THE MASS ERUPTION BEGINS! 🔥🔥
POWER STAR PAWAN KALYAN 👑
The celebrations hit different! ❤️🔥
💥MASS CUTOUT LAUNCH — DONE!
📍Sandhya Theatre, Bangalore
The cutout is up…
The garlands are ready…
And the BANGALORE MASS is about to explode! 🥵🔥
#PawanKalyan#Panja #PawanKalyanBirthday #Bangalore #PawanKalyanMania #Panja4K
రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి
• సీమ ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక విజన్
• రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు
• రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు
• 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి
• జల సంరక్షణ చర్యలతో సీమ సస్యశ్యామలం
• ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు... 28 వేల మంది రైతులకు లబ్ధి
• నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి
• 50 వేలకు పైగా ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం
• పాడి రైతుకు అండగా గోకులాలు, నీటి తొట్టెల నిర్మాణం
• సీమ దాహార్తి తీర్చేందుకు సిద్ధమవుతున్న జేజేఎం-అమరజీవి జలధారలు
• 13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపు
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో, రాయలసీమలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, అటవీ మరియు పర్యావరణ రంగాల్లో గత రెండేళ్లలో రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు, 28 వేల మందికి పైగా రైతులకు లబ్ధి, 41,614 ఫారం పాండ్లు, 15,000 మినీ గోకులాలు నిర్మించడం జరిగింది. గ్రామీణ మౌలిక వసతుల్లో రూ.4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు చేపట్టగా, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామీణ అనుసంధానం మరింత బలోపేతమవుతోంది.
జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద రూ.2,782 కోట్లతో పులివెందుల, డోన్, చిత్తూరు మెగా వాటర్ స్కీమ్‌ల పనులు పురోగతిలో ఉన్నాయి. నీటి సంరక్షణతో పాటు ఇంకుడు గుంతలు, కంపోస్ట్ గుంతలు వంటి పారిశుధ్య చర్యలు కూడా చేపట్టడం జరుగుతోంది. అటవీ రంగంలో 13 నగర వనాలు, ముసలమడుగులో కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రం, ఎకో టూరిజం, వుడ్ బ్యాంకుల వంటి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. కుంకీ ఏనుగుల చర్యలతో మానవ–ఏనుగు ఘర్షణలు 75 శాతం, పంట నష్టం 50 శాతం తగ్గడం గమనార్హం.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది.
హామీల అమలుకే ప్రథమ ప్రాధాన్యం... పిఠాపురం ఆరోగ్య రంగానికి సరికొత్త రూపు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో ఆసుపత్రుల అభివృద్ధి
• ఆయుష్ సేవల విస్తరణ.. వైద్య విద్యకు నూతన ఊపిరి
•రూ.34 కోట్లతో ఏరియా ఆసుపత్రి ఆధునికీకరణ
•సుమారు రూ.100 కోట్లుతో ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటు
•రూ. కోటి వ్యయంతో కొమరగిరి, చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
•విరవాడలో తుది దశకు చేరిన ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీ పనులు
•ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం
నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే గొప్ప ఆశయాన్ని ఆచరణలో సాకారం చేస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని సమగ్ర, అత్యున్నత ఆరోగ్య సేవలకు కేంద్రంగా, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే మోడల్ హెల్త్ హబ్‌గా ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు శ్రీ @PawanKalyan గారు తీర్చిదిద్దుతున్నారు. ప్రతి పేదవాడికీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనలో భాగంగా ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రుల అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, ఆయుష్ వైద్య సేవల విస్తరణతోపాటు వైద్య విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీనితోపాటు రోగుల ప్రయాణ సౌకర్యార్థం ఈ ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్లను కూడా నిర్మించారు.
•శరవేగంగా ఏరియా ఆసుపత్రి అభివృద్ధి
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో పిఠాపురంలోని 30 పడకల పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రూ.34 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపాదికన సాగుతుండగా, ఇప్పటికే దాదాపు 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 4.67 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక ఆసుపత్రిలో ఆధునిక ఐసీయూ, అధునాతన వైద్య పరీక్షా ప్రయోగశాలలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, 30 పడకల ప్రసూతి విభాగంతోపాటు చిన్నపిల్లల వైద్యం, కంటి వైద్యం, ఎముకల వైద్యానికి సంబంధించిన ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆరు మండలాలకు చెందిన సుమారు 3 లక్షల మంది ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఆసుపత్రికి అనుబంధంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ భవనం, మార్చురీ, లక్ష లీటర్ల సామర్థ్యం గల సంప్తోపాటు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా చేపడుతున్నారు.
•ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆయుష్ మెడికల్ కాలేజీ ఏర్పాటు
పిఠాపురం పేరును వైద్య విద్యా రంగంలో ప్రత్యేకంగా నిలబెట్టే లక్ష్యంతో, నేషనల్ ఆయుష్ మిషన్ కింద ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆయుష్ మెడికల్ కాలేజ్‌తోపాటు అనుబంధ అభివృద్ధి పనుల కోసం పిఠాపురం నియోజకవర్గంలో భూసేకరణ పనులు వేగవంతం చేశారు. ఈ కళాశాల నిర్వహణ, అనుబంధ సేవలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
(1/2)
ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ....,🤔🤔
ఒకవేళ వీళ్ళ combination set అయ్యింది అంటే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే...💥💥
అభిమానులకి పండుగే 🎆🎇🎆🎇
#PawanKalyan#sandeepreddyvanga#telugumovies