పోయినేడాది నాన్న చనిపోయినప్పుడు నేనిక్కడ హైదరాబాద్‌లో ఊపిరి సలపని పని వల్ల అమ్మతో మూడు నాలుగు రోజులు కూడా ఉండలేకపోయా. ఆ తరువాతి ఆరు నెలలూ అలాగే గడిచింది.
మార్చిలో అజు పబ్లికేషన్స్ నుంచి బయటికొచ్చేసాక కొన్ని నెలలు అమ్మతో ఉందామని ఇంటికెళ్ళిపోయా. అప్పటికి అమ్మ యాభై ఏళ్ళు కలిసి ఉన్న మనిషి వదిలేసి వెళ్ళిన ఖాళీతనంలో బతుకుతోంది. నేనూ అమ్మ కలిసి ఆమెకు నచ్చే సీరియల్స్ చూస్తూ, నచ్చింది చేసుకొని తింటూ ఉన్నాం.
నా ఎగ్జిట్ ఏవేవో కాంప్లికేషన్స్తో నెలలకు నెలలు సాగుతుంటే, ఏం చెయ్యాలో తోచకుండా ఉన్న రోజుల్లో అమ్మతో ఉన్నానన్న ఆలోచనొక్కటే హాయి. అలాగే ఈ పుస్తకమొకటి రాస్తూ ఉండటం కూడా.
నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే, ఏమాలిచిస్తున్నవురా అని అడిగేది అమ్మ. ఈ పుస్తకం గురించి అని చెప్పేవాడ్ని. ఇప్పుడీ పుస్తకం రాస్తున్న ఆలోచన దూరమవ్వడం కూడా బాధే. నేనిది రాసి ఇలా పుస్తకంగా బయటికి రావడం కంటే రాయడాన్నే ఎక్కువ ఆనందించానేమో అని ఇప్పుడనిపిస్తోంది.
గత ఏడాదిన్నరగా నేనూ అమ్మా చాలా చూసొచ్చి ఇప్పుడు అమ్మ చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం ఒకరకంగా ఇద్దరికీ విజయమే.
ఎంతో నిజాయితీగా ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. చదివి ఏం చెప్తారోనని ఎదురుచూస్తుంటా.
మీకు నా ప్రేమ. 💙
Oka Endakalapu Madhyahnam is all yours now 🤗
చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు - "ఒరెయ్, నేనివ్వాళ కొన్ని రౌడీ వేషాలు వెయ్యాలి. నా హోంవర్క్ నువ్వు చేస్కొని రా" అని బెదిరించినా నాకు ఏమీ అనాలనిపించకపోయేది ఈ @madhuriketa దోస్తుని. ఇవ్వాళ తన పుట్టినరోజు.
పుట్టినరోజు శుభాకాంక్షలు దోస్తూ. 💙
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవలను అమెజాన్ ప్రైమ్ డే డీల్‌లో భాగంగా 15% డిస్కౌంట్లో కొనొచ్చు.
ప్రైమ్ డే సేల్ ఉన్నన్ని రోజులు ఈ ఆఫర్ ఉంటుంది. 🤗
Get your copy now:
https://t.co/cNsLB9EPy8
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల బయటికొచ్చి ఇవ్వాళ్టికి ఆరు నెలలు. ఈ ఆరు నెలల్లో ఈ పుస్తకం నాకెంత ప్రేమను తెచ్చిపెట్టిందో మాటల్లో చెప్పలేను. రెండొందలకు పైగా రివ్యూలు రాశారు. రోజూ ఒక మెసేజీనో ఈ-మెయిలో అందుకుంటూనే ఉన్నా. లెక్కలేనన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. నాతో గొడవ పడుతున్నారు. 'ఈ పుస్తకం నుంచి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం' అని చెప్తున్నారు.
పుస్తకానికి ఆరు నెలలైన సందర్భంగా ఇప్పటివరకు వచ్చిన రివ్యూల్లోంచి కొన్ని మాటలు సేకరించడానికి చదువుతుంటే - ఇంత మంది ఈ పుస్తకం గురించి ఇంత ఇష్టంగా రాసారా అనిపించింది.
ఏం చెప్పగలను?
మీకు నా ప్రేమ. 💙🤗
***
"This story made me stop, take a deep breath, and live."
"పాత్రలతో పాటు నేనూ vulnerable stateకి వెళ్ళిపోయా."
"ఈ పుస్తకం చదివాక ఒకటి మారిపోతుంది - బహుశా మన ప్రేమ."
"Best read of this year. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది."
"ఇది వచ్చి వెళ్ళిపోయేది కాదు – జీవితాంతం మనలో ఉండిపోయేది."
"The ending left me shivering."
"ఒక ఎండాకాలపు మధ్యాహ్నం ముగింపు మూసుకోదు, తెరుచుకుంటుంది."
"తెలియని సైలెన్స్‌లోకి వెళ్ళిపోయా."
"This book hit me with a wave of sadness or could be a tight slap on my delusions."
"OEM is a trauma I want to live in."
"Not your conventional love story. Uncomfortable. Melancholic. Very deep.
"ఈ మధ్య కాలంలో ఇంత తీవ్రమైన పర్సనల్ డైమెన్షన్ ఉన్న కథనం చదవలేదు."
"ఈ కథను అర్థం చేసుకోవడానికి మనతో మనమే యుద్ధం చెయ్యాలేమో."
"It’s a warm hug. It’s all life and love."
"జీవితంలో వేర్వేరు దశల్లో మళ్ళీ మళ్ళీ చదవాల్సిన నవల."
"ప్రేమ లోతుల్ని తాత్వికంగా చర్చకు పెట్టిన ఈ నవల నేటి యువత తప్పక చదవాలి."
"ఇప్పట్నుంచి ఇదే నా ఫేవరెట్ బుక్."
"ప్రేమలో పడాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల."
"I still can’t move on from this book."
"ఆలోచన రేకెత్తించే నవల."
"ఎండలో చాలాసేపు నడిచాక శరీరంలో మిగిలే అలసటలా, ఈ నవల చదివాక మనలో ఒక నిశ్శబ్దాన్ని మిగులుస్తుంది."
"ఈ తరం సంబంధాల్లో కనిపించే భావోద్వేగ అలసటను ఎంతో నిజాయితీగా పట్టుకున్న రచన."
"నేటి కాలానికి కావాల్సిన నవల."
"తప్పక చదవండి: for a self creative experience ride, where you will dive in to the thoughts of characters."
ఈ ఆఫర్ ఇంకో ఐదు రోజులు మాత్రమే.
అమెజాన్‌లో మేము ప్రచురించిన ఈ ఐదు పుస్తకాల్లోంచి ఏ రెండు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ వస్తుంది.
ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు. పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వచ్చేస్తుంది.
You can purchase from this link:
https://t.co/C01Zu4qAaH
ఎప్పుడూ పుస్తకాల లోకంలోనే మునిగిపోయి ఏ చింతా లేకుండా (లేదా ఉన్నా లేనట్టు..) హాయిగా బతికేసే మా అఖిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Happy birthday, @akhila_author.
All love and happiness to you 💙
తెలంగాణ పదాల జాబితా తయారుచేస్తమని చెప్తున్నరు. దాదాపు ఇరవై ఏండ్ల కిందటనే డా. నలిమెల భాస్కర్ సార్ 'తెలంగాణ పదకోశం' అనే ఈ పుస్తకం తీసుకొచ్చిండు. ఇదేమీ ప్రామాణికం కాదని ఆయనే చెప్తడు. అయితే ఒక యూనివర్శిటీ చెయ్యగలిగే పని ఒక్క మనిషి చేసి చూపించిండు.
నిన్న చర్చకొచ్చిన సినిమా (ఇడుపు కాయితం) పేరుకి అర్థం కూడా ఈ పుస్తకంల ఉన్నది.
@RagadiYT అన్నా, తెలంగాణ భాష కోసం పోరాడుతున్న అని చెప్తున్నరు సరే, మీరు నలిమెల భాస్కర్ సార్‌ని తల్చుకోకుంటే ఎట్ల?
Credit where it's due.
ఆంధ్రభారతి నిఘంటుశోధనలో తెలంగాణ పదకోశాన్ని ఇంటిగ్రేట్ చేశారు.
ఎవరికైనా ఏ పదమైనా తెలియకపోతే ఇందులో వెతికి తెలుసుకోవచ్చు. తెలంగాణ పదాలను వెక్కిరిస్తూ ఇదెక్కడి భాష అనేవాళ్ళకు ఈ వెబ్‌సైట్‌కి వెళ్తే తెలుసుకోవచ్చని తెలియకపోవడం విడ్డూరం.
"ఒడిస్సీ అంటే కేవలం ఒక వీరుడి సాహసగాథ కాదు, అది ఒక మనిషి తన ఇంటిని చేరుకోవడానికి పడే సుదీర్ఘమైన ఆరాటం."
Congratulations on your new book, @vrsiddareddy anna. Thank you for bringing Odessey to Telugu. 💙
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల బయటికొచ్చి ఇవ్వాళ్టికి ఆరు నెలలు. ఈ ఆరు నెలల్లో ఈ పుస్తకం నాకెంత ప్రేమను తెచ్చిపెట్టిందో మాటల్లో చెప్పలేను. రెండొందలకు పైగా రివ్యూలు రాశారు. రోజూ ఒక మెసేజీనో ఈ-మెయిలో అందుకుంటూనే ఉన్నా. లెక్కలేనన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. నాతో గొడవ పడుతున్నారు. 'ఈ పుస్తకం నుంచి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం' అని చెప్తున్నారు.
పుస్తకానికి ఆరు నెలలైన సందర్భంగా ఇప్పటివరకు వచ్చిన రివ్యూల్లోంచి కొన్ని మాటలు సేకరించడానికి చదువుతుంటే - ఇంత మంది ఈ పుస్తకం గురించి ఇంత ఇష్టంగా రాసారా అనిపించింది.
ఏం చెప్పగలను?
మీకు నా ప్రేమ. 💙🤗
***
"This story made me stop, take a deep breath, and live."
"పాత్రలతో పాటు నేనూ vulnerable stateకి వెళ్ళిపోయా."
"ఈ పుస్తకం చదివాక ఒకటి మారిపోతుంది - బహుశా మన ప్రేమ."
"Best read of this year. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది."
"ఇది వచ్చి వెళ్ళిపోయేది కాదు – జీవితాంతం మనలో ఉండిపోయేది."
"The ending left me shivering."
"ఒక ఎండాకాలపు మధ్యాహ్నం ముగింపు మూసుకోదు, తెరుచుకుంటుంది."
"తెలియని సైలెన్స్‌లోకి వెళ్ళిపోయా."
"This book hit me with a wave of sadness or could be a tight slap on my delusions."
"OEM is a trauma I want to live in."
"Not your conventional love story. Uncomfortable. Melancholic. Very deep.
"ఈ మధ్య కాలంలో ఇంత తీవ్రమైన పర్సనల్ డైమెన్షన్ ఉన్న కథనం చదవలేదు."
"ఈ కథను అర్థం చేసుకోవడానికి మనతో మనమే యుద్ధం చెయ్యాలేమో."
"It’s a warm hug. It’s all life and love."
"జీవితంలో వేర్వేరు దశల్లో మళ్ళీ మళ్ళీ చదవాల్సిన నవల."
"ప్రేమ లోతుల్ని తాత్వికంగా చర్చకు పెట్టిన ఈ నవల నేటి యువత తప్పక చదవాలి."
"ఇప్పట్నుంచి ఇదే నా ఫేవరెట్ బుక్."
"ప్రేమలో పడాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల."
"I still can’t move on from this book."
"ఆలోచన రేకెత్తించే నవల."
"ఎండలో చాలాసేపు నడిచాక శరీరంలో మిగిలే అలసటలా, ఈ నవల చదివాక మనలో ఒక నిశ్శబ్దాన్ని మిగులుస్తుంది."
"ఈ తరం సంబంధాల్లో కనిపించే భావోద్వేగ అలసటను ఎంతో నిజాయితీగా పట్టుకున్న రచన."
"నేటి కాలానికి కావాల్సిన నవల."
"తప్పక చదవండి: for a self creative experience ride, where you will dive in to the thoughts of characters."
ఎవరో ఎవరినో చంపుతారు. దాని గురించి ట్విటర్లో రాస్తూ killed అని కాకుండా deleted, removed, elimintated - ఇలాంటి పదాలు వాడుతున్నారు.
వాళ్ళేమైనా కంప్యూటర్ ఫైల్సారా డిలీట్ చెయ్యడానికి?
సరే, killed అని వాడితే రిస్ట్రిక్ట్ చేస్తారనుకుందాం. ఇంకో పదమే దొరకలేదా? delete..? 🙃
💙💙
పవన్ సంతోష్ అన్నయ్య మూడేళ్ళుగా యూట్యూబ్ కంటెంట్ చెయ్యట్లేదు ఎందుకనో. ఇది అన్యాయం. 😊
చంద్రబోస్ గారు ప్రస్తావించిన వీడియో ఇది -
https://t.co/3g8AE9ZcUh
నిన్న పాడుతా తీయగా కార్యక్రమంలో చంద్రబోస్ గారు నేను తొమ్మిది సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో "మధుర మధురతర మీనాక్షి" పాట గురించి చేసిన వ్యాఖ్యానాన్ని ప్రస్తావించి అందరినీ చూడమన్నారు. బోస్ గారి నుంచి ప్రశంస రావడం చాలా సంతోషంగా అనిపించింది.