా గుండెలు తడిసాయి. 2||
నేనేమో ఇపుడు ఆ పండు ముసలి తండ్రిని,
ఆమె ఏమో నా కూతురు.
నేను ఎవరో తెలియకపోయినా ఆ పండు ముసలి నన్ను ‘నాయనా ’ అని పిలిచింది.
“చేసిన తప్పును రెండుసార్లు చేయకు; చేయడానికి ఇంకా ఎన్నో తప్పులు ఉన్నాయి.”😁
“Never make the same mistake twice; there are so many other mistakes to explore.”😁
నా జీవితంలో పరిచయం అయిన ప్రతి ఒక్క పాత్రకి ఋణపడి ఉంటాను.
మనసుకు గాయ పరిచి ,అనుభూతులను పోగు చేసి వెళ్ళిపోయిన వారికి కృతఙ్ఞతలు,
నాలో వారిపై ద్వేషం కలుగనివ్వను.
ఇక,అన్ని భావోద్వేగాలను సమానంగా రుచి చూపించి వెళ్ళిపోయిన వారికి,నాతో ప్రయాణిస్తూన్న వారికి కృతఙ్ఞతలు,వీరిని కోల్పోను.
అడవుల్లో దారిలేని చోట ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంది.
ఒంటరి తీరంలో ఒక మంత్రముగ్దత ఉంది.
ఎవరూ అడ్డంకి చేయని చోటే నిజమైన సంఘం ఉంటుంది.
లోతైన సముద్రం వద్ద, దాని గర్జనలో సంగీతం ఉంది.
మనుషుల్ని తక్కువగా ప్రేమిస్తున్నానని కాదు,
కానీ ప్రకృతిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను….
-LORD BYRON