పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లా కాకుండా తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ వైస్ చైర్మన్ మరియ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ గారు భారీ జన సందోహంతో మార్కాపురం పట్టణంలోని ర్యాలీ నిర్వహించి, నిరసన కార్యక్రమం చేపట్టారు.
కొత్త ఊహలని చిగురింప చేస్తూ, సరి కొత్త లక్ష్యాలతో, ఈ సంవత్సరం అంతా నవ్వుల ఆనందాలతో తెలుగు వారందరు విరాజిల్లాలని కోరుకుంటూ ప్రతీ ఒక్కరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు !
జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ PAC ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమక్షంలో గుంటూరు జిల్లాకి చెందిన శ్రీ కంద అమర్ పార్టీలో చేరారు. శ్రీ అమర్ ఇప్పటి వరకూ ఏపీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఉన్నారు. ఆయనతోపాటు పలువురు జనసేనలో చేరారు.
అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ శ్రీ పంతం నానాజీ, బీజేపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చిలుకూరి రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆలమూరు మండలం, సందిపూడి గ్రామంలో చెరువు గట్టు మీద నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన జనసేన పార్టీ సర్పంచ్ తోట భవాని గారికి జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు మద్దతుగా నిలిచి స్థానిక MRO మరియు MDO గారికి వినతి పత్రం అందజేశారు