బాడీ- మైండు
ఊరికే నరాలు పెరికేస్తూ ఉంటాయి, గుంజుతూ ఉంటాయి. కానీ నెర్వ్ కండక్షన్ స్టడీ నార్మల్ గా ఉంటుంది. ఇది మానసిక వైద్యుడు చూడవలసింది.
కడుపులో ఎప్పుడూ తిప్పుతూ ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది. ఎండోస్కోపీ మొదలుకొని అన్నీ నార్మల్ గా ఉంటాయి. ఇది మానసిక వైద్యుడు చూడవలసినది.
గుండె గాభరా వచ్చేసి, ఇక ఎమర్జెన్సీకి పరుగెడతారు. అక్కడ ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్‌లు అన్నీ నార్మల్ ఉంటాయి. ఇది మానసిక వైద్యుడు చూడవలసినది.
ఊరికే బరువు తగ్గిపోతూ ఉంటారు. కడుపు, క్యాన్సర్ పరీక్షలు అన్ని నెగటివ్ వస్తాయి. ఇది మానసిక వైద్యుడు చూడవలసినది.
నిద్ర పట్టట్లేదు, తలనొప్పి తగ్గట్లేదు. ఈ ఈ జి నార్మల్, ఎమ్మారై స్కాన్ నార్మల్. ఇది కూడా మానసిక వైద్యుడు చూడవలసినదే.
మామూలుగా లేస్తుంది, మంచంమీదకి వెళ్తే పని జరగట్లేదు. పెనైల్ కలర్ డాప్లర్ నార్మల్. యూరాలజిస్ట్ ఏమో అంతా బాగుంది అంటున్నారు. ఇది కూడా మానసిక వైద్యుడు చూడవలసిందే.
పిల్లాడికి మార్కులు తగ్గుతున్నాయ్, కానీ కంటిచూపు బాగుంది. మానసిక వైద్యుడు చూడవలసిందే.
ఊపిరి బిగబట్టేసి, అస్తమా లాగా ఉంటుంది. కానీ లంగ్ ఫంక్షన్ టెస్ట్స్ అంతా నార్మల్‌గా ఉంటుంది. మానసిక వైద్యుడిని కలవాలి.
గైనకాలజిస్ట్ అంతా చూసారు, అక్కడేం ఇబ్బంది లేదు అన్నారు, కానీ సెక్స్ చేస్తుంటే బాగా నొప్పిగా ఉంది, అసలు సెక్సే వద్దంటున్నారు. మానసిక వైద్యుడు చూడాలి.
ఊరికే నీరసం ఉంటోంది. రక్త పరీక్షలు బాగున్నాయి. విటమిన్ మాత్రలు వేసుకుంటున్నా పనిచేయట్లేదు. మానసిక వైద్యుడు చూడాల్సిందే.
ఊరికే నడుము నొప్పి. ఎంతకీ తగ్గదు. ఎమ్మారై స్కాను ఏ సమస్యా లేదు. ఉన్నా కూడా ఇంత నొప్పి ఉండదు. మానసిక వైద్యుడిని కలవాల్సిందే.
నా ముక్కు వంకరగా ఉంది. సిటీ స్కాన్ బాగానే ఉంది. డాక్టర్ మాత్రం ముక్కు దూలం బాగానే ఉంది అన్నాడు. కానీ నా ముక్కు వంకరగా ఉంది. మానసిక వైద్యుడిని కలవాలి.
ఎంత నూనె, విటమిన్లు ఏమీ రాసినా జుట్టు రాలిపోతోంది. చర్మ వైద్యుడి సలహా పనిచేయట్లేదు. మానసిక వైద్యుడ్ని కలవాలి.
నా పిల్లలు ఎదగట్లేదు, తినట్లేదు. పిల్లల డాక్టర్ కంగారు ఏం లేదు అంటున్నారు. కానీ వాళ్ళు ఎదగట్లేదని నాకు తెలుసు. మానసిక వైద్యుడిని కలవాలి.
నాకు ఏదో జబ్బుంది, అది ఏ డాక్టర్ పట్టుకోలేకపోతున్నాడు. ఎన్ని టెస్టులు చేసినా దొరకట్లేదు. మానసిక వైద్యుడిని కలవాలి.
బౌలర్ బంతి వేగంగా వేస్తుంటే, బ్యాట్స్‌మన్ అయిన నువ్వు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో స్టాన్స్ తీసుకుంటే ఎలా?
@pepparsalt9 Idi vyuham ani anukunte mee brama..
E elections yela jarigayo ground level lo baga telusu.. ippudu power undi kada ani istam vachhinattu chesaru. Next potundi. Appudu gattiga nilabade leaders ni tayaru cheyalekappyaru ippativaraku 10 years lo. Waste meeru @JanaSenaParty
@sairaaj44 Meeremaina devullaa? Quee lo nilabadi darshanam chesukovadaniki? Fans mee kosam tickets kontunnaru. Valla money tho meeru enjoy chestunnaru. Give some respect to fans. Aa line yenti barricades yenti?
Multiple Civil Engineering questions were asked in AP AEE (Electrical) despite being outside the prescribed syllabus. We request a review of such questions and a fair, transparent evaluation.
Representation attached.
@aptransco_off@naralokesh@PawanKalyan@ncbn@prudhvitej157
@NBKZealot Akhanda solo ne kada mari aa musti opening baali ki yenduku raledu. Talk tarvata mundu opening aina ravali ga. 5 hitlu sequel. Balayya mass crazy hero kada
ఓకే క్లారిటీ ఇస్తున్నాను.
మనకి గొంతు నుంచి కడుపుకి ఒక గొట్టం ఉంటుంది. దానిని యూసోఫాగస్ (అన్నవాహిక) అంటారు. దానిలోపల గోడ మీద కణాలు టైల్సు వేసినట్లు ఉంటాయి. అలాగే కడుపులోపలి (స్టమక్) గోడలో కణాలు స్తంభాల్లా ఉంటాయి. అవి కడుపులో కారే యాసిడ్‌ని తట్టుకోగలవు. ఈ యాసిడ్డు పైకి తన్నకుండా అక్కడొక వాల్వు ఉంటుంది. కాబట్టి ఆహారం ఎప్పుడూ పైనుంచి కిందకే వెళ్తుంది. వెనక్కి రాదు.
అయితే కొంతమంది పొద్దున్న పళ్లు తోముకుని నాలుక గీసుకుని మొహం కడుక్కోడం మాత్రమే కాకుండా రెండు వేళ్ళని ఆ కొండనాలుక వెనక్కి తోసి, ఆ కడుపులోంది ఎక్కలాగుతారు. అది ఖాళీ కడుపు, అందులో యాసిడ్ తప్ప ఇంకేం ఉండదు. అప్పుడు ఆ యాసిడ్ కడుపులోంచి పైకొచ్చి వాంతిలా వస్తుంది. అయితే బిర్యానీ మసాలాలకి అలవాటు పడ్డ ఈ యూసోఫాగస్ గోడలు హఠాత్తుగా కింద నుంచి వచ్చిన ఈ యాసిడ్ ని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడున్న టైల్సు ఆ యాసిడ్స్‌ని తట్టుకోలేవు. అలా రోజూ వాంతి తెప్పించుకుని చేస్తే ఆ టైల్సు అరిగిపోయి ఒరిసిపోతుంది. ఎర్రగా మారుతుంది. గుండెల్లో మంట వస్తుంది.
కొన్నాళ్ళకి ఈ టైల్సు ఈ యాసిడ్‌కి పనికిరావు అని అక్కడ స్తంభాలు వస్తాయి కడుపులోలాగా. కానీ ఆ స్తంభాలు నిలకడ లేనివి. అందుకని అవి మళ్లీ మళ్లీ పడుతుంటాయి. అంటే యాసిడు, ఒరుపు, ఎరుపు, టైల్సు నుంచి స్తంభాల మార్పు ఇలా మాటి మాటికీ జరుగుతుంది. వాంతి చెయ్యటం ఆపనంత వరకూ ఇలా జరుగుతూనే ఉంటుంది.
అయితే ఒంట్లో ఇలా దేన్నైనా పదే పదే ఇబ్బంది పెడితే అది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. ఈ స్తంభాలు కొన్నిసార్లు సరిగా ఏర్పడక అక్కడ కణాలు గాడి తప్పి అవి క్యాన్సర్ కణాలు అవుతాయి. అయితే ఇలా అవ్వటం చాలా అరుదు. కానీ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు స్మోకింగ్ చేసినా, గుట్కా తిన్నా, మందు తాగినా ఇలాంటివేం చేసినా ఆ రిస్కు ఎక్కువై క్యాన్సర్ వస్తుంది.
ఇప్పుడూ నాలుక వెనక మనకి ఏముందో అనవసరం, దాన్ని లాగి ఎక్కలాగి పీకి తీయక్కర్లేదు. ఇప్పుడు లాగితే తెమడలాగా వచ్చేది మ్యూకస్ అంటారు, అది సహజం. అది యాసిడ్ నుంచి రక్షణని ఇస్తుంది. దాన్నంతా లాగి పీకి ఏం శుభ్రం చేసుకుంటావు. నీ గర్ల్‌ఫ్రెండ్ ముద్దు పెట్టినా ఆమె నాలుకేమీ మీటరు పొడవుండదు కదా లోపలికెళ్ళి నువ్వు నిన్నేం తిన్నావో లాగి తియ్యడానికి, అందుకని వర్రీ కాకుండా లోపలున్నది లోపల ఉండనీయండి. పళ్లు తోముకోండి, నాలుక గీసుకోండి, మొహం కడుక్కోండి అంతే.