.@ncbn గారూ ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడిపోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం.
ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా, మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా?
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వస్తూనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు.
సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనీ కదా అర్థం.
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదేకదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిడులకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా?
చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న, మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా?
చంద్రబాబుగారూ.. మీరు తప్పు చేస్తున్నారు..
అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు.
N Chandrababu Naidu garu, the way you have been conducting yourself lately clearly exposes your Government's failure and your denial of the same. Before the elections, you made countless promises just to come to power. In every public meeting, you boldly spoke about “Super Six” and “Super Seven” schemes. You even went door to door distributing bonds, misleading every family with assurances. But even after two years in power, none of the promises mentioned in your manifesto have been implemented fully, with some of them being totally ignored. Instead, you are now claiming that “Super Six” and “Super Seven” have already been fulfilled, which is nothing but a blatant lie. Unable to withstand the growing opposition from people and employees, you are taking extreme steps against those who question you. That clearly shows that you are afraid.
If the public and employees start asking questions, it simply means your governance is not up to the mark. It means the promises you made have not been fulfilled. Is it wrong to enquire about timing of implementation of the promises? Even after two years of the formation of your Government and budget for the third year being presented, is it a crime to question when you will deliver? You have contracted liabilities exceeding Rs 3.5 lakh crore. Is it an offence to ask where that money is going? When you cannot answer these questions and instead resort to vindictive actions against those who question you, Your evasive intent is clearly exposed?
What is the fault of government employees’ union president Kakarla Venkatarami Reddy? Is asking the government to resolve employees’ issues a crime? When he questioned whether the promises made to employees would be implemented, you dismissed him by invoking “Red Book governance.” What is wrong in demanding rightful dues such as pending DA, PRC, and the IR that you promised to give immediately after coming to power? These were your own manifesto promises and employees indeed have a right to qustion you on these. Everyone is observing your deceptive approach towards employees.
You behaved in a similar unjust manner in the case of CI Shankaraiah. When he stated that the Chief Minister had made false statements in the Assembly regarding the murder case of YS Vivekananda Reddy and that it caused him distress, you went to the extent of removing him from service. Is this not a clear example of authoritarian governance? When anyone questions you, you resort to vindictive actions. This again exposes your escapist attitude.
Before the elections, you promised to provide 20 lakh jobs. You assured that until people get jobs, they would receive a monthly allowance of Rs 3,000. You distributed bonds to every household making these promises. But even after two years, there are no jobs and no unemployment allowance. Instead, you are targeting people who question your Government, is this not jungle raj? You promised to double the salaries of volunteers On Ugadi 2024, but after coming to power, you dismantled the entire volunteer system, leaving around 2.6 lakh people without livelihoods. Is this not injustice?
Is it not true that, due to the pressure and harassment they were subjected to, more than 250 secretariat employees across the state have died? Mr. Chandrababu Naidu, I have a direct question. During your tenure, did AP NGOs president Ashok Babu not campaign for you in elections? Did he not solicit votes? Then why was he not dismissed? Does your government not enforce rules for your supporters, in the same manner it does for people who question you? Mr. Chandrababu Naidu, you are committing sins. That is why you are unable to confront the people and are attempting to stifle every voice that questions you.
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻
Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.
Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.
Pilgrims who once travelled with devotion and confidence now arrive with anxiety and doubt. A string of painful, preventable failures has shaken faith in the system, yet the response from the TDP government is limited to publicity exercises and after the event routine reviews, with responsibility, accountability and moral answerability nowhere in sight.
At Srisailam Temple, the breakdown became painfully clear when Police Lathi Charged Shiva Mala Dharana devotees. For years, Lord Shiva devotees who arrived on padayatra had time across the Shivaratri season to fulfil their vow with dignity. Now the window has been compressed to seven days. Authorities knew lakhs would arrive, yet failed to put in place adequate arrangements. Drinking water, shade, queues and medical help were insufficient. Families waited for hours in punishing conditions. Slogans rose against Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan, but instead of providing relief, Government resorted to using force. Devotees who came to pray were beaten with lathis.
⚠️⚠️Even after earlier tragedies, the TDP government failed to reform.
Temple tragedies in Andhra Pradesh in 2025:
📍 Tirumala Venkateswara Temple, Tirupati – 8 January 2025 – 6 devotees died in a stampede while queuing for Vaikunta Ekadasi tokens. This happened for the first time in the history of TTD.
📍 Sri Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam – 30 April 2025 – 7 devotees died when a newly constructed low-in quality wall collapsed during Chandanotsavam.
📍 Venkateswara Swamy Temple, Kasibugga – 1 November 2025 – 9 devotees died in a stampede during Karthika Ekadasi.
Many more such incidents have been occurring across the state. Each tragedy rang like a loud alarm demanding urgent correction, yet it was brushed aside without meaningful action
⚠️⚠️ Chandrababu Naidu’s cheap politics now dominate sacred spaces, with the Tirumala laddu dragged into repeated controversies for political mileage, hurting crores of devotees, damaging the reputation of temples, and now this has reached all temples across the state. When @ncbn and @PawanKalyan speak of Sanatana Dharma yet stay silent on devotees being humiliated and beaten, people ask who will take responsibility.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు.
శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.
దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు.
⚠️⚠️ రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..:
•📍 తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.
•📍 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారు.
•📍 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది.
⚠️⚠️ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబుగారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.
భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ
సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Former Chief Minister and YSRCP Chief YS Jagan Mohan Reddy attended the wedding ceremony of YS Sunil Reddy’s son in Chennai.
On the occasion, Sri YS Jagan garu met TVK Party President Sri Vijay garu.
#YSJaganInChennai
I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing dissent and curbing free speech, disregarding several High Court directions. Fabricated cases, illegal arrests, and the misuse of Section 111 have become routine. The Court’s direction underscores the need for a fair investigation and the protection of citizens’ rights.
#SatyamevaJayate
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైతులకు ఇవ్వని మద్దతు ధర సినిమాలకి ఇస్తున్నారని మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా
ఆయుధంతో( వాట్సాప్ ,ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్ )తో ప్రతి గడపగడపకి చేరాలి