నేను రాసినవి కాకుండా ‘ప్రేమలు పుస్తకాలు’ నుంచి వస్తున్న మొదటి పుస్తకం మా తమ్ముడు పవన్ రాసిన ఈ కథలు – జెన్ జీ ప్రేమలు. (#GenZPremalu)
ఈ ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతున్న పుస్తకావిష్కరణకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నా.
అందరూ వస్తారు కదూ? మీకు నా ప్రేమ. 💙
@PremaluBooks@pavan_author
సినిమావాళ్ళ ఇంటర్వ్యూలు ఒక నాలుగైదు చూసి, "ఈళ్ళకు రాదో మరేందో గానీ ఎవ్వరు తెలుగుల మాట్లాడుతలేరు" అన్నది మా అమ్మ.
నాక్కూడా నిజమే అనిపిస్తోంది. మళ్ళీ "తెలుగు మాట్లాడట్లేదు" అంటారేమోనని రెండు ఇంగ్లిష్ వాక్యాల మధ్యలో ఒక తెలుగు పదం పడేస్తున్నారనిపిస్తుంది.
I was genuinely shocked to see how drastically the paper quality of English books has declined these days.
I walked into a bookstore to buy the latest book by one of my favourite authors. The paper quality was so unbelievably poor that, for a moment, I actually wondered if I had picked up a pirated copy.
So I checked Crossword and a few other so-called premium bookstores, only to realise that this was becoming the norm. What surprised me even more was seeing big publishers like Penguin @PenguinIndia and HarperCollins @HarperCollinsIN following the same trend.
Even hardbound copies also having same worst paper quality. But pricing remains same. Is this only for the books marketed in India or even abroad also the same trend happening?
Paper quality matters. A book is something we keep, revisit and cherish for years. The texture, thickness, opacity and finish of paper contribute significantly to the reading experience. Poor paper quality, excessive show-through and glare can also make reading uncomfortable and contribute to visual fatigue and eye strain.
A book should feel like something worth preserving, not something that begins deteriorating after a few reads.
And here’s something I’m genuinely proud of: Telugu publishing may not have the enormous commercial market that English publishing enjoys, but publishers like Premalu Pusthakalu, Bodhi foundation and Bala Books etc…are still maintaining commendable paper standards, including the emerging ones.
Perhaps the market is smaller, but the respect for the physical book is still very much alive.
A book is not just about the words printed on its pages. The pages themselves matter too.
@PremaluBooks@PenguinUKBooks@penguinusa@PenguinIndia@HarperCollinsIN
#paperqualitymatters
ఇవ్వాళ రవీంద్ర భారతిలో కథానికా జీవిగా పేరున్న డా. వేదగిరి రాంబాబు గారి స్మారకంగా ఏటా అందిస్తున్న ‘డా. వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం – 2026’ అందుకున్నా.
ఎప్పట్లాగే ఎంతో నిజాయితీగా, ఎంతో ప్రేమగా కథలు రాస్తూనే ఉంటానని ఈ సభలో చెప్పిందే ఇక్కడా చెప్తున్నా.
అందరికీ ప్రేమ. 💙🤗
ఈ సినిమాలో సచిన్‌ని చూస్తే డిప్ప మీద ఒకటి కొట్టాలనిపిస్తుందంటాడు రాజమౌళి.
నాకు మాత్రం ఒక హగ్ ఇచ్చి, "it's okay. You will figure it out" అనాలనిపిస్తుంది. 🤗
Dear Girish AD,please don’t stop making rom-coms. You are truly one of the finest filmmakers around. It’s just incredibly difficult to make the kind of films you make with such warmth, honesty, and emotional depth❤️.
#BethlehemKudumbaUnit
#premalu#GirishAD
ఇవ్వాళ మెట్రోలో వస్తూంటే ఏ స్టేషన్లో చూసినా, కంపార్ట్మెంట్లో ఎటువైపు తిరిగి చూసినా ఆడవాళ్ళే. కొత్త కొత్త చీరలు. గలగల మాటలు. ముసిముసి నవ్వులు.
మీకందరికీ మీరిచ్చేంత ప్రేమ తిరిగి దక్కాలని కోరుకుంటా.
రాఖీ పండుగ శుభాకాంక్షలు 💙🤗
(రాఖీ పౌర్ణమి, 2022)
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.
చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.
ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?
నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి:
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.
ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.
మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?
కర్ణాటకలోని బళ్ళారిలో సంగం ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘కన్నడ – తెలుగు నుడిసాంగత్య: విచార సంకిరణ’ పేరుతో మే 9, 10 తేదీల్లో రెండు రోజుల సాహితీ సమావేశం జరిగింది.
ద్రావిడ భాషల ఐక్యత కోసం పనిచెయ్యాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ సంగం ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మూడొందల మంది సాహితీకారులు పాల్గొన్నారు. ఓ.ఎల్. నాగభూషణ స్వామి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత డా. పత్తిపాక మోహన్ కన్నడ – తెలుగు బాంధవ్య ప్రసంగంతో మొదలైన సమావేశం, కవి గోష్ఠి, కవి సమయం, కథా సమయం, సంగం ట్రస్ట్ పురస్కార ప్రదానం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అమరేశ్ నుగడోణితో ముఖాముఖి – ఇలాంటి వరుస సెషన్స్‌తో కన్నడలో మాట్లాడుతున్నారా? తెలుగులో మాట్లాడుతున్నారా? అనేది మరచిపోయేంత హాయిగా జరిగింది.
పబ్లిషింగ్ రంగంలో ఇప్పుడొస్తున్న మార్పులు, పాఠకుల దగ్గరికి పుస్తకాన్ని చేర్చడానికి ఏం చెయ్యాలన్న అంశంపై ఏర్పాటు చేసిన యువ ప్రచురణకర్తల చర్చలో నేను మాట్లాడా. ఆ విషయాలన్నీ ఎప్పుడైనా పంచుకుంటాను. ఇప్పటికైతే కన్నడ – తెలుగు భాషలను కలిపి చేసిన ఈ సమావేశం గురించి ఇలా చెప్పుకోవాలనిపించింది. దాదాపు అన్ని సెషన్స్‌లో ముగ్గురు తెలుగు ప్రతినిధులు, ముగ్గురు కన్నడ ప్రతినిధులు ఉండేలా ఈ సమావేశాన్ని నిర్వహించడం బాగుంది.
ఈ సమావేశాన్ని ఇంత బాగా నడిపించిన సంగం ట్రస్ట్‌కి, శివలింగప్పకు నా ప్రేమ.
(వచ్చే ఏడాది దీనికి కొనసాగింపుగా కన్నడ – తమిళ భాషలను కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారు సంగం ట్రస్ట్ నిర్వాహకులు.)