భారత సంగీత ప్రపంచాన్ని తన అపూర్వ గానామృతంతో అలరించిన దిగ్గజ గాయని, శ్రీమతి ఎస్. జానకి గారి మరణం సంగీత లోకానికి తీరని లోటు.
ఆరు దశాబ్దాలకు పైగా తన మధుర గానంతో కోట్లాది హృదయాలను తాకిన ఆమె స్వరం తరతరాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారతీయ సంగీతానికి ఆమె అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమైనవి.
శ్రీమతి ఎస్. జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తెలంగాణ జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
#SJanaki
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి అయినది.
దశాబ్ద కాలంగా రెండు భుజాలకు ఉన్న గాయాల నొప్పులను భరిస్తూనే నిత్యం ప్రజలలో ఉంటూ, అన్నా అని వచ్చే ప్రతీ ఒక్కరిని ఆదరిస్తూ వారి కష్టాలు తీర్చే నాయకుడు పవన్ కల్యాణ్ గారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో మీరు త్వరగా కోలుకొని మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
#GetWellSoonPawanKalyan
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
మన్యం వీరుడు, విప్లవకారుడు, బ్రిటీష్ వారి బుల్లెట్లకు రొమ్ము విరిచి ఎదురు నిలిచిన వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#AlluriSeetaramaRaju
జనసేన పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేయాలనుకుంటున్నారా? మీకు ఆసక్తి ఉన్న విభాగాల ద్వారా పార్టీకి, సమాజానికి సేవలు అందించాలి అనుకుంటున్నారా?
అయితే ఇప్పుడే కింద పేర్కొన్న జనసేన పార్టీ విభాగాల్లో పనిచేసేందుకు, నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు మీ పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ని సంప్రదించండి.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
అక్షర సత్యం
అప్పటి రంగ గారు
ఇప్పటి కళ్యాణ్ గారు
కులాలకు అతీతం గా
చేస్తున్న యజ్ఞానికి
వెన్నుముక లా ఉండండి
కులాల్ని ధాటి సమాజ హితం 🙏
చైతన్య రధం 🔥🔥🔥
చైతన్య పదం 🙏🙏🙏
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
జనసేన… ప్రజల పార్టీ
* ప్రజల సమస్యలే మన అజెండా కావాలి
* తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేద్దాం
* దేశ సమగ్రత, సమైక్యతకే మొదటి ప్రాధాన్యం
* తెలంగాణ స్ఫూర్తిని పూర్తిగా అర్ధం చేసుకున్నవాడిని
* కేరళం, తమిళనాడు, కర్ణాటకలోనూ ఇప్పుడు జనసేన ప్రస్థానం మొదలైంది
* తెలంగాణలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహణ
* తెలంగాణ నుంచి పలువురు పార్టీలో చేరిక
** తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ @PawanKalyan గారు
Exclusive visuals from a memorable day that blended emotion & Inspiration.
A historic and emotional moment for Telangana JanaSena!
Chief Sri @PawanKalyan garu graced the inauguration of the Telangana State Party Head Office, marking a significant milestone in the party's journey in Telangana.
Jai Telangana! Jai Bharat!
#JanaSenaTelangana
మీ దూషణలు, విమర్శలు, హేళనాలు, అపహాస్యాలు రాజకీయాలను దాటి అనారోగ్యంతో బాధపడుతున్న సామాన్య పిల్లల వరకు వచ్చింది.
జన్యుపరమైన సమస్యతో ఎదుగుదల లేక, యుక్త వయసులో మంచానికే పరిమితమైన వ్యక్తి మీద జాలి లేకపోగా అపహాస్యం చేయడం @YSRCParty మనస్తత్వానికి, వారి నిర్దయకు నిదర్శనం.
#YSRCriminalParty
వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు.
ఉప ముఖ్యమంత్రివర్యులు అభిమాని నిరంజన్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం అమ్మవారి వెండి ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు బహూకరించి ఆశీర్వాదాలు అందించారు.
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్ని కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మరపురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వెలిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled the wish of Niranjan, a young fan from Hanamkonda battling a rare genetic disorder, by visiting him at home.
Sri Pawan Kalyan enquired about his health, assured support to the family, provided ₹1 lakh for medical expenses, and blessed him with Lord Venkateswara’s Tirtha Prasadam. Special prayers were also offered to Goddess Bhadrakali for his speedy recovery.
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం
2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం
2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో
ప్రజా సేవకు అంకితమై,
పాలనలో తనదైన ముద్ర వేసి,
రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ...
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
Two years of the NDA government in Andhra Pradesh, built on hard work, service, and the inspiring leadership of Sri @narendramodi garu, @ncbn garu and our leader @PawanKalyan garu. Grateful for the opportunity to walk this path for our people.🙏🏻 @JanaSenaParty